Take a fresh look at your lifestyle.

అడవులపై జాగ్రత్తలు తీసుకుంటేనే.. మానవ మనుగడ

  • తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పాటు
  • రైతులకు రుణ సహయంతో ప్రభుత్వం అండ
  • కలప స్మగ్లర్లపై కఠిన చర్యలు
  • రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

అడవులపై జాగ్రత్తలు తీసుకుంటే మానవ మనుగడతో పాటు అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అర్భన్‌ ‌పార్కు ప్రారంభోత్స వం చేశారు. హరితహారంలో భాగంగా అల్లనేరడు మొక్కను నాటి ప్రారం భించారు. అనంతరం ముఖ్యమంగురువారం మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని నేరేడు మొక్కను నాటి  ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. పక్కచిత్రంలో సీఎంతో మంత్రి హరీష్‌రావు కార్యక్రమానికి వస్తున్న దృశ్యం.త్రి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అడవులపై జాగ్రత్తలు తీసుకోని రక్షణతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తొలగించడానికి కృషి  చేస్తుందని వివరించారు.  నర్సా పూర్‌ ‌ప్రాంతంలోని వేలాది హెక్టార్లోని అడవిని కంచే వేసి రక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం 60 అర్భన్‌ ‌పార్కులు ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తుం దని వివరించారు. మనం జాగ్రత్తలు తీసుకొని అడవులను జాగ్రత్తగా పెంచు కోవాలని సూచించారు.

While taking care of the forest ..
‌గురువారం మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని నేరేడు మొక్కను నాటి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

అక్రమా ర్కులు అటవీ సంపదను  తొలగి ంచడా నికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  వలసపా లకులు తెలంగాణ అడవులను స్మగ్లర్లకు అప్పగించారని స్మగ్లర్లపై  కఠిన చర్యలు తీసుకొని శిక్షిస్తామని మరో మారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని ఎన్నొ పంటలతో సస్యశ్యామలంగా ఉంటుందని పేర్కొన్నారు. మెదక్‌ ‌జిల్లాకు త్వరలోనే గోదావరి నీళ్ళు చేరుకుంటాయని వాటితో రైతులు పుష్కలంగా పంటలు పండించుకోవచ్చని తెలిపారు. వర్షాలు లేక సింగూరు ప్రాజెక్టు ఎండిపోయిందని ఆ ప్రాంత ప్రజలకు త్వరలోనే గోదావరి జలాలు అందించేలా కృషి చేస్తామని వివరించారు.

Leave a Reply