Take a fresh look at your lifestyle.

మగువులపై జరిగే దాడులకు దిక్కేవరూ?

మనది అతిపెద్ద  ప్రజాస్వామిక సాంప్రదాయ భావాలు కలిగిన దేశం.మన భారతదేశంలో స్త్రీలకు ,కట్టు ,బొట్టుకు విలువిచే దేశం మనది.ప్రపంచ దేశాలు మనదేశ కట్టుబాట్లకు ఎంతో విలువనిచ్చి వీటిని ఇష్ఠపడుతారు.మన పూర్వీకులు గర్బంతో ఉన్న ఆడమనిషి  గర్బ గుడిలో ఉన్న దేవునితో సమానం అన్నారు.గ్రామాలలో మహిళలు బొట్టు  వారిచీరకట్టు చూస్తేనే మాతృత్వం  కనబ డుతుంది అంతేకాదు మనకు తెలియకుండానే  రెండుచేతులతో నమస్కరిస్తాము .మహిళలను ఓర్పులో భూమాతతో పోల్చుతారు. పుట్టినప్పటి నుంచి రకరకాల పాత్రలు పోషిస్తూ తన ఔనత్యాన్ని చాటుకుంటూ  ముందుకు నడుస్తూ ,కుటుంబాన్ని నడిపిస్తుంది. అక్కగా,చెల్లిగా, స్నేహితురాలిగా, తల్లిగా ,బార్యగానడిపించేది మహిళ. ఈరోజు మగవారితో దీటుగా పోటీపడుతూ మేముసైతం అనేవిధంగా నారీమణులు ఉన్నారు.ఈనాటి సమాజంలో అటెండర్‌ ‌దగ్గర నుంచి అంతరిక్షం వరకు పోటీ పడుతున్నారు వాళ్ళు లేనిదే  ఈలోకంలేదు ‘‘అమ్మగా నీకు జన్మనిస్తుంది’’ అక్కగా నీకు తోడునిలుస్తుంది. స్నేహితురాలిగా సహాయప డుతుంది. బార్యగా జీవితం పంచుకుంటుంది . ఆడదిలేనిదే అవనిలేదు .

కాని కొంతమంది స్వార్థపు ఆలోచనలకు ఆదిలోనే బలైపోతుంది .నీవుపుట్టింది ఆడదానికే.నీవు కనేది కూడా ఆడదానే అని మరిచిపోవద్దు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి  పెళ్ళి అనే బందానికి విలువిచ్చి.నీవు కట్టిన తాళినే తన ఆరోప్రాణంగా బావించి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ  నీకష్ట ,సుఖాలలో తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ నీవిజయంలో తోడుగా నిలబడి .తనపేరును ప్రపంచానికి పరిచయం చేయని త్యాగమూర్తే మహిళ.అలాంటి మహిళలను పురిటిలో చంపేస్తున్నారు.మూర్ఖత్వంతో వంకర బుద్దులతో వంక• •చూపులు చూస్తూ  అత్యా చారాలకు పాల్ప డుతు న్నారు.ప్రేమల పేరుతో యాసిడ్‌ ‌దాడులు చేస్తూ, కత్తులతో నరికి చంపుతున్నారు .మద్యం మత్తులో ఏంచేస్తున్నారో తెలియని అయోమయ స్థితిలో ఉంటున్నారు. మానవ విలువలు ఎంతగా దిగజారపోతున్నాయో ప్రతి రోజు జరిగే దారు ణమైన సంఘటనాలలో కనబడుతుంది. ఎంతో భవిష్యత్‌ ఉన్న యువతులను మాయ మాటలతో లోబర్చుకోని వాళ్ళ జీవితాలను చిద్రం చేస్తూ, క్షణికానందాన్ని పొందే హక్కు వారి స్వంతంగా మారి ఉన్మాదా పూరిత చర్యలకు అడ్డుఅదంపు లేకుండా పోయింది. ఆడవాళ్ళు లేనిదే ఈప్రపం చమేలేదు.వాళ్ళు లేని చరిత్ర నేలేదు  ఇంకా సమాజంలో భ్రూణహత్యలు చేస్తున్నారు. ఈనాటి సమాజంలో ఎందరో మాతృమూర్తులు  పుత్రశోకంతో బా• ••పడుతున్నారు . చట్టాలు ఇంత కఠీనంగా  ఉన్న దినం ఎక్కడో ఒక చోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు  జరుగుతూనే ఉన్నాయి.వీటిని నియంత్రించుటకు మేధావులు, విద్యావేత్తలు యంవతను మంచి ఆలోచనాల వైపు నడిచేలా  కృషిచేయాలి, సమాజంలో ప్రతి పౌరుడు బాద్యతయుతంగా మెదిలి విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి పూనుకుంటూ చైతన్యం దిశగా సమాజాన్ని ప్రేరేపించాల్సిన అవసరం ఉంది.
– మాచర్ల మధుసూధన్‌ ‌గౌడ్‌ ‌సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడసంఘం, రాష్ట్ర అధికార ప్రతినిది, 9908677543

Leave a Reply