Take a fresh look at your lifestyle.

భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో.. ఎందుకింత వివక్ష…

అప్పనపల్లి టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభలో యువకుల ఆవేదన
తోసుకున్న టిఆర్‌ఎస్‌, ‌బిజెపి, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు, యువకులు..స్వల్ప ఉద్రిక్తత

సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అప్పనపల్లిలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ నిర్వాసితుల పరిహారం చెల్లింపులో ఎందుకింత వివక్షత చూపుతున్నారంటూ యువకులు ఆవేదన వ్యక్తం చేయడంతో ఎన్నికల ప్రచార సభలో కాస్త తోపులాట జరిగింది. పోలీసుల రంగ ప్రవేశంతో తోపులాట సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్లితే…టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పనపల్లి ఎన్నికల ప్రచారానికి మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు మాట్లాడున్నంతసేపు కొంత మంది యువకులు, బిజెపి, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు…రంగనాయక, కొండపోచమ్మ సాగర్‌ ‌నిర్వాసితులకో  న్యాయం, ప్యాకేజీ, మల్లన్న సాగర్‌ ‌ప్రధాన కాల్వ నిర్వాసితులకు మరో న్యాయమా? ఇదెక్కడి అన్యాయం.

భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్షత ఎందుకని ప్రశ్నించారు. యువకులు, బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతల మాటల తీరును గ్రహించిన మంత్రి హరీష్‌రావు వారి వద్దకు వెళ్లి  సమాధానం చెబుతుండగా అందులో కొంత మంది సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాక ఒక కన్ను అంటివి సార్‌. ‌సిద్దిపేటలోని రంగనాయక, గజ్వేల్‌లోని కొండపోచమ్మ సాగర్‌ ‌నిర్వాసితులకు ఒక రకమైన ప్యాకేజీ ఇస్తివి, దుబ్బాకలోని మల్లన్న సాగర్‌ ‌ప్రధాన కాల్వ నిర్వాసితులకు మరొక్క రకమైన ప్యాకేజీ ఇచ్చి ఎందుకింత వివక్షత చూపెట్టారని అడగడంతో మంత్రి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలకు, బిజెపి, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  పోలీసులొచ్చి సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply