Take a fresh look at your lifestyle.

‘ఆరోగ్య సేతు ‘ రూపకర్త లెవరు ..?

  • సమాధానం లేని కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ
  • వ్యగ్తిగత డేటా భద్రతా పై పలు అనుమానాలు

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ: కొరోనా వైరస్ వ్యాప్తి నివారణకు , అవగాహనకు ‘ఆరోగ్య సేతు ‘యాప్ ఏంతో ఉపయోగకరమనీ , అవసరమని మార్చ్ నెలలో లాక్ డౌన్ సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పలు మార్లు సూచనలు చేశారు. విమాన ప్రయాణాలకు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని కూడా సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ దగ్గర మాత్రం ఆరోగ్య సేతు యాప్ రూపొందించిన వారి వివరాలు లేకపోవడం గమనార్హం. యాప్ డౌన్ లోడ్ చేసుకున్నవారి వ్యక్తిగత వివరాలు ఆ యాప్ నిక్షిప్తం కావడం పై పలు అభ్యంతరాలు ఉన్నాయి .డేటా భద్రతా పై పలు అనుమానాలు రావడం తో ఆరోగ్య సేతు యాప్ కి సంబంధించిన సమాచారం కావాలి అని కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖను కోరగా సరయిన సమాధానం రాక పోవడం తో సమాచార హక్కు కార్యకర్త ఒకరు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ను ఆశ్రయించారు .

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, మంగళవారం కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ (సిపిఐఓ) కు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రాలయంపై సమాచార హక్కు చట్టం u/s 20 కింద జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని షో-కాజ్ నోటీసులలో రాసింది. అంతే కాదు ఆరోగ్యా సేతు వెబ్‌సైట్‌ రూపకల్పన ఎప్పుడు చేసారని..? దీనిని డెవలప్ చేసింది ఎవరని..? ఎవరి ద్వారా హోస్ట్ చేయబడుతున్నది..? అలాగే aarogyasetu.gov.in అనే డొమైన్ పేరుతో వెబ్సైట్ ఎలా సృష్టించబడిందో..? మొత్తం అన్ని విషయాలు,కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ వెంటనే లిఖిత పూర్వకంగా తెలపాలి అంటూ కేంద్ర సమాచార కమిషనర్ వనజా ఎన్. సర్నా ఆదేశించారు.

సి.ఐ.సి.కమిషన్ పంపిన నోటీసులు ఎస్.కె త్యాగి, డిప్యూటీ డైరెక్టర్, డి కె సాగర్, డిప్యూటీ డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్, ఆర్ ఎ ధావన్, సీనియర్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్ & అడ్మిన్) దగ్గర వున్నాయి. అయితే,ఆరోగ్య సేతు యాప్‌ను ఎవరు సృష్టించారు..? ఫైళ్లు ఎక్కడ ఉన్నాయి..? అనే వివరాలు అధికారులు అయిన సిపిఐలలో ఒక్కరు కూడా వివరించలేకపోయారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 20 కింద మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదనే షో కాజ్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు పైన చెప్పిన సిపిఐలకు 24 నవంబర్ 2020 మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు సమయం ఉందని. అటుపై కమిషన్ బెంచ్ ముందు అధికారులు హాజరు కావాలని కేంద్ర సమాచార కమిషన్ నిర్ధేశించింది. సిపిఒలు విచారణ సమయంలో తమ వాదన వినిపించటానికి అన్ని సహాయక పత్రాలను తీసుకు రావాలని కమిషన్ ఆదేశించింది. ఈ పత్రాలు విచారణకు కనీసం 5 రోజుల ముందు కమిషన్ ముందుకు పంపాలి అని కమిషన్ ఆదేశించింది. అవకతవకలు జారితే అధికారులు బాధ్యత వహించాలి అని కేంద్ర సమాచార కమిషన్ చెప్పింది.

ఈ పరిణామాలు చోటు చేసుకోవటానికి కారణం సౌరవ్ దాస్ అనే వ్యక్తి RTI దాఖలు చేసి ఆరోగ్య సేతు యాప్ కి సంబంధించిన సమాచారం కావాలి అని కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖను కోరారు. సౌరవ్ దాస్ RTI కి ఎన్ఐసి, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (నెజిడి), ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సంబంధిత అధికారులు ఆరోగ్య సేతు యాప్ కి సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. దీనితో అతను కేంద్ర సమాచార కమిషన్ ముందుకు విషయాన్ని తీసుకువచ్చారు. ఆరోగ్య సేతు యాప్ డెవలపర్ యాప్. కనుక దీని సమాచారం కేంద్ర కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ తెలియకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ కేంద్ర సమాచార కమిషన్ ముందు తన RTI అప్లికేషన్ పెట్టాడు.అంతే కాదు సౌరవ్ దాస్ ఆరోగ్య సేతు యాప్ నం ఎలా సృష్టించబడింది, దాని సృష్టికి సంబంధించిన ఫైళ్ళు, ఈ యాప్ తయారీకి కోసం ఇన్పుట్లను ఎవరు ఇచ్చారు, మిలియన్ల భారతీయుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతున్నది లేనిది తనిఖీ చేయడానికి ఎలాంటి ఆడిట్ చర్యలు ఉన్నాయి, ఎవరైనా అనామక వినియోగదారులు ఆరోగ్య సేతు డేటాను అభివృద్ధి చేస్తున్నారా..? ఆరోగ్య సేతు డేటా ఎవరితో అయినా ప్రభుత్వం పంచుకుంటున్నాదా..? వంటి ప్రశంలు..వాటి వివరాలు ఏవి కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ దగ్గర లేవు అని కేంద్ర సమాచార కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. దీని వలన

మిలియన్ల భారతీయుల వ్యక్తిగత డేటాకి భద్రత లేకుండా పోయిందని సౌరవ్ దాస్ కమిషన్ కి తెలిపారు.ఇది భారీ స్థాయిలో ప్రజల ప్రాథమిక హక్కు ఉల్లంఘిన అని సౌరబ్ దాస్ తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ వలన ప్రజల రాజ్యాంగబద్ధ స్వేచ్ఛ హక్కును ఉలంఘన జరుగుతున్నది అనే వాదన సౌరబ్ దాస్ కేంద్ర సంచార కమిషన్ ముందు వినిపించారు.

Leave a Reply