Take a fresh look at your lifestyle.

సంజయ్‌..‌బీహార్‌లో ఫ్యాక్టరీలు కడితే లేబర్‌ ఇక్కడకు ఎందుకొస్తున్నట్లు..

ఉత్తమ్‌..‌నేను హ్యాపీగా ఉన్నా..ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు
పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌, ‌బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్‌

‌కాంగ్రెస్‌, ‌భారతీయ జనతా పార్టీల నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో నిప్పులు చెరిగారు. గురువారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలానికి చెదిన ఎల్లం మాదిగ, మద్దెల మల్లేశం, కవితా శ్రీనివాస్‌, ‌దిలీప్‌రెడ్డితో పాటు వంద మంది నేతలు, కార్యకర్తలు  సిద్ధిపేటలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన వీరందరికీ మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు రావు మాట్లాడుతూ..దుబ్బాక నియోజకవర్గంలో గత రెండు దశబ్దాలుగా కమలం జెండాను మోసిన నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారన్నారు. కరుడుగట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు బిజెపిని వీడుతున్నారంటే దుబ్బాకలో బిజెపి అభ్యర్థి గెలవరనే దూరమవుతున్నారన్నారు.

కార్యకర్తలే కాదూ, సీనియర్లు కూడా పార్టీని వీడుతున్నారంటే పార్టీ నాయకత్వం, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై విశ్వాసం లేకనేననీ అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకే విశ్వాసం లేనప్పుడు దుబ్బాక ప్రజలకు బిజెపి పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఎలా ఉంటుందని హరీష్‌రావు ప్రశ్నించారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ ‌పార్టీకి లీడర్లు, క్యాడర్‌ ‌లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లీడర్లను చూసి  నేను గజ్జున వణుకుతున్నట్లు ఉత్తమ్‌ ‌మాట్లాడుతున్నాడనీ, తాను ఇంట్లో హ్యాపీగా ఉన్నాననీ అన్నారు. . తానెందుకు గజ్జున ఉంటానని అన్నారు. గాంధీభవన్‌ ‌నుంచి వచ్చిన నలుగురు లీడర్లకే సుతి లేదనీ, గజ్జున ఉంటే సుతి లేని కాంగ్రెస్‌ ‌నేతలే ఉంటారన్నారు. మైకు దొరికింద కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే దుబ్బాక ప్రజల ముందర నడవదన్నారు. అంతెందుకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ, కేసీఆర్‌ ‌లేకపోతే ఉత్తమ్‌ ‌జై తెలంగాణ అనే వాడా?అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల పోటీ రెండో స్థానం కోసమేననీ మంత్రి హరీష్‌రావు అన్నారు. దుబ్బాకలో బిజెపి అభ్యర్థి గెలిస్తే ఫ్యాక్టరీలు వస్తాయంటూ బిజెపి నేతలు గ్లోబెల్‌ ‌ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. బిజెపి అధికారంలో ఉన్న బీహార్‌లో ఫ్యాక్టరీలు పెడితే అక్కడి నుంచి లేబర్‌ ‌సిద్ధిపేటకు ఎందుకొస్తున్నారో బండి సంజయ్‌ ‌చెప్పాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply