Take a fresh look at your lifestyle.

జీ.ఓ.3 రద్దు కుట్రలో ఎవరి పాలెంత!?

“అసలే  ఉపాధి అవకాశాలు లేక, సహజంగా ఆస్తులు,అంతస్తులు లేకుండా దొరికే కందమూలలను తింటూ, పోడు వ్యవసాయం తో చాలీచాలని ధాన్యపు గింజలు పండిస్తూ అరకొర వసతులతో ప్రకృతిని కాపాడుకుంటూ జీవిస్తున్న గిరి పుత్రులకు
ఉన్న ఒక్క సదవకాశాన్ని కొల్లగొట్టాలని చూడడం దుర్మార్గంగానే భావించాలి.ఇదిలా ఉండగా రిజర్వేషన్‌ ‌ఫలాలు అన్ని మరో వర్గం వారు  అందుకు ఉంటున్నారని ఆందోళన చెందుతున్న అడవి బిడ్డలకు జీవో 3 రద్దు కావడం ‘‘మూలిగే నక్క మీద  తాటి పండు  పడ్డ’’ చందంగా మారింది.ఆదివాసీ జాతి చేజారి పోతున్నా హక్కులను తిరిగి సాధించుకోవాలి. లేనట్లయితే జీఓ 3   రద్దు చేయడమేకాదు, 5,6 షెడ్యూల్‌ అను తొలగించడం లాంటివి కూడా చేయవచ్చు.”

జీఓ 3 రద్దు జరగటం,ఆ పై నిరసనలు, వ్యతిరే కోద్యమాలు అన్ని కూడా పాత బడ్డాయి. ప్రజలను సంక్షోభాల తరువాత సంక్షో భాల లోకి నెట్టి వేస్తున్న పాలక వర్గాల ఎత్తు గడలు, వ్యతిరేక ఉద్యమాలు వెల్లువలా కొనసాగుతున్నది.ఈ కుట్ర వెనుక గిరిజనేతరులు మాత్రమే కాదు సామ్రాజ్యవాద,కార్పొరేట్‌ ‌పెత్తందార్లు,భూస్వామ్య అగ్రవర్ణాల వారు కూడా ఉన్నారనటం అంగీ కరించాల్సిన సత్యం. ఎందుకంటే  అటవీ సంపదపై కన్ను వేసిన బడా పారిశ్రామిక సంస్థలకు, అభివృద్ధి పేరిట విధ్వంసకర అభివృద్ధికి పాల్పడుతున్న అదృశ్యశక్తుల హస్తం ఉంది.దీని తరువాత ఒక్కొక్కటి రద్దు చేసి మొత్తంగా అడవి సంపద పై పట్టు సాధించాలనే దురాశ కనబడుతుంది. అలాంటి వారికి నేడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేయూతను అందిస్తున్నాయి.రేపు జరగబోయే ఎన్నికలల్లో పెట్టుబడి కోసం  ఓట్ల కోసం  రాజకీయాధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. షెడ్యూల్డ్ ‌ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో వంద శాతం స్థానిక గిరిజనులకే కేటాయిస్తూ ఇరవై సంవత్సరాల  క్రితం  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం 20-01-2000 న జారీ చేసిన జీఓ(3)  ఉత్తర్వులను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు  కొట్టివేస్తూ22-04- 2020 న తీర్పునిచ్చింది జస్టిస్‌ అరుణ్‌ ‌మిశ్రా నేతృత్వంలో జస్టిస్‌ ఇం‌దిరా బెనర్జీ ,జస్టిస్‌ ‌వినీత చరణ్‌, ఎమ్మార్‌ ‌షా ,అనిరుధ బోస్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం  ఈ తీర్పును వెలువరించింది ఈ తీర్పుతో ఇప్పుడే షెడ్యూల్డ్ ‌ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు  ఆశనిపాతంగా  మారింది.

భారత రాజ్యాంగం ప్రకారం 18 రాష్ట్రాలలో షెడ్యూల్‌ ఏరియాలో నివసిస్తున్న గిరిజనులకు వారి సాంఘిక, ఆర్థిక, రాజకీయాభివృద్ధి కోసమై ఆర్టికల్‌ 244 ,ఆర్టికల్‌ 244(ఎ) ‌ల ప్రకారం రాజ్యాంగంలో ఐదవ, ఆరోవ షెడ్యూల్లను చేరుస్తున్నట్టు రాష్ట్రపతి డిక్లేర్‌ ‌చేశారు.ఐదవ షెడ్యూల్లో ఆదివాసీలు నివసిస్తున్న రాష్ట్రాలలో వారు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాలని నిర్దేశిస్తూ ఆరవ షెడ్యూల్లో అస్సాం,త్రిపుర,మేఘాలయ మిజోరాం రాష్ట్రాలకు సంబంధించిన గిరిజనులకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఆదివాసీలను అభివృద్ధి పరచడానికి ఆనాటి రాజ్యాంగంలో వీటిని చేర్చారు. రాజ్యాంగంలో ఈ షెడ్యూల్లను ఆదివాసీల  పై ప్రేమతో కానీ, దయతో కానీ చేర్చారనుకుంటే పొరబడ్డట్టే! భారత స్వాతంత్య్రానికి పూర్వం  వందల ఏళ్లపొటు తమ స్వయం పాలన కోసం ఆదివాసీలు రక్తం చిందించిన పోరాటాల ఫలితమని గుర్తెరగాలి. పోరాట ఫలితంగానే 1874లో వచ్చిన ‘‘షెడ్యూల్‌ ‌జిల్లాల చట్టం 1935’’ నాటికి అప్పటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఈశాన్య భారత దేశాన్ని ‘‘గిరిజన ప్రాంతం’’ గా.ప్రకటించారు. తెలంగాణ లో 1940లో ఆదిలాబాద్‌ ‌జిల్లాలో జోడేఘాట్‌ ‌వద్ద ఆదివాసీ గిరిజనహక్కుల పోరాట యోధుడు కొమురం భీమ్‌ ‘‘‌జల్‌,‌జమీన్‌,‌జంగల్‌’’ ‌ల పై స్వయం పాలన కోసం అప్పటి నిజాం సర్కార్‌ ‌పై వీరోచితంగా పోరాడి అసువులు బాసిన ఫలితంగానే  ‘‘ఫసిలి చట్టం’’  వచ్చింది.

దేశ విభజన సమయంలో ‘‘ఆదివాసీ దేశం’’డిమాండ్‌ ‌తో పోరాటం జరిగింది. అప్పటి స్వాతంత్రోద్యమ నాయకులు నెహ్రూ, గాంధీ, పటేలు తీన్‌ ‌మూర్తి భవన్‌ ‌లో ఆదివాసి నాయకులతో చర్చలు జరిపి ఆదివాసీలకు స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేక హక్కులు చట్టాలు పొందుపరిచి వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని హామీతో ఐదవ షెడ్యూలు రాజ్యాంగంలో  చేర్చారు.

ఐదు,ఆరు  షెడ్యూల్లలో ఏముంది?…..
ఐదవ షెడ్యూల్‌ ఆర్టికల్‌ 244 ‌ప్రకారం షెడ్యూల్‌ ‌ప్రాంతాన్నిరాష్ట్రపతి ఒక ప్రత్యేక ఆర్డర్‌ ‌ప్రకారం డిక్లేర్‌ ‌చేయబడినప్రాంతాలుగా నిర్వచించారు.షెడ్యూల్‌ ‌ప్రాంతాల్లో ఆదివాసీలదే పాలన ఉండాలి .అనగా ‘‘మావ నాటే మావ రాజ్‌’’.(‌మా ఊళ్లో మా రాజ్య.)అని అర్ధం .షెడ్యూల్‌ ‌ప్రాంతాల్లో  20 మంది సభ్యులతో గిరిజన సలహా మండలి పేరుతో ఆదివాసుల సమగ్ర అభివృద్ధి మరియు సంరక్షణకై విద్య, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగం లాంటి అంశాలపై ప్రతి మూడు నెలలకు లేదా ఆరు నెలలకు లేదా రాష్ట్రపతి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతారు ఈ కమిటీలో మూడువంతులు గిరిజన ఎమ్మెల్యేలు ఉండాలి.షెడ్యూల్‌ ‌ప్రాంతంలో కేవలం ఆదివాసుల స్వయంపాలన అమల్లో ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో దేశపార్లమెంటు, శాసనసభలో చేయబడ్డ  చట్టాలు  చెల్లవు.ఈ ప్రాంతంలో అన్ని రకాల ఉద్యోగ నియా మకాల్లో స్థానిక గిరిజనులకే అవకాశం కల్పించాలి.ఈ ప్రాంతంలో ఆదివాసీలకు భూమి మీద హక్కులు దానిలో వెలువడే ఖనిజాలు చెరువులు ,నదులు ,అడవులు వాటి సంపదపై సర్వాధికారాలు ఉంటాయి.  ఆరవ షెడ్యూల్లో ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం ,త్రిపుర, మేఘాలయ.మిజోరాంలలో గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి చెప్పడం జరిగింది. ఇవేగాక అడవుల్లో అనాదిగా నివసిస్తున్న ఆదివాసులు తమదైన సంస్కృతి సాంప్రదా యాలతో విలసిల్లుతున్న గిరిపుత్రుల అభివృద్ధికి రాజ్యాంగ నిర్మాతలు వారి సంక్షేమం కోసం కొన్నిహక్కులు చట్టాలు కూడా చేశారు.

పదిహేనవ అధికరణం: విద్యాపరంగా ఆర్థికంగా  వెనుకబడిన షెడ్యూల్‌ ‌తెగల షెడ్యూల్‌ ‌కులాల కోసం ప్రభుత్వం  ప్రత్యేక నిబంధనలు చేయవచ్చు. 46వ అధికరణం: హరిజన,గిరిజన తెగలకు చెందిన ప్రజల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకశ్రద్ధ వహించాలని అన్ని  రకాల దోపిడి నుండి రక్షించాలని ఈ అధికరణం తెలియజేస్తుంది .ఇంకనూ 16 ,275 ,322,330 ,334 ,338 ,339, 342 అధికరణాలు కూడా షెడ్యూల్‌ ‌తెగల కులాల అభివృద్ధికి సంబంధించినవి,వారి అభివృద్ధి కోసం రాజ్యాంగం ప్రసాదించిన వి. న్యాయబద్ధంగా వాటిని  అమలు పరచవలసిన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా స్వాతంత్రం వచ్చి డెబ్బయి నాలుగు యేండ్లు పూర్తయినా ‘‘ఎక్కడ వేసిన గొంగలి’’  అక్కడే ఉన్నది.పిడికెడు మంది ధనవంతులు ప్రపంచ స్థాయి ధనవంతుల జాబితాలోకి ఎగబాకుతూ ఉంటే పేదరికంలో ఉన్నవారు కడు పేదలుగా మారుతున్నారు.

ఈ పరిస్థితుల్లో 1986లో ఆదిలాబాద్‌లో పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆదేశాల మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌. ‌శంకరన్‌ 05-11-1986 ‌న జీవో ఎం.ఎస్‌. ‌నెంబర్‌ 275 ‌ను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం షెడ్యూల్డ్ ‌ప్రాంతాల ఉద్యోగాలు షెడ్యూల్‌ ‌తెగల వారితోనే భర్తీ చేయడం జరిగింది .కొంతకాలానికి గిరిజనేతరులు కోర్టులను ఆశ్రయించి ఈ జీవోను రద్దు  చేయించడం జరిగింది. మరికొంత కాలానికి ఏజెన్సీ ప్రాంతాలలో ఉపాధ్యాయుల  హాజరు శాతాన్ని పెంచి, గిరిజన విద్యార్థుల  విద్యాభివృద్ధికి డ్రాప్‌ అవుట్‌ ‌తగ్గించడానికి ,మాతృభాషలోనే విద్యా బోధన చేయడానికి 2000 సంవత్సరంలో జనవరి 10న 275 జీవోకు కొన్ని న్యాయపరమైన సవరణలు చేపట్టి ఎస్‌ ఆర్‌ ‌శంకరన్‌,‌బీడీ శర్మల సలహాలతో జిఓ ఎంఎస్‌ ‌నెంబర్‌ 3 ‌ను తీసుకు రావడం జరిగింది .ఈ జీవో త్రీ ని ఏప్రిల్‌ 22 2020 ‌న భారత అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయడం విషాదకరం మరియు అభ్యంతరకరమైనది.భారత రాజ్యాంగాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన న్యాయమూర్తులు జీవో త్రీ రద్దు చేస్తూ రిజర్వేషన్లు  50 శాతానికి మించకూడదని జీవో త్రీ  రద్దు చేస్తూ తీర్పును వెలువరించడంతో  సామాజిక న్యాయానికి  విఘాతం ఏర్పడుతుంది.

ఐదో షెడ్యూల్‌ ‌ప్రకారం షెడ్యూల్‌ ‌ప్రాంతంలోకి ఇతరులు ప్రవేశించడం నివసించడానికి అర్హులు కాదని చెబుతుంటే ఉద్యోగాలలో వాటా అడగడం ఎంతవరకు సమంజసం? ఇది ఆదివాసి గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కు. పరిణామక్రమంలో   బ్రతుకుదెరువు కోసం  భూమి మీద పెత్తనం కోసం ఏజెన్సీ  ఏరియాలలోకి వలసలుగా వచ్చి ఆదివాసీల అస్తిత్వానికి ప్రమాదకారిగా మారడం  పాలకుల సామ్రాజ్య వాదంలో భాగమే అనవచ్చు. ఈ మధ్యకాలంలో న్యాయస్థానాల తీర్పులు అన్ని బడుగు బలహీన వర్గాల వారికి వ్యతిరేకంగా ఉంటున్నాయి.  జీవో త్రీనీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే 15 వ అధికరణం ప్రకారమే వెనుకబడిన ఎస్టీ,ఎస్సీ ల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేయవచ్చు అని ఉన్నది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల మేరకే జీవో త్రీ   నీ అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం తీసుకరావడం జరిగింది. దీనిని హైకోర్టులో సవాల్‌ ‌చేసినప్పుడు, హైకోర్టు సమర్థించింది. ఆదివాసుల  అభ్యున్నతికి  కొనసాగించాల్సిన దేనని తీర్పునిచ్చింది. కానీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేయడం చాలా బాధాకరంగా ఉన్నది.

భారత రాజ్యాంగం ప్రకారమే కాదు, సహజ న్యాయ సూత్రాల ప్రకారం కూడా ఏ పద్ధతిన  చూసిన జీవో 3 విరుద్ధం కాదు. 100% ఉపాధ్యాయ పోస్టులకు అవకాశం ఉంటేనే, ఆదివాసీలకు పూర్తి న్యాయం జరగడం లేదు. ఈ దేశంలో సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి ఆదివాసీలకు అన్యాయం చేయడం వెనుక పాలకుల దుర్బుద్ధి ని అర్థం చేసుకోవాలి. ఈ అప్రకటిత చీకటి రోజుల్లో కరోనా కల్లోల సమయంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు, సామాన్యులకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు జరిగినవి, జరుగుతున్నాయి. ఈ దేశంలో 15 శాతం భూభాగంలో  నివసిస్తున్న 8.14 శాతం గిరిజన ప్రజలు ఇప్పుడిప్పుడే ఉన్నత చదువులు చదువుకొని చిన్న ,చిన్న ఉద్యోగాలలో ముఖ్యంగా ఎక్కువగా ఉపాధ్యాయ ఉద్యోగాల లోనే స్థిరపడుతున్నారు. అసలే  ఉపాధి అవకాశాలు లేక, సహజంగా ఆస్తులు,అంతస్తులు లేకుండా దొరికే కందమూలలను తింటూ, పోడు వ్యవసాయం తో చాలీచాలని ధాన్యపు గింజలు పండిస్తూ అరకొర వసతులతో ప్రకృతిని కాపాడుకుంటూ జీవిస్తున్న గిరి పుత్రులకు ఉన్న ఒక్క సదవకాశాన్ని కొల్లగొట్టాలని చూడడం దుర్మార్గంగానే భావించాలి.ఇదిలా ఉండగా రిజర్వేషన్‌ ‌ఫలాలు అన్ని మరో వర్గం వారు  అందుకు ఉంటున్నారని ఆందోళన చెందుతున్న అడవి బిడ్డలకు జీవో 3 రద్దు కావడం ‘‘మూలిగే నక్క మీద  తాటి పండు  పడ్డ’’ చందంగా మారింది.ఆదివాసీ జాతి చేజారి పోతున్నా హక్కులను తిరిగి సాధించుకోవాలి. లేనట్లయితే జీవో 3   రద్దు చేయడమేకాదు, 5,6 షెడ్యూల్‌ అను తొలగించడం లాంటివి కూడా చేయవచ్చు.

అందువల్ల జీవో 3 ని తిరిగి సాధించుకోవడం కోసం రివ్యూ పిటిషన్‌ ‌వేసి, రాజ్యాంగబద్ధమైన ఆదివాసుల కోరిక ప్రకారం గిరిజన ప్రాంతంలోని ఉద్యోగాలు 100% వారికే చెందే విధంగా ప్రభుత్వాలు చూడాలి. ఆదివాసులు చైతన్యంతో సంఘటితంగా పోరాడి  సాధించుకోవాల్సిన అవసరం ఉంది. లేనిచో గిరిజనులలో గల అనైక్యతను ఆసరాగా చేసుకుని మొత్తంగా  రాజ్యాంగాన్ని  సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లు ఎత్తివేసేటందుకు బలమైన  కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికైనా న్యాయ బద్దంగా గిరిజనులలో గల రెండు వర్గాల వారు  కూర్చొని సహజ న్యాయ సూత్రాల ఆధారంగా రాజ్యాంగపరంగా లభించిన సదుపాయాలు ఆధారంగా చర్చించుకుని తమ సమస్యలను పరిష్కరించుకొని సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఆసన్నమైనది.  అదేవిధంగా ఎస్సీల లో గల రెండు వర్గాల వారు కూడా జనాభా పరంగా దామాషా పద్ధతిలో వర్గీకరణకు పూనుకొని, సామాజిక వెనుకబాటు నుండి అభివృద్ధిని సాధించుటకు అంబేద్కర్‌ ‌కలలు కన్నట్లు ఆర్థికంగా, రాజకీయంగా వంతు లై సామాజికంగా ఎదగాలన్నారు. అలాగే బీసీ వర్గంలో గల అనేక కులాలు, ఈమధ్య కాలంలో ఒకగ్రూపు నుండి మరో గ్రూపు కు మార్చాలని, కొన్ని కులాల వారిని ఎస్సీ, ఎస్టీల లో చేర్చాలనే వాదనలు మొదలయ్యాయి. ఈ విధంగా  80%  గా ఉన్న    ఎస్‌ ‌టి,  ఎస్సీ మరి బిసి వర్గాల లో గల అనైక్యత వల్ల, అంతర్గత పోరు కారణంగా  ప్రస్తుత కాలం లో రిజర్వేషన్లు ఎత్తివేయాలని ప్రతిభకు పట్టం కట్టాలనే  వాదనలు మొదలయ్యాయి.  ఈ వాదనలకు అనుకూలంగా పెట్టుబడి, అగ్రవర్ణాల బ్రాహ్మణీయ భావజాలం అభివృద్ధి చెంది  ప్రభుత్వాలను  తమకు అనుకూలంగా మలచుకొని ఈ దేశ మూలవాసుల ను నిర్మూలించేఅణగదొక్కే ప్రయత్నం లో 20 శాతం ఉన్న పిడికెడు మంది ప్రజలు ఉన్నందున జాగరూకులై వుండాల్సి వుంది.       ఆదివాసీ పోరాట యోధులైన కొమరం భీమ్‌,‌బిర్సా ముండా మరియు కాకతీయ రాజులను గడగడలాడించిన ఆదివాసి సమ్మక్క-సారలమ్మల ల స్ఫూర్తిగా  జీవో 3 తిరిగి సాధించేవరకు సంఘటితంగా పోరాడాలని, పోరాడితేనే హక్కులు కాపాడుకోగలమనేది గత చరిత్ర తెలిపే సత్యం.

thanda sadhanandham
తండా సదానందం, జిల్లా
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్‌. ‌మహబఃబాద్‌ ‌జిల్లా. 9989584665,

Leave a Reply