Take a fresh look at your lifestyle.

కొత్త రకం కొరోనా కట్టడికి జాగ్రత్తలు పాటించాలి

  • నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పకపోవొచ్చు
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక 

బ్రిటన్‌లో వెలుగులోకి వొచ్చి యావత్తు ప్రపంచాన్ని వొణికిస్తోన్న కొత్త రకం కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు ఈ నూతన రకం వ్యాప్తి అదుపు తప్పలేదని స్పష్టం చేసింది. కొరోనా కట్టడికి తొలి నుంచి అనుసరిస్తున్న విధానాలనే పాటిస్తే దీన్ని నియంత్రించవొచ్చని వివరించింది. గతంలో ఇంతకంటే భారీ స్థాయి విజృంభణను చూశామని..దానితో పోలిస్తే దీని వ్యాప్తి అదుపు తప్పలేదని చెప్పవొచ్చని అభిప్రాయపడింది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటూ కొరోనా నిబంధనల్ని పాటించాలని సూచించింది.

- Advertisement -

అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పకపోవొచ్చునని హెచ్చరించింది. ప్రస్తుతం మనం అమలు చేస్తున్న నిబంధనలనే మరింత జాగ్రత్తగా పాటించాలి. అలాగే దీర్ఘ కాలం అనుసరించాలి. అలా అయితే కొత్త రకం కొరోనా వ్యాప్తిని అదుపులో పెట్టవొచ్చు. కొన్ని విషయాల్లో మరింత కఠినంగా ఉండాల్సిన అవసరమూ ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖేల్‌ ‌ర్యాన్‌ అభిప్రాయపడ్డారు. రూపుమార్చుకున్న కొరోనా వైరస్‌ ఇప్పటి వరకు కాస్త రూపు మార్చుకున్న ఈ నూతన వైరస్‌ ‌ప్రస్తుతానికి బ్రిటన్‌తోపాటు మరో 4-5 దేశాల్లో వెలుగుచూసింది.

అయితే కొత్త రకం కొరోనా వైరస్‌ ఇం‌తకు ముందు వైరస్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్త ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్‌ ‌పేరెత్తితేనే అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది. కొరోనా కొత్త స్ట్రెయిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ‌సైంటిస్టు డాక్టర్‌ ‌సౌమ్య స్వామినాథన్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో వెలుగుచూసిన కొరోనా కొత్త స్ట్రెయిన్‌ ‌పలు దేశాల్లో ఉండవొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ ‌ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ‌సౌమ్య స్వామినాథన్‌ ‌వెల్లడించారు. యూకేలో కొరోనా కొత్త స్ట్రెయిన్‌ ‌వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.

Leave a Reply