Take a fresh look at your lifestyle.

శాసనమండలి వలన ప్రయోజనం ఎవరికి?

భారతరాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రంలో సైతం శాసనసభ,శాసనమండలి కొలువు దీరాయి.  శాసనమండలిని కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం  ఆరాష్ట్ర ప్రభుత్వం పై ఆధారపడి ఉంటుందా? దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ‌జమ్ముకాశ్మీర్‌  ఏడు రాష్ట్రాలలో మాత్రమే రెండుసభలు కొనసాగుతున్నాయి. దీన్నిబట్టి  శాసనమండలి ప్రాధాన్యత ఏంటో తెలుస్తున్నది.
శాసనసభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా  నియోజకవర్గాలకు ప్రాతినిధ్యంవహిస్తూ గుర్తింపు, గౌరవం కలిగి ఉంటారు.  శాసనమండలిలో సభ్యుల ప్రాధాన్యత నామమాత్రంగానే కొనసాగుతున్నదన్న విషయం తెలిసిందే.  ఎన్నికవిధానంలో పాల్గొనాలంటే అందరికీ సమానవకాశాలున్నా,  కేవలం రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులకే ఆ అవకాశాలు లభిస్తూ, నిస్వార్ధ సేవ చేయడానికి  స్వతంత్ర అభ్యర్థులకు అందని ద్రాక్షే. . వివిధ రంగాలలో విషయాలు చర్చకు రావాలని, రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా చట్టసభలలో సభ్యత్వ  అవకాశం కోసం శాసనమండలి ఏర్పాటైంది. దీనిని పెద్దలసభ అని వ్యవహరిస్తారు .

తెలంగాణ శాసనమండలిలో సభ్యల సంఖ్య  40కాగా,  వారిలో 14మందిని  శాసనసభ్యులు, మరో 14మందిని  స్థానికసంస్థల సభ్యులు, ముగ్గురు సభ్యులను పట్టభద్రులు,  మరోముగ్గురు సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు.  ఆరుగురు సభ్యులను గవర్నర్‌  ‌నామినేట్‌ ‌చేస్తారు. ఆరు సంవత్సరాల పదవీకాలంతో, ప్రతి రెండేళ్ళకు మూడు వంతుల సభ్యుల పదవీకాలం ముగుస్తుంది.  తిరిగి స్థానాలలో మళ్ళీ ఎన్నికవడం జరుగుతాయి. సభ్రులు  సమాజ పరమైన అనేక సమస్యలకు పరిష్కారమార్గాలు సూచిస్తూ, అభివృద్ధికి దోహదపడతారు. ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల్లో రాజకీయపార్టీలు జోక్యం చేసుకుని ఆ సభను  రాజకీయ నియామకాల కోసం ఉపయోగించు కింటున్నాయి.

గవర్నర్‌ ‌కోటాలో ఆరుగురుసభ్యుల నామినేషన్‌ ‌ప్రక్రియలో  అధికారపార్టీ ప్రమేయం ప్రత్యక్షంగా ఉంటున్నది. ఎన్నికయ్యే సభ్యులు  రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు, లేదా వాటి అనుబంధ సంఘాల ప్రతినిధులే ఉంటున్నారు. ఉంటున్నారు. పట్టభద్రులు ఎన్నుకునే  ముగ్గురు సభ్యులు స్వతంత్ర అభ్యర్థులకు వెసులుబాటు ఉంటుంది. కానీ పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూడా  రాజకీయపార్టీలు జోక్యం చేసుకోవడం రివాజయింది. ఈ దఫా జరుగుతున్న ఎన్నికలు ఈ కారణంగా  ఆసక్తికరంగా మారుతున్నాయి.

- Advertisement -

ఓటర్లనమోదు ప్రక్రియలోకూడా  రాజకీయపార్టీల నేతలు నిమగ్నమై పోయారు. శాసనమండలి రాజకీయ కొలువుల నియమకానికే పనికొస్తుందన్న అనుమానం కలగుతున్నది. శాసనసభతో పోలిస్తే శాసనమండలికి ప్రజాదారణ తక్కువే. శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలకు ఇచ్చే ప్రాధాన్యత  శాసనమండలి కిదక్కదన్నమాట వాస్తవం. కేవలం ముఖ్యమంత్రి, ఇతర కీలక మంత్రులు మాట్లాడి నప్పుడు మాత్రమే మండలి వెలుగు చూస్తుంది. శాసనమండలి  ప్రాధాన్యత నామమాత్రమే.  అలాంటప్పుడు శాసనమండలి వలన ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో?   శాసనమండలి  ప్రాధాన్యతన పెంచాలి, లేదా అన్ని రాష్ట్రాలలో  ఒక్క శాసనసభను మాత్రమే  కొనసాగిస్తూ, మండలి రద్దుచేసి ప్రజలపై ఖర్చుభారాన్ని తగ్గించాలి.

polam saidhulu
డా. పోలం సైదులు ముదిరాజ్‌,
9441930361

Leave a Reply