Take a fresh look at your lifestyle.

పార్థనాలయాల్లో జాగ్రత్తలు పాటించాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు జారీ

దేశవ్యాప్తంగా దశల వారీగా లాక్‌డౌన్‌ ‌సడలింపులు ఇస్తూ చివరికి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసేలా ప్రణాళికలు వేసుకుని అమలు చేస్తున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగానే పలు దేశాలు ఆలయాల్లో భక్తుల ప్రవేశాలకు అనుమతులు ఇచ్చాయి. భారత్‌లో కూడా ఈ నెల 8 నుంచి ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు ఆలయాల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆలయాలను, ప్రార్థనా స్థలాలను తరచూ శానిటైజ్‌ ‌చేయాలని, భక్తులు తగిన దూరం పాటించేలా చూడాలని, కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఆలయాల్లో చేతులు శుభ్రపరుచుకొనే సౌకర్యాలు ఉండాలని, డిస్పోజబుల్‌ ‌టిష్యూలు, వ్యర్థాలను పడేసే తొట్టెలను ఏర్పాటు చేయాలని సూచించింది. భక్తులు పరస్పర జాగ్రత్తలు పాటించాలని, ప్రార్థనా మందిరాల తలుపు గడియలు, స్విచ్చులు, భక్తులు నడిచే మార్గాల్లో, మెట్ల దగ్గర ఉండే రెయిలింగ్‌లను డిటర్జెంట్లతో తరచూ శుభ్రపర్చాలని, ఆలయాల పరిసరాలన్నింటిని తరచుగా శానిటైజ్‌ ‌చేయాలని పేర్కొన్నది

- Advertisement -

Leave a Reply