Take a fresh look at your lifestyle.

నా ఇంటిపై దాడిచేసిన వారిపై ఎందుకు కేసు పెట్టలేదు

జూబ్లీహిల్స్ ‌పోలీసుల తీరుపై..టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. తన ఇంటిపైకి వొచ్చిన టీఆర్‌ఎస్‌ ‌నేతలను ఎందుకు అరెస్ట్ ‌చేయలేదని నిలదీశారు. దీనిపై ఆయన పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఆయన నేరుగా జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కే వెళ్లి మంగళవారం జూబ్లీహిల్స్ ‌లోని తన నివాసం వద్ద టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు గొడవ చేసిన విషయంలో గొడవకు దిగిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను అరెస్ట్ ‌చేయకుండా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను అరెస్ట్ ‌చేయడాన్ని రేవంత్‌ ‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తన అనుచరులను ఎందుకు అరెస్ట్ ‌చేశారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

సీసీ పుటేజీ ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాము గాయపడ్డామని బాధితులు చెబితే…ఎందుకు కేసు ఫైల్‌ ‌చేయరని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ అనుచరులకు..పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను అరెస్ట్ ‌చేసి, చర్యలు తీసుకోకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply