Take a fresh look at your lifestyle.

భారత్‌కు డబ్ల్యుహెచ్‌ఓ ‌చీఫ్‌ ‌టెడ్రోస్‌ అభినందన

కొరోనా కట్టడిలో భాగంగా 100 కోట్ల కోవిడ్‌-19 ‌టీకా డోసుల పంపిణీ మైలురాయిని అధిగమించిన భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ  చీఫ్‌ ‌టెడ్రోస్‌ అధనమ్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. కొరోనా వైరస్‌ ‌నుంచి ప్రజలు, అణగారిన వర్గాలను కాపాడటంలో భారత ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, ప్రజలు సాగించిన కృషి ప్రశంసనీయమని అన్నారు.

ఇక వంద కోట్ల టీకా డోసుల పంపిణీతో భారత్‌ ‌చరిత్ర సృష్టించిందని అన్నారు.. భారత సైంటిస్టులు, సమర్థ నిర్వహణతో పాటు 130 కోట్ల మంది భారతీయుల స్పూర్తికి ఇది సంకేతమని పేర్కొన్నారు.

Leave a Reply