Take a fresh look at your lifestyle.

‘స్మార్ట్’ ‌విద్యా బోధన సాధ్యమా..?

‘‘‌దేశవ్యాప్త లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటన తర్వాత భారతదేశంలో, 15 లక్షలకు పైగా విద్యా సంస్థలు  మూసివేసారు. సుమారు 25 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలలకు వెళ్ళ లేక పోయారు. ఈ 25 కోట్ల మంది విద్యార్థుల్లో 80% మంది విద్యార్థులు ఇడబ్ల్యుఎస్‌ ‌విభాగంలోకి వస్తారని ఒక  సర్వే తెలిపింది   భారత దేశంలో పాఠశాల విద్య  మధ్యాన్నం భోజన పధకం పై నేటికీ ఆధార పడి వుంది. కొరోనాతో రోజుకూలీలు ఉపాధి దొరకక ..సంపాదన లేక ఇబ్బంది పడుతున్న సమయంలో  సెల్‌ ‌ఫోన్‌ ఆన్‌ ‌లైన్‌ ‌విద్య  సాధ్య మా..?’’

  • ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులకు ప్రైవేట్‌ ‌విద్యా సంస్థల కసరత్తు
  • మౌళిక సదుపాయాల కోసం తల్లి తండ్రుల అవస్థలు 

లాక్‌ ‌డౌన్లోడ్‌ ‌మరింత పొడిగించాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్న తరుణంలో, స్కూల్స్ ‌ముఖ్యంగా ప్రైవేట్‌ ‌స్కూల్స్ ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసులకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసులకు విద్యార్థులు ఏ మేరకు సిద్ధంగా ఉన్నారు..? లాక్‌ ‌డౌన్‌ ఎఫెక్ట్ ‌పాఠశాల విద్యపై ఏ విధంగా ఉంది..? అన్న అంశాన్ని పరిశీలించినప్పుడు. 86% ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆన్‌ ‌లైన్‌ ‌లో శిక్షణ పొందేందుకు తగినంత సౌకర్యాలు లేవని తెలుస్తున్నది. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ‌సంబంధిత సహాయంతో పాటు విద్యార్థులకు చదువు విషయంలో మార్గదర్శకలు విద్యార్థి సమస్యలకి పరిష్కారాలు చూపే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ ‌Buddy4Study.com. ఈ ప్లాట్ఫారం దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులపై ఒక సర్వేను నిర్వహించింది, ఈ ప్లాట్ఫారం అధ్యయనాల ద్వారా ప్రస్తుత లాక్‌ ‌డౌన్‌ ‌లో భారతీయ పాఠశాల విద్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. లాక్డౌన్‌ ‌కారణంగా 86% పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు.

వీరంతా ఆన్‌లైన్‌ ‌లో విద్యను అభ్యసించ లేకపోతున్నారు అని Buddy4Study.com సర్వ్ ‌తేల్చి చెప్పింది. కోవిడ్‌- 19 ‌మహమ్మారి వ్యాప్తిని నిలువరించటానికి విధించిన లాక్డౌన్‌ ‌తో దేశంలో విద్యా సంస్థల మూసివేత జరిగి, సమాజంలోని ఆర్థికంగా బలహీనమైన విభాగానికి (EWS) చెందిన విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం అయ్యారు. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌, ఇం‌టర్నెట్‌తో సహా ఆన్‌ ‌లైన్‌ ‌చుదువుకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఇ-లెర్నింగ్‌ ‌పరిజ్ఞానం తల్లితండులను లేకపోవడం, వలన ఎకనామిక్‌ ‌వీకర్‌ ‌సెక్షన్స్ ‌విద్యార్థులు ఆన్‌లైన్‌ ‌లెర్నింగ్‌ ‌చేయలేకపోతున్నారు. దేశవ్యాపిత లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటన తర్వాత భారతదేశంలో, 15 లక్షలకు పైగా విద్యా సంస్థలు మూసివేసారు. సుమారు 25 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలలకు వెళ్ళ లేక పోయారు. ఈ 25 కోట్ల మంది విద్యార్థుల్లో 80% మంది విద్యార్థులు ఇడబ్ల్యుఎస్‌ ‌విభాగంలోకి వస్తారని సర్వే తెలిపింది. ఈ సర్వే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ‌రెండింటిలోనూ Buddy4Study.com జరిపింది. సర్వేలో కీలకమైన అంశాలు ఇలా వున్నాయి.75% కంటే ఎక్కువ మంది విద్యార్థులు, తమ విద్యపై కోవిడ్‌ -19 ‌సంక్షోభం కారణంగా తీవ్ర ప్రభావం పడింది అని చెప్పారు. 11% విద్యార్థులు కొద్దిపాటి ప్రభావాన్ని ఎదుర్కొన్నాం అని చెప్పగా 7% విద్యార్థులు తమపై తక్కువ ప్రభావాన్ని కోవిడ్‌ -19 ‌సంక్షోభం చూపింది అని చెప్పారు .

దేశంలో లాక్డౌన్‌ అమలులో వున్నప్పుడు ఆన్‌లైన్‌ ‌స్టడీకి సంబంధించి విద్యార్థులు ఇలా తమ అనుభవాన్ని చెప్పారు. 75% కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇంతకు ముందెన్నడూ ఆన్‌లైన్‌ ‌లో చదవటం నేర్చుకోక పోవటం వలన ఆన్‌లైన్‌ ‌కోర్సును అభ్యసించడం కష్టమని చెప్పారు. 79% మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ‌లెర్నింగ్‌ ‌సొల్యూషన్‌ అసౌకర్యంగా ఉందని అన్నారు. ఆన్‌లైన్‌ ‌లెర్నింగ్‌ ‌వైపు మారడానికి తమకు సహాయం కావాలి అని సుమారు 90% మంది విద్యార్థులు చెప్పారు. మరో 30% మంది ఆన్‌లైన్‌ అభ్యాసాన్ని కొనసాగించడానికి శిక్షకుడు కూడా కావాలి అని చెప్పారు. ఆన్‌లైన్‌ అభ్యాసం అలవాటు చేయడానికి వారానికి లేదా నెలవారీ ఒకసారి సందేహ క్లియరింగ్‌ ‌సెషన్‌లు అవసరమని 80% కంటే ఎక్కువ మంది విద్యార్థులు చెబుతున్నారు. Buddy4Study.com., సిఇఒ మంజీత్‌ ‌సింగ్‌ ‌మాట్లాడుతూ, ‘‘మారుతున్న పరిస్థితికి అనుగుణనంగా అభ్యాస పద్ధతుల్లో మార్పును మేము సమర్థిస్తున్నప్పుడు గమనించింది ఏమంటే భారతదేశంలో ఇడబ్ల్యుఎస్‌ ‌విద్యార్థులకు, సవాళ్లు పెరిగాయి. సమన అవకాశలు సమాజంలో వారికి అందుబాటులోకి రాక ఇంటర్‌ ‌నెట్‌ ‌చేతిలో ఫోన్‌ ‌పట్టుకోవడం అనే పరిస్థితి ఎకనామిక్‌ ‌వీకర్‌ ‌సెక్సషన్స్ ‌కి లేదు . ఆన్‌లైన్‌ అభ్యాస కార్యక్రమాలు వీరు అందుకోవటం ప్రస్తుత సమయంలో కష్టం’’ అని చెప్పారు .

Leave a Reply