లాక్డౌన్ కారణంగా మార్చి 2020 సంవత్సరం నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని ట్రెస్మా జిల్లా అధ్యక్షుడు కేసీ జాన్బన్ని, రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఈ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్రెడ్డిలతోపాటు ఆ కమిటి సభ్యులు జిల్లా అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు ప్రైవేట్ విద్యాసంస్థలు అనేక ఇబ్బందులు పడుతుంటే పుండు మీద కారం చల్లినట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల చర్యలు మరింత విషమంగా మారాయని ఆవేధన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విద్య ప్రపంచమంతా పరిస్థితులు అనుకూలించనందున ఆన్లైన్ విద్యను ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఇప్పటికే విద్యార్థులలో లర్నింగ్ గ్యాప్ ఏర్పడిందని, లర్నింగ్ లాస్ లేకుండా ఉండాలంటే ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న కృషిని అభినందించి సమర్థించకపోగా నిర్వహించవద్దని నోటీసులు జారీచేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019-20 విద్యా సంవత్సరానికి 45శాతానికి పైగా చెల్లించాల్సిన ఫీజు బకాయిలు పేరుకపోయాయని, పెండింగ్ ఫీజులను చెల్లించినట్లయితే తమ సిబ్బందికి నెలసరి ఈఎంఐలు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు.
అలా కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థల ఆర్థిక మూలాలను కృంగదీసి, కృషింపచేయునట్లుగా ప్రభుత్వ చర్యలున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు.ఫీజుల చెల్లింపులు లేనపుడు సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించగలమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ను విధించిన అనంతరం ప్రజలు బయటకనపడితే చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, ఒక పక్క మేం రోడ్లపైకి వచ్చి విద్యాసంస్థలు తెరిచి పాఠశాలలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేయాలని, కార్యాలయంలో సబ్మిట్చేయాలని, డాటా ఎంట్రీ చేయాలని రకరకాలుగా నోటీసులు పంపడం సరికాదన్నారు. కార్పోరేట్ సంస్థలు రాష్ట్రమంతటా పాగా వేసి 150 నుంచి 300ల సంస్థలు, 30లక్షల మంది విద్యార్థు)తో రాష్ట్ర విద్యావ్యవస్థను కబంద హస్తాలలో బందించి జరుగుతున్న కుట్రను ఎవరు గుర్తించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో నడుస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలను పేర్లు మార్చి, నిబంధనలను పాటించక, అక్రమాలకు నిలయంగా మారినప్పటికి సంబంధిత అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడకపోవడం ఇదెక్కడి న్యాయమని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య సలహాదారు నర్సిరెడ్డి, ఘన్పూర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, జనగామ డివిజన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు సలాఉద్దీన్తోపాటు ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.