Take a fresh look at your lifestyle.

జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడా..? మాట్లాడిస్తున్నారా..?

  • ఆయన వ్యాఖ్యలు ధిక్కారం కావా?
  • తోపు మాటలు దేనికి సంకేతం…కారెక్కుతాడా?

సంచలన వ్యాఖ్యలకు, వివాదాస్పదాలకు కేరాఫ్‌ అయిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి తాజగా పిసిసి ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన ఆగ్రహం పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన చేశారా? లేదంటే ఎవరైనా ఆయనతో అలా మాట్లాడిస్తున్నారా? అనే దానిపైన పార్టీలో, బయట చర్చ జరుగుతుంది. దీనికి కారణం లేకపోలేదు. పిసిసి రేసులో రేవంత్‌ ‌రెడ్డి పేరు వొచ్చినప్పటి నుంచి జగ్గారెడ్డి వొంటికాలు మీద శివాలెత్తు తున్నాడు. పిసిసి ప్రెసిడెంట్‌ అయ్యాక కూడా జగ్గారెడ్డి టైమ్‌ ‌దొరికినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. తాజాగా….అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ కూడా మరింత రెచ్చి పోయాడు. రేవంత్‌ ‌రెడ్డిని టార్గెట్‌ ‌చేసి మాట్లాడటమే కాకుండా, తాను పార్టీ మారాలనుకుంటే ఎవరూ ఆపలేరని, పోవాలునుకుంటే పోతాను అంటూ ఆన్‌ ‌రికార్డు, ఆఫ్‌ ‌రికార్డులో చేస్తున్న వ్యాఖ్యలు, మాట్లాడుతున్న మాటలు బట్టి ఆయనను వెనుక నుంచి ఎవరో బలమైన వ్యక్తులు నడిపిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్ల క్రితం కూడా జగ్గారెడ్డి పార్టీ మారుతాతరనే చర్చ జరిగింది. అయితే, తర్వాత ఆయనే, నన్ను ఎవరూ చేర్చుకోరు, తాను కాంగ్రెస్‌ ‌పార్టీని వీడను అని చెప్పారు. తాజాగా..అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ ‌సీఎల్పీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిని జగ్గారెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు. టీపీసీసీ ఛీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌ ‌పీసీసీ అధ్యక్షుడు కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేని అయ్యానంటూ మండిపడ్డారు. ఇక్కడ ఆయన(రేవంత్‌)‌హీరో ఏమీ కాదు. హీరోయిజం పనికి రాదు.

రేవంత్‌ ‌కంటే ఇక్కడ నేను తోపును. ఇది కాంగ్రెస్‌ ‌పార్టీనా..? ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీయా? అంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారనీ సమాచారం. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారనీ తెలుస్తుంది. టీపీసీసీ ఛీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌ ‌పీసీసీ కాకముందే నేను మూడు సార్లు ఎమ్మెల్యేనీ అయ్యానంటూ ఫైర్‌ అయ్యారు. అంతేకాకుండా పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఆవేశంతో ఊగిపోయిన ఆయన, ఇది కాంగ్రెస్‌ ‌పార్టీనా.. ? ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీయా అంటూ మండిపడ్డాడు. చర్చలేకుండానే 2 నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. జహీరాబాద్‌లో కార్యక్రమాలపై గీతా రెడ్డికి సమాచారం ఇవ్వరా? సంగారెడ్డికి వొస్తే వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌నైన నాకే సమాచారం ఇవ్వరా? అంటూ నిలదీశాడు. కనీసం ప్రోటోకాల్‌ ‌పాటించరా.. ? నాతో విభేదాలు ఉన్నట్లు రేవంత్‌ ‌చెప్పాలని అనుకుంటున్నాడా? గజ్వేల్‌ ‌సభలో నన్ను మాట్లాడనివ్వరా? ఎప్పుడు కాంగ్రెస్‌లో ఏ ఒక్కరో హీరో కాలేరని కాంగ్రెస్‌ ‌నాయకులపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే వెనకాల ఎదో జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా..తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్‌ ‌రెడ్డి చూపిస్తున్న దూకుడు పార్టీలోని సీనియర్‌ ‌నేతలకు మింగుడు పడటం లేదని స్పష్టంగా కనిపిస్తుంది.

దండోరాలు, ఆత్మగౌరవ సభల పేరుతో ఆయన అన్ని జిల్లాలను చుట్టేస్తూ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కూడా ఒకింత చుక్కలు చూపిస్తున్నాడు రేవంత్‌. ‌సరిగ్గా ఇదే టైంలో రేవంత్‌ ‌రెడ్డిని టార్గెట్‌ ‌చేసుకుని జగ్గారెడ్డి వరుసగా పేలుస్తున్న మాటల తూటాలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్‌ ‌పీసీసీ అధ్యక్షుడు కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేని అయ్యానంటూ మండిపడటమే కాకుండా ఇది కాంగ్రెస్‌ ‌పార్టీనా..? ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీయా అంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుపై కాంగ్రెస్‌ ‌నేతలు ఎవరూ కూడా ఒక మాట మాట్లాడటం లేదు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారనీ, రేవంత్‌ ‌పార్టీ ప్రోటోకాల్‌ ‌పాటించం లేదని, తనతో విభేదాలు ఉన్నట్లు రేవంత్‌ ‌బహిరంగంగా చెప్పాలని అనుకుంటున్నాడా? అంటూ నిలదీయడం వరకు ఒకే. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఏ ఒక్కరో హీరోలు కాలేరని, ఇమేజ్‌ ‌కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం కొనసాగుతుందని జగ్గారెడ్డి మాట్లాడటం …పార్టీ శ్రేణులు తప్పుబడుతున్నారు.

ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోవాలి. కానీ, ఇష్టానుసారంగా మాట్లాడటం కరెక్టు కాదంటున్నారు. పిసిసి చీఫ్‌ను నోటికి ఎంత వొస్తే అంత మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్న వాళ్లు లేకపోలేదు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికీ ధిక్కారం కిందకే వొస్తాయని అంటున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉంటే, రేవంత్‌ ‌రెడ్డి పార్టీ కార్యక్రమాలతో దూకుడుగా ఉన్నారు. తెలంగాణ సర్కారుకు సవాళ్ళను విసురుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..సొంత పార్టీకి చెందిన జగ్గారెడ్డి గత కొన్ని రోజులుగా రేవంత్‌ ‌రెడ్డిని టార్గెట్‌ ‌చేసి మాట్లాడుతున్నారు. అయితే, పార్టీకి చెందిన చాలా మంది సీనియర్లు రేవంత్‌ ‌రెడ్డితో మంచిగానే ఉంటున్నారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి సైతం..రేవంత్‌ ‌రెడ్డితో బాగానే ఉంటున్నారు. ఒక జగ్గారెడ్డి మాత్రం..అడుగడుగునా, సందర్భం చేసుకుని మరీ రేవంత్‌ ‌రెడ్డిపై మాటల తూటాలు పేలుస్తుండటం వెనకాల మతలబు కచ్చితంగా ఉంటుందనీ పార్టీకి చెందిన నేత ఒకరు శనివారం ఇక్కడ ‘ప్రజాతంత్ర’ మాట్లాడుతూ అన్నారు. రేవంత్‌ ‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని జగ్గారెడ్డి మాట్లాడుతున్న తీరును బట్టి ఆయన వెనకాల ఎవరో ఉన్నారన్నది స్పష్టంగా కనిపిస్తుందనీ, అయితే, వారు సొంత పార్టీకి చెందిన వారా? మరో పార్టీకి చెందిన వారా? తేలాల్సి ఉందన్నారు. మొత్తంగా జగ్గారెడ్డి వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌పార్టీలో, రాజకీయాల్లోకి హాట్‌ ‌టాపిక్‌ అయ్యాయి.

Leave a Reply