Take a fresh look at your lifestyle.

మోడీ విదేశాంగ విధానం ఎటు వైపు ..?

ప్రధాన మంత్రుల వారీగా చుస్తే భారత్‌ ‌విదేశాంగ విధానం అమలు ఎలా వుంది అనేది మనకి స్పష్టం అవుతుంది..అలా చూసినప్పుడు తోలి ప్రధాని భారత్‌ ‌విదేశాంగ నీతి పితామహుడుగా పిలవబడే జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు అనుసరించిన విదేశాంగ విధానం ఏమిటి ..? స్వతంత్ర భారత్‌ ‌తోలి ప్రధాని సోషలిస్టు ఇమేజి వున్నా జవహర్లాల్‌ ‌నెహ్రూ 1947 నుంచి 1964 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. మాటల్లో ఆదర్శవాదం.. తన దోస్తులు అయిన టాటా బిర్లాలను నొప్పించని ఆచరణతో కూడిన విదేశాంగ నీతితో నెహ్రూ విదేశాంగ మంత్రిగా కొనసాగారు.. నెహ్రూ హయాంలో అలీన విధానం ఫోకస్‌లో పెట్టి రష్యాతో సన్నిహిత సంభందాలు నడుపుతూ ప్రభుత్వ సంస్థలకు రష్యా తోడ్పాటు అందేలాగా.. అలాగే టాటా బిర్లాలకు ఇబ్బంది లేకుండా అమెరికా ఉత్పత్తి విధానాన్ని దేశంలో అమలుచేసి రాబోవు కాలంలో భారత్‌ అమెరికా సంబంధాలపై ఆటంకాలు రాకుండా నెహ్రూ కాలంలోనే భారత విదేశాంగ కార్యాలయం పనిచేసింది.

aruna senior journalist delhi
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

భారత దేశ విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌భారత్‌ ‌మళ్ళీ అలీన విదేశాంగ విధానం ఆలోచిస్తా అని చెప్పారు. ఈ మాట ప్రపంచ పరిణామాలు ముఖ్యంగా అమెరికా చైనా సంబంధాల నేపథ్యంలో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌నోటా వినిపించిన ఈ మాటకి ప్రాధాన్యత వుంది. ప్రపంచం రెండు ధ్రువాలు ఐతే భారతకి జవహర్‌ ‌లాల్‌ ‌లాంటి విదేశాంగ మంత్రి కావలసి ఉంటుంది.. మరి మోడీ అత్యధికంగా విమర్శించే భారత తొలిప్రధాని పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు విదేశాంగ నీతి అనుసరించాల్సి ఉంటుంది . అది మోడీకి సాధ్యమా అనేది కీలక ప్రశ్న.. అసలు జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు అనుసరించిన విదేశాంగ విధానం ఏంటో చూడాలి అంటే చరిత్రలోకి వెళ్ళాలి ..

భారత్‌ ‌విదేశాంగ విధానం ఎలా పుట్టింది..?
ఏదేశం అయినా తన విదేశాంగ విధానాన్ని తన ప్రజల ఆకాంక్షల మేరకు రూపొందించుకోవాల్సి ఉంటుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం రాసుకున్న రాజ్యాంగ ప్రస్తావనలో ఉన్న ప్రధానమైన మాట ‘‘వి ది పీపుల్‌’’. ఈ ‌మాట ప్రకారం మన దేశ అంతర్గత..అంతర్జాతీయ నీతి ప్రజల ఆకాంక్షల మీద ఆధారపడి ఉంటుంది లేదా ఉండాలి. ఇక మన రాజ్యాంగంలోని నాల్గవ భాగం డైరెకటివ్‌ ‌ప్రిన్సిపల్స్ అఫ్‌ ‌స్టేట్‌ ‌పాలసీలో రాసుకున్న ఆర్టికల్‌ 51‌లో భారత దేశ విదేశాంగ విధానానికి సంబంధించిన గైడ్‌ ‌లైన్స్ ‌వున్నాయి. ఈ గైడ్‌ ‌లైన్స్ ‌ప్రకారం భారత్‌ ‌విదేశాంగ విధానం పునాదులు ఇలా వున్నాయి.. 1. అంతర్జాతీయ శాంతి.. సద్భావన..2. యునైటెడ్‌ ‌నేషన్స్ ఏర్పాటు..3. సామ్రాజ్యవాదాన్ని.. వలసవాదాన్ని వ్యతిరేకిస్తుంది..4. సైనిక ఆక్రమణ వాద వ్యతిరేకత..5. అలీన విదేశాంగ నీతి. ఈ ఐదు సూత్రాల ప్రకారం భారత్‌ అం‌తర్జాతీయ ప్రజల ఐక్యత కోసం నిలబడుతుంది. భారత్‌ ఈ ఐదు విదేశాంగ నీతి పునాదులు ఏర్పరుకుంటున్నప్పుడు ప్రపంచం ఎలా ఉండేది..? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి భారత్‌ ‌కి స్వతంత్రం వచ్చింది. మరోవైపు ప్రపంచం రెండు ధ్రువాలుగా విడిపోయింది. ఓ వైపు రష్యా.. మరోవైపు అమెరికా దేశం రెండు దృవాలుగా ప్రపంచాన్ని విడగొట్టాయి.

ఇలా ప్రపంచం రెండుగా విడిపోవడానికి కారణం ఏమిటి..?
ప్రపంచం ఇలా రెండు దృవాలుగా విడిపోవడానికి ప్రధానమైన కారణం.. ప్రపంచంలో రెండు రకాల ఉత్పత్తి విధానం ఉండటం ప్రధాన కారణం అయ్యింది..దీని వలన ప్రపంచంలో ఎటువంటి అమ్మకాల కొనుగోళ్ల విధానం కొనసాగాలి అన్నదానిపై అమెరికా అవగాహనకి రష్యా అవగాహనకి పొంతన కుదరలేదు. రష్యా అవగాహన ప్రకారం ఓ దేశ ఉత్పత్తి విధానం సంపూర్ణగా ఆదేశ ప్రభుత్వం చేతిలో ఉండాలి.. ఉత్పత్తి అయిన వస్తువులు ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉండాలి. అమెరికా అవగాహన ప్రకారం మొత్తం ఉత్పత్తి విధానం ఆ దేశ ప్రభుత్వం చేతిలో కాకుండా ప్రైవేట్‌ ‌వ్యక్తుల చేతుల్లో కూడా ఉండాలి. ఉత్పత్తి అయిన వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకోవటానికి అనుమతి ఉండాలి. అమెరికా ..రష్యాల ఈ ఆలోచనా ధోరణి వలన ప్రపంచం రెండు ధ్రువాలుగా విడిపోయింది.

ఈ రెండు దృవాలలో భారత్‌ ఎటువైపు మొగ్గింది..?
భారత విదేశాంగ విధానం పితామహుడిగా చెప్పబడే జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు భారత్‌ ‌విదేశాంగ విధానం అలీన విధానం అని ప్రకటించి.. తనకున్న సోషలిస్టు పక్షపాతి ఇమేజిని తో భారత్‌ ‌లో అమెరికా తరహా ఉత్పత్తి విధానాన్ని ప్రవేశపెట్టి.. రష్యా నా దోస్త్ అని ప్రకటిస్తూ.. రష్యా ఉత్పత్తి విధానం అయిన సంపూర్ణ ఉత్పత్తి విధానం ప్రభుత్వం చేతిలో అనే ఉత్పత్తి విధానాన్ని తిరస్కరించారు. నెహ్రు ఇలా చేయటానికి కారణం ఆనాడు స్వతంత్ర పోరాట సమయంలో గాంధీ నెహ్రూల కీలకమైన మిత్రులు అయిన టాటాలు.. బిర్లాలు.. స్వతంత్ర భారత దేశ తోలి బడ్జెట్‌ ‌వీరే రూపొందించారు . ఈ బడ్జెట్‌ ‌ప్రకారం మన దేశంలో మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ ఉండాలి అని టాటా బిర్లాలు కోరారు..దీనితో భారతదేశం సొంత గడ్డ మీద మిశ్రమ ఆర్థిక విధానం ప్రవేశపెట్టుకుని.. ప్రపంచ దేశాలతో మా సంబంధాలు ‘‘నాన్‌ అలైన్‌ ‌మూమెంట్‌’’ (ఈ ‌ముసుగు టాటా బిర్లాలు కావాలనుకున్నప్పుడు తొలగించేలాగా) అంటే అలీన విధానం మా విదేశాంగ విధానం అంటూ అలీన విదేశాంగ విధానాన్ని భారత్‌ ‌సోషలిస్టు పోస్టర్‌ ‌బాయ్‌ ‌పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు ప్రకటించారు..

ప్రధాన మంత్రుల వారీగా చుస్తే భారత్‌ ‌విదేశాంగ విధానం అమలు ఎలా వుంది అనేది మనకి స్పష్టం అవుతుంది..అలా చూసినప్పుడు తోలి ప్రధాని భారత్‌ ‌విదేశాంగ నీతి పితామహుడుగా పిలవబడే జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు అనుసరించిన విదేశాంగ విధానం ఏమిటి ..? స్వతంత్ర భారత్‌ ‌తోలి ప్రధాని సోషలిస్టు ఇమేజి వున్నా జవహర్లాల్‌ ‌నెహ్రూ 1947 నుంచి 1964 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. మాటల్లో ఆదర్శవాదం.. తన దోస్తులు అయిన టాటా బిర్లాలను నొప్పించని ఆచరణతో కూడిన విదేశాంగ నీతితో నెహ్రూ విదేశాంగ మంత్రిగా కొనసాగారు.. నెహ్రూ హయాంలో అలీన విధానం ఫోకస్‌ ‌లో పెట్టి రష్యాతో సన్నిహిత సంభందాలు నడుపుతూ ప్రభుత్వ సంస్థలకు రష్యా తోడ్పాటు అందేలాగా.. అలాగే టాటా బిర్లాలకు ఇబ్బంది లేకుండా అమెరికా ఉత్పత్తి విధానాన్ని దేశంలో అమలుచేసి రాబోవు కాలంలో భారత్‌ అమెరికా సంబం ధాలపై ఆటంకాలు రాకుండా నెహ్రూ కాలంలోనే భారత విదేశాంగ కార్యాలయం పనిచేసింది.

భారత్‌ను అంతర్జా తీయంగా ఏ స్థానంలో జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు నిలిపారు..?
తోలి ప్రధాని జవహర్లాల్‌ ‌నెహ్రూ కాలంలో చోటు చేసుకున్న కీలక విదేశాంగ ఘట్టాలు ఇలా వున్నాయి.. చైనాతో చేసుకున్న పంచశీల ట్రీటీ.. దీని ప్రకారం 1. ఇరుదేశాలు భూభాగాలను ఆక్రమించుకోకుండా వుంటాయి. 2. భారత్‌.. ‌చైనాలు ఇరు దేశాల సమగ్రత, సార్వభౌమత్వానికి పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాయి.3.ఇరు దేశాలు సరిహద్దుల వద్ద దూకుడు ప్రదర్శించవు,4. ఇరు దేశలు అంతర్గత వ్యవహారాలలో పరస్పర జోక్యం చేసుకోవు,5. ఇరు దేశాలు సమానత్వం పరస్పర ప్రయోజనం కాపాడుకుంటూ శాంతియుత సహజీవనం కొనసాగిస్తాయి. ఈ పంచశీల ట్రీటీ ఇరుదేశాల మధ్య జరిగిన టిబెట్‌ ‌ఫ్యాక్టర్‌ ‌వలన 1962 భారత-చైనా యుద్ధం జరిగింది. దీనితో జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు విమర్శలు ఎదుర్కొన్నా.. గోవాని పోర్చుగల్‌ ‌వారినుంచి తీసుకుని, 1961లో గోవాని భారతదేశంలో విలీనం చేసివుండటం వలన జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు తన దేశ భక్తి ఇమేజి.. మరోవైపు అంతర్జాతీయంగా భారత్‌ ‌సత్తా చాటుకున్నట్టు అయ్యింది. ఇది పొరుగు దేశంతో జరిగిన కీలక ఘట్టం ఐతే మొత్తం ఏసియాన్‌ ‌లో భారత్‌ ‌ను పెద్దన్న చేయటానికి జవహర్‌ ‌లాల్‌ ‌చేసిన మంచి ప్రయత్నాలు కూడా కొన్ని వున్నాయి..

ఏషియన్‌ ‌ఫ్రెండ్‌ ‌షిప్‌ ‌కాన్ఫరెన్స్ 1947 ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ఏర్పాటు చేసారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏషియాలో ఐక్యతకు జవహర్‌ ‌ప్రయత్నం చేశారు. ఏషియాలో ఉన్న దేశాల మధ్య సాలిడారిటీ కోపరేషన్‌ అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు. ఈ కాన్ఫరెన్స్ ‌లోనే బండుంగ్‌ ‌కాన్ఫరెన్స్కు పునాది పడింది. ఇండోనేషియా లో ఉన్న బండుంగ్‌ అనే ప్రాంతంలో బండుంగ్‌ ‌కాన్ఫరెన్స్ ‌జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ‌లోనే ఏషియాన్‌ అనే కాన్సెప్ట్ ‌పుట్టింది. బ్రిటిష్‌ ‌పాలనలో మగ్గిపోయిన దేశాల కూటమి అయిన కామన్వెల్త్ ‌లో మే 1949లో భారతదేశం కామన్వెల్త్ ‌సభ్యత్వం తీసుకుంది. కామన్వెల్త్ ‌బ్రిటన్‌ ‌పాలనలో మగ్గి స్వతంత్రం పొందిన 53 దేశాల కూటమి.1949లో భారత్‌ ‌భూటాన్‌ ‌మధ్య సంధి జరిగింది. ఈ సంధి వలన భూటాన్‌ ‌తన విదేశాంగ విధానం భారతదేశంలో చర్చించిన తర్వాత నిర్ణయించుకునే లాగా జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు చేసారు.1950లో భారత్‌ ‌నేపాల్‌ ‌మధ్య సంధి జరిగింది దీనివలన నేపాల్‌ ‌భారత్‌ ‌ల మధ్య సంబంధాలు మెరుగు పడ్డాయి. ఇలా పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు ఏషియాలో భారత్‌ ‌ను ఓ పెద్దన్న పాత్రలో నిలబెట్టారు. తరవాతి కాలంలో మన విదేశాంగ విధానం అమెరికా తొత్తుగా మారిపోతా వచ్చింది. మళ్ళీ అమెరికా చైనాలు గా ప్రపంచం రెండు ధ్రువాలు ఐతే మోడీ జహార్‌ ‌లాల్‌ ‌ని అనుసరిస్తారా అనేది కీలకమైన ప్రశ్న కానుంది..

Leave a Reply