Take a fresh look at your lifestyle.

డబ్ల్యుహెచ్‌ఓ …‌చేతులు కాలాక …!

“2018 ‌నుంచి 2019 సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించిన  నిధులు చూసినట్లయితే.. 19.36% నిధులు పోలియోని అంతం చేయడానికి డబ్ల్యూహెచ్‌ఓ ‌ఖర్చుపెట్టింది. 8.77% అత్యవసర ఆరోగ్య సర్వీసులు పౌష్ఠిక ఆహారం అందించటం కోసం డబ్ల్యూహెచ్‌ఓ ‌ఖర్చు పెట్టింది. 7% మాత్రమే కొత్త వాక్సిన్ల తయారిపై డబ్ల్యూహెచ్‌ఓ ‌ఖర్చు పెట్టింది. కేవలం 4.36% మాత్రమే మహమ్మారుల నివారణ అధ్యయనపై డబ్ల్యూహెచ్‌ఓ ‌ఖర్చు పెట్టింది. అంటే ఇల్లు కాలటం మొదలు అయినాక ప్రపంచ ఆరోగ్య సంస్థ భావి తవ్వటం మొదలు పెట్టింది.. ప్రపంచ ఆరోగ్య సంస్థను నడిపేవారు ఈ పని చేసారు అనేది మన కళ్ళ ముందున్న కటిక సత్యం.”

aruna
అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

ఈ రోజు ప్రపంచ మానవాళికి కావలసింది ఏమైనా వుంది అంటే అది ఆరోగ్యం..ఆరోగ్యం..ఆరోగ్యం.. దీని కోసం ప్రపంచ ప్రపంచ ప్రజల దృష్టి ప్రపంచ ఆరోగ్య గుండెకాయ అంటూ ఏర్పాటు చేసిన వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌ ‌వైపు చేస్తున్నది.. మరి ఈ ప్రపంచ ఆరోగ్య గుండెకాయ ఎలా పుటింది..? ఎలా పని చేస్తుంది..? ఈ రెండు విషయాలు తెలుసుకుంటే వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌ అసలు ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన గుండెకాయ అవునో కాదో తెలుస్తుంది..

డబ్ల్యుహెచ్‌ఓ ఎలా పుట్టింది ..?
1945లో శాన్‌ ‌ఫ్రాన్సిస్కోలో జరిగిన యునైటెడ్‌ ‌నేషన్స్ ‌సమావేశంలో జమింగ్‌ ‌జే అనే చైనా ప్రతినిధి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు కోసం యునైటెడ్‌ ‌నేషన్స్ ‌లో లాబీయింగ్‌ ‌చేశారు. దీని పఫలితంగా బ్రెజిల్‌, ‌చైనా దేశ ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకటి ఉండాలని ప్రతిపాదించారు. ఫలితంగా యునైటెడ్‌ ‌నేషన్స్ ‌సభ్య దేశాలు డబ్ల్యూహెచ్‌ఓ ‌కాన్స్టిట్యూషన్‌ 22 ‌జులై 1946లో రాశాయి. ఈ కాన్స్టిట్యూషన్‌ ‌స్వీకరిస్తూ 7 ఏప్రిల్‌ 1948‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పుట్టింది. దీని తొలి డైరెక్టర్‌ ‌గా కెనడియన్‌ ‌సైకియాట్రిస్ట్, ‌మెడికల్‌ ‌ప్రాక్టీషనర్‌, ‌మొదటి ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞుడు అయిన జి. బరాక్‌ ‌చిషాల్మ్ ‌బాధ్యతలు చేపట్టారు. అలా ప్రపంచ ప్రజల ఆరోగ్యం గుండెకాయ అని చెప్పే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్‌ఒ ‌యునైటెడ్‌ ‌నేషన్స్ ‌లో ఆరు కీలకమైన అంతర్జాతీయ ఏజెన్సీల విభాగాలలో ఒకటిగా హెడ్క్వార్టర్‌ ‌స్విట్జర్లాండ్‌ ‌జెనీవాలో ఏర్పాటు చేయగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అవతరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్‌ఒ ‌కి బాస్‌ ఎవరు ..?
యునైటెడ్‌ ‌నేషన్స్ ‌స్థాపించిన స్పెషలైజ్డ్ ఏజెన్సీ అయిన డబ్ల్యుహెచ్‌ఒ ‌కి బాసులు యునైటెడ్‌ ‌నేషన్స్ ‌సభ్య దేశాల ఆరోగ్య శాఖ మంత్రాలయాలు అని చెప్పారు. ఈ దేశాల మంత్రాలయాలతో ప్రపంచ ఆరోగ్య సమస్త అనుసంధానం చేసుకుంటూ తన పనిని కొనసాగిస్తుంది అని చెప్పారు. ఏప్రిల్‌ 7 ‌న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది కనుక 1950లో ఏప్రిల్‌ 7 ‌న తొలి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రకటించటం జరుపుకోవడంతో మొదలై ప్రతియేడు ఏప్రిల్‌ 7 ‌న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. అత్యంత పెద్ద బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌ప్రపంచ ఆరోగ్య సంస్థ సొంతం.

డబ్ల్యుహెచ్‌ఒ ఎలా పని చేయాలో దాని బాసులు ఎలా చెబుతారు..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ‌హెల్త్ అసెంబ్లీ తొలి సమావేశం 24 జూలై 1948 లో జరిగింది. ఈ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు అయిన అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదే పరంపర నేటికీ కొనసాగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధానమైన మీటింగ్‌ ‌వరల్డ్ ‌హెల్త్ అసెంబ్లీకి ప్రతి ఏడాది జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ‌బోర్డు ఈ సమావేశం ఎజెండాని తయారు చేస్తుంది.
ఈ సమావేశానికి డబ్ల్యుహెచ్‌ఒ ‌సభ్య దేశాల ప్రతినిధులు హాజరవుతారు. దీనిలో ఆ ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలు నిర్ణయిస్తారు అలాగే డబ్ల్యుహెచ్‌ఒ ‌దగ్గరున్న నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది కూడా నిర్ణయిస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకి నిధులు ఇచ్చేది ఎవరు..?
ప్రపంచ ఆరోగ్య సంస్థకి సభ్య దేశాల నుంచి నిధులు వస్తాయి. కొన్ని సంస్థలు కూడా డబ్ల్యుహెచ్‌ఒ ‌కి నిధులు ఇస్తాయి. సభ్యదేశాలు తమ వార్షిక సభ్యత్వ ఫీజు చెల్లిచటం ద్వారా 15. 66% నిధులతో పాటుగా.. వాలంటరీ డొనేషన్‌ ‌కింద 35.41% నిధులు సమకూరుస్తాయి.అంటే డబ్ల్యుహెచ్‌ఒ ‌కి యునైటెడ్‌ ‌నేషన్స్ ‌సమకూర్చే నిధులు అత్యధికంగా వున్నాయి. వీటితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివిధ సంస్థల దానాల ద్వారా వచ్చే నిధులు 9.33% వున్నాయి ఈ కేటగిరీలో బిల్‌ అం‌డ్‌ ‌మెలిండా గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌ఫౌండేషన్‌ ఇచ్చే దానాలు కూడా వస్తాయి. ఇవే కాకుండా ఇతరత్రా సంస్థల ద్వారా కూడా అత్యధికంగా అంటే సుమారు 35% నిధులు వస్తాయి.

డబ్ల్యుహెచ్‌ఒ ‌కి నిధులు సమకూర్చే ఈ ఇతరత్రా సంస్థలు ఏమిటి..?
ప్రపంచ ఆరోగ్య సంస్థకి నిధులు ఇచ్చే సంస్థలు ఇలా వున్నాయి..గవి అలయన్స్ ‌సంస్థ. ఇది 2000 సంవత్సరంలో ఏర్పాటుచేసిన పబ్లిక్‌ ‌ప్రైవేట్‌ ‌పార్టనర్షిప్‌ ‌సంస్థ. మానవులకు సంభవించే రోగాలకు వ్యాక్సిన్స్ ‌కనుగొనేందుకు ఏర్పాటు అయ్యింది. దీనికి నిత్యం వాక్సిన్‌ ‌టెస్టింగ్‌ ‌కి ప్రపంచ మానవ వనరుల అవసరం ఉంటుంది. ఈ సంస్థ డబ్ల్యుహెచ్‌ఒ ‌కి నిధులు ఇస్తుంది..యునైటెడ్‌ ‌నేషన్స్ ‌ఫర్‌ ‌కోఆర్డినేషన్‌ ఆఫ్‌ ‌హ్యుమానిటీరియన్‌ ఎఫైర్స్ (UNOCH) సంస్థ. ఇది 28 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సంస్థ. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడితే లేదా నాచురల్‌ ‌డిజాస్టర్‌ ఏర్పడితే పనిచేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. యునైటెడ్‌ ‌నేషన్‌ ‌జనరల్‌ అసెంబ్లీ, ఆఫీస్‌ ఆఫ్‌ ‌ది యునైటెడ్‌ ‌నేషన్స్ ‌డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ఆర్డినేటర్‌ ‌బదులు ఇది ఏర్పాటు చేసింది. ఇది డబ్ల్యుహెచ్‌ఒ ‌కి నిధులు ఇస్తుంది.

నేషనల్‌ ‌ఫిలంలాంతరఫిక్‌ ‌ట్రస్ట్ NPT) ఇది 1996లో పెన్సిల్వేనియాలో జెంకిన్‌టౌన్‌లో ఒక కుటుంబ కార్యాలయంగా తన పని మొదలు పెట్టింది. నేషనల్‌ ‌ఫిలాంత్రోఫిక్‌ ‌ట్రస్ట్ అనే ఈ సంస్థ తన ఖాతాదారులకు దాతృత్వం చేయటం ద్వారా ఎలా టాక్స్ ఎగ్గొట్టవచో సలహాలు చెబుతుంది. ఇది ఇప్పుడు ఇంటర్‌ ‌నేషనల్‌ ‌సంస్థగా అవతరించింది. ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఫండ్స్ ఇస్తుంది. రోటరీ ఇంటర్నేషనల్‌ ‌క్లబ్‌. ఇది అంతర్జాతీయ సేవా సంస్థ. దీని యొక్క ఉద్దేశ్యం మానవాళికి సేవలను అందించటం ప్రపంచవ్యాప్తంగా సద్భావన శాంతిని పెంపొందించటం. దీనితో పాటుగా ఇది చేసే ముఖ్యమైన పని ఏమంటే వ్యాపార వృత్తిపరమైన నాయకులను ఒకచోట చేర్చడం. ఇది రాజకీయేతర.. మతరహిత సంస్థ. ప్రపంచవ్యాప్తంగా రోటరీ ఇంటర్నేషనల్‌ ‌కు 35,000 పైగా సభ్య క్లబ్‌లు ఉన్నాయి. వీటిలో 1.2 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు, వీటిని రోటారియన్స్ అని పిలుస్తారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ కి ఫండ్‌ ఇస్తుంది.

యునైటెడ్‌ ‌నేషన్స్ ‌సెంట్రల్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ‌ఫండ్‌ CERF) ప్రపంచ విపత్తుల బాధితులందరి కోసం CERF) అన్ని దేశాలచే సృష్టించబడింది. ప్రకృతి వైపరీత్యాలు ఇతర మానవతా అత్యవసర పరిస్థితుల ద్వారా ప్రభావితమైన వారికి సహాయం అందించే పని చేసేందుకు ఈ సంస్థ ముందుకు వస్తుంది. ఈ సంస్థకి అమెరికానుంచి 450 మిలియన్ల గ్రాంట్‌ ‌సౌకర్యం అందుతుంది. ఇది కాకుండా 30 మిలియన్ల రుణ సౌకర్యం కూడా వుంది. అంటే అమెరికా కనుసన్నల్లో నడిచే సంస్థ ఇది. ఇది డబ్ల్యుహెచ్‌ఒ ‌కి నిధులు ఇస్తుంది.. పై సంస్థల పనితీరు బట్టి మనం ఓ నిర్ధారణకు రావచ్చు అవి డబ్ల్యుహెచ్‌ఒ ‌కి ఎందుకు నిధులు సమకూరుస్తున్నది. అలాగే ఈ సంస్థల ప్రతినిధులు డబ్ల్యుహెచ్‌ఒ ‌లో పోషించే పాత్రపై మనం ఓ అవగాహనకి రావచ్చు..

దేశాల డామినేషన్‌ ‌డబ్ల్యుహెచ్‌ఒ ‌పై ఎలా ఉంటుంది..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సభ్యత్వ ఫీజు అస్సెస్సెడ్‌ ‌కాంట్రిబ్యూషన్‌ ‌కిందకి వస్తుంది. దీన్ని లెక్క కట్టడం అనే ప్రక్రియ ఈ నియమంపై ఆధారపడుతుంది.1980 నాటికి డబ్ల్యుహెచ్‌ఒ ‌సభ్య దేశాల జిడిపి ఆదాయంపైనా అలాగే ఆ ఆదేశ జనాభాపైన ఆధారపడి ఉంటుంది. ఈ నియమమం ప్రకారం అస్సెస్సెడ్‌ ‌కాంట్రిబ్యూషన్‌.. ‌వాలంటరీ కాంట్రిబ్యూషన్‌ ‌రెండు కలుపుకుంటే అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమకూర్చే నిధులు 400 నుంచి 500 మిలియన్‌ ‌డాలర్లుగా వుంది. దీనితో మొదటి స్థానంలో అమెరికా వుంది ఆతర్వాత స్థానాల్లో మిగిలిన దేశాలు వున్నాయి. కింగ్డమ్‌ ఆఫ్‌ ‌గ్రేట్‌ ‌బ్రిటన్‌ అం‌డ్‌ ‌నార్తెన్‌ ఐర్లాండ్‌, ‌జర్మనీ, జపాన్‌, ‌కువైట్‌, ‌స్వీడన్‌, ఆ‌స్ట్రేలియా, యూరోపియన్‌ ‌కమిషన్‌. ‌నార్వే, చైనా, కెనడా, రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కొరియా, ప్రాన్‌ ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ఇలా వరసగా ఉన్నాయి. చైనా ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి తన వాలంటరీ కాంట్రిబ్యూషన్‌ ‌పెంచింది.. ఇలా పెంచినప్పటికీ చైనా డబ్ల్యుహెచ్‌ఒ ఇచ్చే నిధులు అమెరికా కన్నా పది శాతం తక్కువే.. నిధులు ఎవరు ఎక్కువ ఇస్తే వారి మాట డబ్ల్యుహెచ్‌ఒ ‌వినాల్సిందే అనేది స్పష్టం.

డబ్ల్యుహెచ్‌ఒ ‌ప్రపంచ ప్రజలను ఎలా విభజించి నిధులు ఖర్చు చేస్తుంది..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచాన్ని ఆరు ముఖ్యమైన రీజనల్స్ ‌గా విభజించింది. 1 ఆఫ్రికా రీజన్‌ , 2 అమెరికా రీజన్‌, 3 ఈస్టర్న్ ‌మెడిటరేనియన్‌ ‌రీజియన్‌, 4 ‌యూరోపియన్‌ ‌రీజన్‌, 5 ‌సౌత్‌ ఈస్ట్ ఏసియా రీజన్‌, 6 ‌వెస్ట్రన్‌ ‌పసిఫిక్‌ ‌రీజన్‌ ఇలా రీజన్లుగా విభజించి ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణ పని డబ్ల్యుహెచ్‌ఒ ‌చేస్తుంది..

మన దేశము ఏ రీజియన్‌ ‌లోకి వస్తుంది..?
భారతదేశం 1948 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశం. మన దేశం సౌత్‌ ఈస్ట్ ఏసియా రీజన్‌ ‌కిందకి వస్తుంది. 2019 లో అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌గా సౌమ్య స్వామినాథన్‌ ‌పనిచేసారు. ప్రస్తుతం ఈమె ప్రస్తుతం ఆమె చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌గా ప్రపంచ ఆరోగ్య లో పని చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్‌ ఈస్ట్ ఏషియా రీజనల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్‌ ‌భారత దేశ రాజధాని ఢిల్లీలో ఉంది.

డబ్ల్యుహెచ్‌ఒ ‌గత ఏడాది ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎలా నిధులు వెచ్చించింది..?
2018 నుంచి 2019 సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించిన నిధులు చూసినట్లయితే.. 19.36% నిధులు పోలియోని అంతం చేయడానికి డబ్ల్యుహెచ్‌ఒ ‌ఖర్చుపెట్టింది. 8.77% అత్యవసర ఆరోగ్య సర్వీసులు పౌష్ఠిక ఆహారం అందించటం కోసం డబ్ల్యుహెచ్‌ఒ ‌ఖర్చు పెట్టింది. 7% మాత్రమే కొత్త వాక్సిన్ల తయారిపై డబ్ల్యుహెచ్‌ఒ ‌ఖర్చు పెట్టింది. కేవలం 4.36% మాత్రమే మహమ్మారుల నివారణ అధ్యయనపై డబ్ల్యుహెచ్‌ఒ ‌ఖర్చు పెట్టింది. అంటే ఇల్లు కాలటం మొదలు అయినాక ప్రపంచ ఆరోగ్య సంస్థ భావి తవ్వటం మొదలు పెట్టింది.. ప్రపంచ ఆరోగ్య సంస్థను నడిపేవారు ఈ పని చేసారు అనేది మన కళ్ళ ముందున్న కటిక సత్యం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!