Take a fresh look at your lifestyle.

‘‘భూసేకరణ సామాన్యుల పాలిట శాపం – కార్పొరేట్లకు కొంగుబంగారం’’

“భూసేకరణలో నిర్వాసితులు ఇండ్లు,భూమి, పశువులు,చెట్లు సమస్తం కోల్పోతారు. పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమి దొరకదు. తిండికి, ఉపాధికి రెంటికీ భూమి కీలకం.వ్యవసాయం పని ,భూమి లేకపోతే రైతులు ఎందుకు పనికి రారు.పరిహారంగా డబ్బులు చెల్లించినను ,వాటితో ఎలా బ్రతకాలో తెలిసే అవకాశం కానరావడం లేదు. తమ చేతి నిండా ఉన్న పని కోల్పోయి, విద్య లేకపోవడం మూలంగా మరో పని రాక నిర్వాసితులు మరింత పేదలు అవుతున్నారు .వచ్చిన పరిహారం లో కొంత మొత్తాన్ని బ్యాంకులో దాచుకుంటున్నారు . అప్పులు తీరుస్తున్నారు. ఇంటి ఖర్చుల కోసం, పెళ్లిళ్ల కోసం ,బంగారు నగలు కొనుగోలు కోసం, విందు వినోదాలకు మరియు వాహనాల కొనుగోలు కోసం ఖర్చు పెడుతుండటం, పెట్టాల్సి రావడం తో పరిహారం లో ఎక్కువ భాగం నిరుపయోగమైన రీతిలో ఖర్చు అవుతూ0డటం మూలంగా భూసేకరణకు రైతులు సుముఖంగా ఉండక, వారు జీవన్మరణ సమస్యగా తీసుకుంటున్నారు.”

భూమి బువ్వా పెడుతోంది ,చదువు బ్రతుకునిస్తుంది అంటారు పెద్దలు.. మానవ మనుగడకు భూమి అతి ముఖ్య వనరు. భూమి లేనిది మనిషి జీవం లేదు. మానవుడే కాదు సకల జీవులకు జీవన వనరు. ఉత్పత్తి సాధనాలలో అతిముఖ్యమైనది భూమి..ఏ వస్తువు ఉత్పత్తి చేయాలన్నా , ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా ,ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలన్నా మొదట కావలసిన వనరు భూమి .ప్రకృతి ప్రసాదించిన భూమిపై మనుషులందరికీ సమ భాగస్వామ్యం ఉండాలి..కానీ చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఆదిమ కాలం నుండి నేటి వరకు ఎన్నో రకాల భూపోరాటాలు జరిగినవి .. ఈ పోరాటాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు భూ పంపిణీ చేయాలని, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మొదటి ప్రధాని నెహ్రూ భూపంపిణీకి అనేక భూ సంస్కరణలు తెచ్చారు. భూసంస్కరణలను పాలకులే నిర్వీర్య పరిచారు.

దున్నేవాడిదే భూమి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా లక్షలాది ఎకరాల భూమి పేద ప్రజల వశం కావడం, సైనిక చర్యతో తిరిగి భూస్వాముల చేతుల్లోకి పోవడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన పీవీ నరసింహారావు భూసంస్కరణలు అమలు చేయ ప్రయత్నం చేసి తన పదవిని సైతం పోగొట్టుకున్న సందర్భాల వెనక భూ పంపిణీ కీలకం…. అమాయకులైన, నిరక్షరాస్యులైన పేద ప్రజల, ఆదివాసుల నుండి వేలాది ఎకరాలు కొల్లగొట్టి భూస్వాములు గుప్పిట్లో పెట్టుకోవడం,పేద ప్రజల చేత ఊడిగం చేయించుకుంటూ ,వెట్టిచాకిరీ చేయించుకోవడంతో ఈ అన్యాయాన్ని సహించని కొందరు పేద ప్రజల భూములను రక్షించుటకు తెలంగాణ, శ్రీకాకుళం సాయుధ పోరాటాల నుండి నేడు జరుగుతున్న పోడు భూములు పోరాటం వరకు రక్తతర్పణం లేకుండా భూమి రక్షించబడి లేదు.పేద ప్రజలకు, భూమిలేని వారికి భూ పంపిణీ చేయడానికి అనేక చట్టాలు, కమిషన్లు తీసుకువచ్చినను ఆ ప్రయత్నాలు ఆశించినంతగా విజయవంతం కాలేదు. భూపంపిణీ విజయవంతం కాకుండా భూస్వాములు జమీందార్లు అడ్డుకోవడం జరిగింది. ప్రభుత్వాలు కొంతమేరకు ప్రజలకు అనుకూలంగా పని చేసేవి, చేశాయి కూడా.. నూతన సరళీకృత ఆర్థిక విధానాలు దేశంలోకి ప్రవేశపెట్టిన తర్వాత భూస్వాములు, జమీందార్లు వలే ప్రభుత్వాలు కూడా వ్యవహరించడం మొదలైంది. అభివృద్ధి పేరిట తరతరాల నుండి, వారి తాత ముత్తాతల నుండి అనుభవిస్తున్న భూమిని పేదల నుండి లాక్కొని సంపన్న వర్గాలకు కట్టబెట్టడానికి ప్రభుత్వాలు సామ,వేద, దండోపాయాలను అమలు చేస్తూ ప్రజల జీవనోపాధిని, వారి సంస్కృతిని చిన్నాభిన్నం చేస్తూ, వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసే విధంగా ప్రజా ప్రభుత్వాలు పాటు పడుతుండటం శోచనీయం .దీంతో భూసేకరణ సామాన్య పాలిట శాపమైంది ,కార్పొరేట్‌ ‌వర్గాల వారికి కొంగుబంగారం అయింది.

భూసేకరణ ఎందుకోసం…???
ప్రభుత్వం వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌ల పేరిట పరిశ్రమలు,రోడ్లు ,ఇళ్లస్థలాల కోసం, పోర్టులు, విమానాశ్రయాలు సిమెంటు, స్టీల్‌ ‌పరిశ్రమలు,థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాలు, ఐటీ పరిశ్రమల నిర్మాణం కోసం, ఈ మధ్యకాలంలో హరితహారం పేరిట భూములను ప్రభుత్వం సేకరిస్తుంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న భారీ భూసేకరణలో వ్యవసాయానికి అనువైన రెండు పంటలు పండే భూములను కూడా సేకరిస్తు0డ టంతో తమకు జీవనాధారమైన గత 30,40 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న భూమిని సేకరించి,,అభివృద్ధి పనులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడంతో తమ ప్రాణాలను కోల్పోయిన భూములను తీసుకుంటే ఊరుకునేది లేదని ప్రజలు అసహనానికి ,అశాంతికి గురి కావడంతో అలజడి చెలరేగుతుంది.ఎందుకనగా భూసేకరణలో నిర్వాసితులు ఇండ్లు,భూమి, పశువులు,చెట్లు సమస్తం కోల్పోతారు. పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమి దొరకదు. తిండికి, ఉపాధికి రెంటికీ భూమి కీలకం.వ్యవసాయం పని ,భూమి లేకపోతే రైతులు ఎందుకు పనికి రారు.పరిహారంగా డబ్బులు చెల్లించినను ,వాటితో ఎలా బ్రతకాలో తెలిసే అవకాశం కానరావడం లేదు. తమ చేతి నిండా ఉన్న పని కోల్పోయి, విద్య లేకపోవడం మూలంగా మరో పని రాక నిర్వాసితులు మరింత పేదలు అవుతున్నారు .వచ్చిన పరిహారం లో కొంత మొత్తాన్ని బ్యాంకులో దాచుకుంటున్నారు . అప్పులు తీరుస్తున్నారు. ఇంటి ఖర్చుల కోసం, పెళ్లిళ్ల కోసం ,బంగారు నగలు కొనుగోలు కోసం, విందు వినోదాలకు మరియు వాహనాల కొనుగోలు కోసం ఖర్చు పెడుతుండటం, పెట్టాల్సి రావడం తో పరిహారం లో ఎక్కువ భాగం నిరుపయోగమైన రీతిలో ఖర్చు అవుతూ0డటం మూలంగా భూసేకరణకు రైతులు సుముఖంగా ఉండక, వారు జీవన్మరణ సమస్యగా తీసుకుంటున్నారు.

దీంతో పలుచోట్ల తగాదాలు జరుగుచున్నవి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దా0… మహబూబాబాద్‌ ‌జిల్లా కొత్తగూడ, గంగారం, బయ్యారం మరియు భద్రాద్రి జిల్లా లలో అనేక దశాబ్దాలుగా పోడు సేద్యం చేస్తున్న భూముల్లో హరితహారం పేరిట ఆ భూముల్లో ఉన్న పంటను ధ్వంసం చేసి కందకాలు తీయడం, జీవితకాలం అడవిని నమ్ముకుని ,అడవిలో జీవిస్తూ పచ్చని పంటలకు పురుడు పోస్తున్న ఆదివాసీలకు మనుగడ లేకుండా వాళ్ళ జీవనాన్ని చిన్నాభిన్నం చేయడానికి పూనుకోవడంతో, ఆదివాసి రైతులు ,మహిళలు ఎదురు తిరగడంతో వారిపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించడం అటవీ ప్రాంతంలో సర్వసాధారణమైంది.. ఈ మధ్యన మెగా పార్క్ ‌పేరిట ప్రతి మండలంలో సాగు భూములను లాక్కోవడం తో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతులు ఆవేదన చెందుతున్నారు, మహబూబాద్‌ ‌జిల్లా లోని 16 మండలాల్లో మండలానికి ఒక మెగా పార్క్ ‌మంజూరు అయింది. పది ఎకరాల విస్తీర్ణంలో 30 రకాల మొక్కలు పెంచడానికి భూసేకరణ పేరుతో అధికారులు లాక్కుంటున్నారని , అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దళితులకు ఇచ్చినటువంటి భూములను లాక్కోవడం తో ఇప్పుడు ఏమి చేసి బ్రతకాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతుండటం నిత్యకృత్యమైంది. భద్రాద్రి జిల్లా అమ్మ గారి పల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు 46 ,49 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి సీతమ్మ సాగర్‌ ‌ప్రాజెక్టు పరిధిలోకి వెళ్లడంతో నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడానికి ఎకరాకు 8 లక్షల చొప్పున డిపాజిట్‌ ‌చేసింది. కానీ మార్కెట్‌ ‌రేట్‌ ‌ప్రకారం ఎకరాకు 25 లక్షల పరిహారం చెల్లించాలని రైతు ఆ పరిహారం తీసుకోలేదు.

ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రావడంతో ఆ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు… నమ్ముకున్న 25 గుంటల భూమి, ఉన్న ఇల్లు మల్లన్న సాగర్‌ ‌ప్రాజెక్టుతో మునిగిపోవడంతో ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారం చెల్లించకుండా పునరావాస కాలనీ కి తరలించడంతో పరిహారం కోసం చంద్రయ్య అనే వ్యక్తి అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన పట్టించుకోలేదని ఆవేదనతో మనస్థాపానికి గురై తనువు చాలించాడు. తమకు అన్యాయం జరిగిందని తమ కష్టాలను స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్లాలని ఉద్దేశంతో మల్లన్న సాగర్‌ ‌నిర్వాసితులు పాదయాత్ర చేపట్టడం కూడా జరిగింది. సింగరేణి ఓపెన్‌ ‌కాస్ట్ ‌విస్తరణ కోసం భూములను లాక్కొని సింగరేణి అవార్డు పాస్‌ ‌చేసి ఇస్తానన్న పరిహారం ఇవ్వలేదు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లోని మూడు గ్రామాల పరిధిలో 286 మంది రైతులకు చెందిన 708.16ఎకరాల భూమి సేకరణకు 2011లో నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఎకరాకు 14 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరగా, 2015లో ఎకరాకు 4.60 లక్షల పరిహారం చెల్లించేందుకు అవార్డు పాస్‌ ‌చేయడంతో ఆ భూములన్నీ సంస్థ పేరిట రికార్డులోకేక్కింది.

అప్పటి నుంచి సింగరేణి ఆ భూములకు పరిహారం ఇవ్వడం గానీ ,తిరిగి రైతుల పేరిట పట్టాలు ఇప్పించడం గాని చేయకపోవడంతో అన్నదాతల పాలిట శాపమైంది. ప్రభుత్వ పథకాలకు దూరమై అక్కడి రైతులు మూడేళ్లలో రెండున్నర కోట్ల రూపాయలు నష్టపోయారు .ఈ గ్రామాల్లో చనిపోయిన రైతులకు అందే ఐదు లక్షల రూపాయల బీమా కూడా అందటం లేదు. జాతీయ రహదారుల నిర్మాణం పేరిట వ్యవసాయ సాగు భూములను స్వాధీనం పరుచుకుంటూ ,నామ మాత్రపు పరిహారం అందించడంతో , భూములు కోల్పోయిన వారు చేయడానికి సేద్యపుభూమి లేక, మరోచోట కొనలేక జీవనోపాధిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం టీఎస్‌ ఐపాస్‌ ‌పేరుతో లక్షలాది ఎకరాల భూమి సేకరించి ల్యాండ్‌ ‌బ్యాంక్‌ ఏర్పాటు చేసి బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్లకు కట్టబెడుతూ ఉండటం వల్ల సామాన్యులు ,మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతుంటే,,ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి మంత్రం జెపి స్తున్నాయి. వారి హక్కులకు భంగం కలిగిస్తూ,వారి సంస్కృతిని తుడిచిపెట్టే విధంగా చేస్తూ, సకల సదుపాయాలతో అన్ని హంగులతో పునరావాసం పరిహారం చెల్లిస్తామని, నాసిరకం పనులతో నాణ్యతలేని ఇళ్లలో పునరావాసం కల్పించడం, మార్కెట్‌ ‌ధర కన్నా తక్కువగా పరిహారం చెల్లించి బలవంతంగా భూములను స్వాధీనం పరచుకోవడం పేద ప్రజలను దగా చేయడమే అవుతుంది…

tanda-sadhanandha
– తండా సదానందం, టీపీటిఏఫ్‌ ‌జిల్లాఉపాధ్యక్షుడు, మహబూబాబాద్‌ ‌జిల్లా

 

Leave a Reply