- ఎస్వీబీసీ ఛానల్ తీరుపై బిజెపి మండిపాటు
- వివరణ ఇవ్వాలని బిజెపి నేత విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్
విజయవాడ,ఆగస్ట్ 6 : అయోధ్య రామమందిరం భూమిపూజను టీటీడీ ప్రసారం చేయకపోవడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్‌లో ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఎస్వీబీసీ ఛానల్, బాధ్యుల ద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ ప్రచారం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేయాలని మూల సిద్దాంతాన్ని దేవుడి ఆశయాన్ని నీరు గారుస్తున్నారని తీవ్రస్థాయిలో విష్ణువర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్వీబీసీ అసలు ఉద్దేశం ధర్మ ప్రచారం కోసం అందులో హిందూ ధర్మ ప్రచారం కోసమే అని టీటీడీ గుర్తు చేస్తున్నానని తెలిపారు.
వీవీఐపీలు, రాజకీయ నాయకుల తిరుమల దర్శనం మాత్రం ముందు వరుసలో కనపడుతాయని… ప్రపంచంలో 250 టీవీ ఛానళ్లు అయ్యోధ్య రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారాన్ని గంటల పాటు ఇస్తే టీటీడీ ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి వెళ్లిన శారదాపీఠం విశాఖలో ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీటీడీ అయోధ్య ప్రసారాలు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్వీబీసీ సీఈవో వెంకట నాగేష్‌ను తక్షణం విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి వెంటనే దీనిపై విచారణ చేపట్టి… 24 గంటలలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి… తక్షణం స్పందించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.