Take a fresh look at your lifestyle.

ఎవరు నువ్వు?

ఎవరు నువ్వు
ఎందుకో ఆ నవ్వు
నీ వదనం చూపించావు
మై మరిపించావు
అంతలోనే
అంతర్ధానం అయ్యావు.
నీ నయన చూపులతో
నా మనసును
నృత్యం చేయిస్తున్నావు..
నన్ను నేను
మరిచిపోయేలా
ఏదో మాయ చేసేసావు..
నా మది సవ్వడి
నీకు చెప్పేయాలని
తపన కలిగించావు..
నా భావాలు గొంతు
నుండి వెలువడే లోగా
చిలిపి సరాగాలతో
మాయం అయిపోతున్నావు
నా ఎద ఆత్రుత
నీకు తెలిసినా కూడా
నా విరహ వేదన
చాటుగా చూస్తూ
ముసి ముసి నవ్వులు
నవ్వుకుంటున్నావు..
నిన్ను చూడాలని ఉంది
నా ఆరాధనతో
నీకు అభిషేకం
చేయాలని ఉంది..
నీకెన్నో చెప్పాలని ఉంది.
నీకే చెప్పాలని ఉంది..
నీ అదృశ్యం
ఈ నిశ్శబ్దం
మదికి భరించ లేకుండా ఉంది.
ఒక్క సారి దరిచేరవా
నా హృదయానికి
స్వాంతన చేకూర్చువా..
వేయికళ్ళతోజి
నీ ఆగమనం కోసం
చూస్తూ.. నీ ప్రాణ సఖి
– ప్రియ గోలి…
85008 81385…గుంటూరు.

Leave a Reply