Take a fresh look at your lifestyle.

‘‌డబుల్‌’ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

  • వ్యవసాయశాఖ మంత్రి
  • సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి,మే,30(ప్రజాతంత్ర విలేకరి) : వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని అప్పాయిపల్లి వద్ద నిర్మిస్తున్న రెండు పడకల గదుల ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసి వారం రోజుల్లో 25 గృహాలను అప్పగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అప్పాయిపల్లి వద్ద నిర్మాణంలో వున్న డబల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను పరిశీలించారు. ముందుగా అప్పాయిపల్లిలోని డబల్‌బెడ్‌ ‌రూం ఇండ్లను తనిఖీ చేసిన మంత్రి తక్షనమే మూడు బ్లాక్‌లోని 24 గృహాలను పూర్తి చేసి అప్పగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వనపర్తి రహదారి విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి వారం రోజుల్లో బడల్‌బెడ్‌ ‌రూం ఇండ్లలో ఆశ్రయం కల్పించాల్సి ఉందని అందువల్ల పనులను వేగవంతం చేయాలని చెప్పారు. మిగిలిన 135 గృహాలను మరో 15 రోజుల్లో పూర్తి చేసి ఇవ్వాలని చెప్పారు. ఇండ్ల నిర్మాణంలో భాగంగా మిగిలి పోయిన పనులను ఆయన పరిశీలించారు. తక్షణమే కిటికిలు తలుపులు త్రాగునీటి కనక్షన్‌ ‌విద్యుత్‌ ‌డ్రైనేజి ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులతో పాటు ఏజెన్సీని ఆదేశించారు. పనుల్లో ఎక్కడ ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని చెప్పారు. అంతర్గత రహదారుల నిర్మాణాన్ని గురించి మాట్లాడుతు ముందుగా ప్రధాన రహదారిని పూర్తి చేయాలని ప్రధాన రహదారిపై వున్న కల్వర్టును కూడా తక్షణమే పూర్తి చేయించాలని మున్సిపల్‌ ‌కమీషనర్‌ను ఆదేశించారు. అనంతరం మంత్రి చిట్యాల వద్ద నిర్మాణంలో వున్న డబల్‌బెడ్‌ ‌రూం ఇండ్లను పరిశీలించారు. ఇక్కడ వాటర్‌ ‌క్యూరింగ్‌ ‌సక్రమంగా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతు వనపర్తి నియోజక వర్గంకు సంబంధించి చేపట్టిన 1400 డబల్‌బెడ్‌ ‌రూం ఇండ్ల నిర్మాణం త్వరితగతిని పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని తెలిపారు. పేదలకోసం నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొసాగుతుందని మూడు తాండాలు ఒక గ్రామానికి సంబంధించి గృహాలు పూర్తి చేసి లబ్దిదారులుకు ఇవ్వడానికి సిద్దం చేయడం జరిగిందని అదే విధంగా వనపర్తి మండలం పెద్దగూడెంలో 296 అప్పాయిపల్లిలో 190, చిట్యాల వద్ద 760 గృహాలు నిర్మిచడం జరుగుతుందని తెలిపారు.అప్పాయిపల్లిలోని 160 గృహాలు వారం పది రోజుల్లో పూర్తవుతాయని చిట్యాలలో 760 గృహాలకు గాను ముందుగా 24 ఇండ్లను మొదటి విడతలో నెలలో లబ్దిదారులకు ఇవ్వడం జరుగుతుందని తక్కినవి దశల వారిగా పూర్తిగా నాలుగైదు రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మంత్రి వెల్లడించారు. వనపర్తి పట్టణంలో రహదారి విస్తరణలో భాగంగా ఇండ్లు నష్టపోయిన వారు పూర్తిగా ఇల్లులేని వారు పేదలు వీరందరికి మరో రెండు వేల ఇళ్లు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విన్నవించడం జరిగిందని ఈ గృహాలు మంజూరు అయితే జిల్లాలోని ప్రజలు ఇంటి అవసరాలు తీరుతాయని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలోని లబ్దిదారులకు స్వంత స్థలాలు ఉన్నట్లయితే వారికి ఇట్టి నిర్మాణానికి డబ్బులు ఇచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. డబల్‌బెడ్‌ ‌రూం ఇండ్ల కేటాయింపులో నిరుపేదలు నిరాశ్రయులు ఎలాంటి ఆధారం లేనివారికి ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్‌ ‌యాస్మిన్‌ ‌బాష మిషన్‌ ‌భగీరథ ఎస్‌ ఈ ‌జగన్మోహన్‌, ‌పంచాయితీరాజ్‌ అరెఅండ్బి ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్లు శివకుమార్‌, ‌దేశ నాయక్‌ ‌మున్సిపల్‌ ‌చైర్మెన్‌ ‌గట్టుయాదవ్‌ ‌వైస్‌ ‌చైర్మెన్‌ ‌వాకటి శ్రీధర్‌ ‌రైతుబంధు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌ ‌రెడ్డి, ఘణపూర్‌ ఎం‌పిపి కృష్ణ నాయక్‌ ‌విద్యత్‌ ‌డిఈఆర్డీవో చంద్రారెడ్డి, మున్సిపల్‌ ‌కమీషనర్‌ ‌మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
పనులు పూర్తి చేయాలి
పట్టణంలో నిర్మిస్తున్న ఎంఎల్‌ఏ ‌క్యాంపు కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన నిర్మాణంలో ఉన్న ఎం ఎల్‌ ఏ ‌క్యాంపు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న క్యాంపు కార్యాలయ ప్రహరీ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి ప్రహరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి వనపర్తి మండలం రాజనగరం శివారులో ఉన్న ప్రభుత్వ భూములకు మార్కింగ్‌ ఇచ్చి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష మున్సిపల్‌ ‌చైర్మెన్‌ ‌గట్టు యాదవ్‌, ‌వైస్‌ ‌చైర్మెన్‌ ‌వాకిట శ్రీధర్‌ ఆర్డీఓ కె.చంద్రారెడ్డి ఆర్‌అం‌డ్‌బి ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌గోపాల్‌, ఆర్‌అం‌డ్‌బి డిప్యూటి ఇంజనీర్‌ ‌యాదయ్య, తహశీల్దార్‌ ‌రాజేందర్‌గౌడ్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy