అనడంపై మావోయిస్టుపార్టీ రాష్ట్ర కమిటీ అభ్యంతరం
రెండు పేజీల లేఖను విడుదల చేసిన మావోయిస్టుపార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మహేష్
ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో 17,18 తేదీలలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించి పోలీస్ అధికారులను సమావేశపరిచి మావోయిస్టు అభివృద్ధి నిరోధకులు, అరాచకులని, వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను, డాక్టర్లను బెదిరిస్తూ జీవనం సాగిస్తున్నారని చెప్పడంపై తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ మహేష్ మంగళవారం నాడు విడుదల చేసిన లేఖలో తీవ్రంగా ఖండించారు .హరిభూషణ్ ,దామోదర్ చికెన్, మటన్ డ్రైఫ్రూట్స్ తింటూ సినిమాలు, షికార్లు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, ఆదివాసీలను తెలంగాణపై పంపుతున్నారని ,గిరిజనులు తెలిసి కూడా విషపూరిత కుట్రపూరిత ప్రకటనలు చేస్తున్నారని లేఖలో విమర్శలు చేశారు. దీనిలో ముమ్మాటికీ వాస్తవం లేదని, ఇది కేవలం గోబెల్స్ ప్రచారం అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరిగిందని రోడ్లు, విద్య, వైద్యం ,నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతూ అడ్డుకోవడానికి అరాచకాలు సృష్టించడానికి మళ్లీ ప్రదర్శిస్తున్నారని, విచక్షణ లేకుండా మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు, అసలు అభివృద్ధి నిరోధలు ఎవరని ఆయన లేఖలో ప్రశ్నించారు. అభివృద్ధి అంటే మీ దృష్టిలో భూస్వామ్య, బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు మాత్రమేనని లేఖలో తెలిపారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపట్టి మరింత నియంతృత్వంగా మారిందని, రైతు ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని లేఖలు విమర్శించారు. హరితహారం పేరుతో రైతులు సొంత భూముల నుండి గెంటి వేస్తున్నారని ఖనిజ సంపద అడవులను బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తూ ప్రజలను నిర్వాసితులు చేస్తున్నారని మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
నిరుద్యోగులకు, ఉద్యోగాలు ,ఉపాధి హామీ అవకాశాలు కల్పించడం లేదని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు అన్నింటికీ వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై, సంస్థలపై ప్రభుత్వ కిరాయి సాయుధ బలగాల ద్వారా కషాయి మూకల ద్వారా క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారని లేఖలో విమర్శించారు. గత 12 ఏళ్లుగా ప్రపంచం సంక్షోభం కొనసాగుతూ అది మరింత తీవ్రతరం అవుతుండటంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటుందని లేఖలో పేర్కొన్నారు. దీంతో పేదరికం ఆకలి చావులు, నిరుద్యోగం, రైతు ఆత్మ హత్యలు రోజురోజుకు పెరుగుతున్న అని లేఖలు అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వాలు అసలు విషయం కప్పిపుచ్చడానికి పేదరికాన్ని నిర్మూలిస్తామని బూటకపు పథకాలను మీడియా ద్వారా ఎడతెరిపి లేకుండా ప్రచారం చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ లేఖ ద్వారా తెలియపరిచారు. తెలంగాణ ప్రజల నిజమైన అభివృద్ధి కోసం వాళ్ళ మౌలిక సమస్యల పరిష్కారం కోసం సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రజల పక్షాన నిలిచి త్యాగాలకు, కష్టాలకు ఓర్చి పోరాడుతుంటే అగ్రవర్ణ భూములు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఆస్తులు ,అంతస్తులు కోసం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకోవడానికి అరాచకాలు సృష్టించడానికి ప్రవేశిస్తారని బురదజల్లి విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి మీరు చేసే కుట్రపూరిత పథకాలు ప్రజలందరికీ తెలుసని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు మావోయిస్టు పార్టీని తరిమి కొడితే ఛత్తీస్ఘడ్ పారిపోయారని విడ్డూరం ప్రకటనలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి నియంతృత్వ దోపిడీ పాలక ప్రభుత్వాలు వారి ఎంగిలి మెతుకులు తిని బ్రతికే పోలీసులు గత 50 సంవత్సరాలుగా విప్లవోద్యమం ప్రజానీకంపై క్రూరమైన పాశవిక కొనసాగిస్తూ అనాగరిక చర్యలతో అణిచివేసిన ఘనమైన రక్త చరిత్ర అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోరని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్నారు. హత్యలు, అత్యాచారాలు బూటకపు ఎన్కౌంటర్లు, గృహ దహనాలు అంశం, ఆస్తులను నష్ట పరచడం, విష ప్రయోగాలు, నరహంతక నల్ల దండు సృష్టించి ప్రజాస్వామిక శక్తులపై దాడులు,కోవర్టులు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సాధారణ ప్రజల పై ప్రతాపం చూపుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రజలపై పోలీసుల కారణంగా మోపిన కేసులు మూలంగా ఇప్పటికీ వేలాది మంది కోర్టులు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. హరి భూషణ్ ,దామోదర్లు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని అబద్ధాల ప్రచారం చేస్తున్నారని లేఖలు పేర్కొన్నారు. మాపై బురద జల్లి ప్రజలను నమ్మించడం సూర్యుడిపై ఉమ్మివేసినట్లు ఉంటుందని, ఆస్తులు, అంతస్తులు విలాసవంతమైన సౌకర్యాలు ఎవరు వద్ద ఉన్న సామాన్య ప్రజానీకం జప్తు చేయడానికి మీరు సిద్ధమేనని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మహేష్ సవాల్ చేశారు.