Take a fresh look at your lifestyle.

శరణార్థులు ఎవరు ? ఎందుకొస్తారు?

“నివాస సౌకర్యాల లేమి, రక్షణ మరియు పారిశుద్ధ్యం వారి గుడారాలలో లేకపోవడం, జీవనోపాధి కొరత, స్థావరాలలో వ్యాధులు ప్రభలే ఆస్కారం, స్త్రీలు , బాలికలపై స్థావరాలలో లైంగిక దాడులు జరిగే అవకాశం ఉండటం లాంటి సమస్యలు శరణార్థులు ఎదుర్కోవడం జరుగుతుంది.
1951   కాన్వెన్షన్‌ ‌శరణార్థులకు ఎటువంటి హక్కులను ప్రసాదించింది. పనిచేసే హక్కు, ఇండ్లను నిర్మించుకునే హక్కు, విద్యను అభ్యసించే హక్కు, సామజిక స్వేచ్ఛ మరియు భద్రత, మతస్వేచ్ఛ, న్యాయస్థానాలను సంప్రదించే హక్కు, గుర్తింపుమరియు ప్రయాణపత్రాలను పొందేహక్కు లాంటివి కల్పించబడ్డాయి.”

మనల్ని వర్ణం, జాతి , మతం , వర్గం , రూపం లాంటి మరే ఇతర సాంఘీకలక్షణాలను బట్టి హింసాత్మక చర్యలను ప్రేరేపించడం ద్వారా మన స్వస్థలాలను వదిలి ప్రాణభయంతో వేరే దేశాలలో తల దాచుకోవాల్సిన పరిస్థితులను సృష్టించినట్లయితే, ఆ సందర్భం ఎంత కఠినంగా ఉంటుందో ఊహించడానికే ఇష్టపడము. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చాలా మంది ఎదుర్కోవడం జరుగుతుంది. అలా పారిపోయి వేరే దేశాలలో నివసించే వ్యక్తులను శరణార్థులుగా పరిగణిస్తాము. ఇట్టి శరణార్ధుల స్థితిగతులను పరిరక్షించడానికి ఒక సాంప్రదాయక చట్టాన్ని 1951లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కన్వెన్షన్‌ 50‌వ వార్షికోత్సవం 2001 జూన్‌ 20‌న జరుపుకోగా, మిలియన్‌ ‌సంఖ్యలలోని శరణార్ధులను రక్షించే ఉద్దేశంతో యునైటెడ్‌ ‌నేషనల్‌ ‌జనరల్‌ అసెంబ్లీ ప్రపంచ శరణార్ధుల దినోత్సవాన్ని జూన్‌ 20 ‌నజరుపుకోడానికి నిర్ణయించింది. అయితే ఇదే రోజున ఆఫ్రికన్‌ ‌శరణార్ధుల దినోత్సవం జరుపుకోవడం మూలాన అదే రోజును ప్రపంచ శరణార్ధుల దినోత్సవంగా పరిగణించడమైంది.

శరణార్థులు ఎవరు?
1951 కన్వెన్షన్‌ ‌ప్రకారం ఎవరై• •వయస్సుతో నిమిత్తం లేకుండా కుల మత వర్ణ వివక్షత లాంటి ప్రాతిపదికన హింసాత్మక చర్యలను సృష్టించడం ద్వారా కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం భయంతో సొంత దేశాలను వదిలి వేరేదేశాలకు పారిపోతారో వారిని శరణార్థులుగా పిలవడం జరుగుతుంది. ఇటు వంటి సంఘటనలు రెండవ ప్రపంచ యుద ్ధసమయంలో యురోపియన్‌ ‌శరణార్థులకు పరిమితమయ్యాయని చరిత్ర చెబుతుంది.

శరణార్థులు ఎక్కడి నుంచి వస్తారు? మరియు ఎక్కడికి వెళ్తారు ?
శరణార్థులు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడినప్పటికీ, ఎక్కువుగా 5దేశాల నుంచి రావడం జరుగుతుంది. ఇందులో దాదాపు 45% గుర్తింప బడ్డ శరణార్థులు ఆఫ్గనిస్తాన్‌ ‌మరియు ఇరాకే• దేశాల నుంచి రాగా, మిగతా వారు సోమాలియా, సుడాన్‌, ‌డెమోక్రాటిక్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కాంగో నుంచి రావడం జరుగుతుంది. అయితే ఈ శరణార్థులు ఎక్కువ దూరం వెళ్లకుండా తమ పొరుగు దేశాలకు వెళ్లడం జరుగుతుంది. యూ. ఎన్‌. ‌సి. హెచ్‌. ఆర్‌. ‌ప్రకారము 80% శరణార్త్యులు ఎక్కువుగా పేదదేశాలలో స్థావరాలు ఏర్పర్చుకోగా, గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌ ‌దేశంలో శరణార్ధుల సంఖ్య ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది. శరణార్థులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు: నివాస సౌకర్యాల లేమి, రక్షణ మరియు పారిశుద్యం వారి గుడారాలలో లేకపోవడం, జీవనోపాధి కొరత, స్థావరాలలో వ్యాధులు ప్రభలే ఆస్కారం, స్త్రీలు , బాలికలపై స్థావరాలలో లైంగిక దాడులు జరిగే అవకాశం ఉండటం లాంటి సమస్యలు శరణార్థులు ఎదుర్కోవడం జరుగుతుంది.

1951 కాన్వెన్షన్‌ ‌శరణార్థులకు ఎటువంటి హక్కులను ప్రసాదించింది. పనిచేసే హక్కు, ఇండ్లను నిర్మించుకునే హక్కు, విద్యను అభ్యసించే హక్కు, సామజిక స్వేచ్ఛ మరియు భద్రత, మతస్వేచ్ఛ, న్యాయస్థానాలను సంప్రదించే హక్కు, గుర్తింపుమరియు ప్రయాణపత్రాలను పొందేహక్కు లాంటివి కల్పించబడ్డాయి.
శరణార్ధుల రకాలు : రెఫ్యూజిలతో పాటు ఇంకో 4 రకాల శరణార్థులు మనకు కనపడుతుంటారు. అందులో ఆశ్రయ శరణార్థులు మొదటి రకం. వాస్తవానికి వీరిని శరణార్థులుగా వారి సొంత దేశాలు ద్రువీకరించనప్పటికీ వీరు కూడా రెఫ్యూజీల వలె తమదేశాల నుంచి పారిపోయి వచ్చినట్టు చెప్పుకుంటారు. రెండ వరకం వారు అంతర్గత స్థాన చలనం చేసిన వ్యక్తులు : వీరు మిగతా వారిలాగా దేశ సరిహద్దులను దాటకుండా, అదే దేశంలో మరో ప్రాంతానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. మూడవ రకం శరణార్ధులను సేట్‌ ‌లేవల్‌ ‌శక్తులుగా పిలుస్తారు. వీరికి జాతీయత, ఒకదేశ మంటూఉండదు. ఈ రకం వ్యక్తులు సాధారణంగా కొన్ని వర్గాల మధ్య చూపే వివక్షల మూలాన ఏర్పడతారు. అయితే వీరి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు ఉండకపోవడం మూలాన ప్రభుత్వం నుంచి వచ్చే వైద్య, విద్య లాంటి సేవలను పొందలేరు. ఇక చివరి రకం వ్యక్తులు రిటర్నీస్గ పిలువబడతారు. ఈ వ్యక్తులు ఒక్కప్పుడు శరణార్థులుగా ఉండి, మళ్ళి సొంత దేశాలకు లేదా సొంతప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. వీరు యధావిధిగా తమజీవనాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తారు. యూ.ఎన్‌.‌హెచ్‌.‌సి.ఆర్‌, ‌యూ.ఎన్‌.ఏజెన్సీ అంతర్జాతీయంగా ఉన్న శరణార్థులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో, అంతర్జాతీయ కార్యాచరణను రూపొందించి 110 దేశాలలో ఉన్న 34 మిలియన్‌శరణార్థు లకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఈశరణార్థులు, వేరే దేశాలలో ఉండేందుకు అర్హత లభించినప్పటికీ శరణార్ధుల పిల్లలు 30% కంటే ఎక్కువ విద్యను అభ్యసిం చటం లేదని పరిశోధనల్లో తేలింది. ఏ ఏమైనప్పటి• •ప్రపంచంలో హింసాత్మక ఘటనల వల్ల వేల కుటుంబాలు వేరే దేశాలకు పారిపోయి శరణార్థులుగా మారుతున్న వారికి అండగా ప్రతిఒక్కరు నిలబడాలనే నేపథ్యముతో ఈ 2020 ప్రపంచ శరణార్ధుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.

Khwajaamoinuddin
డా।। ఎండి ఖ్వాజామొయినొద్దీన్‌ ‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్ 9492791387

Leave a Reply