Take a fresh look at your lifestyle.

నీకు ఎవరు చెప్పాలి?

ఎవరు చెప్పాలి నీకు?
ఇంకెవరు చెప్పాలి నీకు??

ఎవరు చెప్తే రవి ప్రకాశిస్తున్నాడు
ఎవరు చెప్తే శశి చల్లధనం పంచుతుండు
ఎవరు చెప్తే వాయువు ప్రసరిస్తుంది
ఎవరు చెప్తే నీరు దాహము తీరుస్తుంది
ప్రకృతి అంతా ఇలా
నీకోసం చేస్తుంటే
నీవేమో ఎవరో చెప్పాలని ఎదురుచూస్తుంటే
ఓ మానవా నీకు ఇది న్యాయమా?

సకల మానవ ప్రాణ కోటికి ఏదో ఒకటి చెయ్‌..
‌నీలోని చైతన్యాన్ని బయటకి తియ్‌.
‌పరమాత్మ వై పరంజ్యోతి వై
ముందుచూపుతో
ముజ్జగాలను ఏలే
సమయస్ఫూర్తితో సాహసంతో అడుగెయ్‌
ఒం‌టరిగానే అడుగెయ్‌
‌గమ్యస్థానం చేరే వరకు అడుగెయ్‌
‌విశ్వం వైపు విశ్వాసంతో అడుగెయ్‌
‌నీ అడుగులే ఆధారంగా
కోత్త బాట నువ్వు వెయ్‌.!

‌మంచి కోసం పాటు పడేలా కృషి చేయి..!
విజయతీరాలను చేరేలా
అన్నింటా విజయ దుందుభి మోగించేలా అడుగులు వేయి..!!
– ఎన్‌.. ‌రాజేష్‌, (‌వీ.•• • •+ణ•జీ)

Leave a Reply