Take a fresh look at your lifestyle.

ఇం‌టికే పరిమితం అయిన రంజాన్‌ ‌ప్రార్థనలు

  • సందడి లేకుండా సంయమనం పాటించిన ముస్లిం సోదరులు
  • ప్రశాంతంగా ప్రఖ్యాత చార్మినార్‌ ‌ప్రాంతం

కొరోనావ్యాప్తి నేపథ్యంలో కేందప్రభుత్వం విజ్ఞప్తి మేరకు దేశవ్యాప్తంగా ముస్లింలు ఇంటివద్దనే రంజాన్‌ ‌వేడుకలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఇంటి దగ్గర ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ ‌నఖ్వీ ఢిల్లీలోని తన నివాసంలో రంజాన్‌ ‌ప్రార్థనల్లో పాల్గొన్నారు. లాక్‌ ‌డౌన్‌ 4.0 ‌కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నైలోని ట్రిప్లికానే ఏరియాలో వాలాజా మసీదును మూసివేశారు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ‌ప్రాంతంలోని ఓ ఇంట్లో రంజాన్‌ ‌ప్రార్థనలు నిర్వహించారు. కర్ణాటకలోని హుగ్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో లాక్‌ ‌డౌన్‌ ‌నిబంధనలు పాటిస్తూ రంజాన్‌ ‌వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్‌లో కూడా అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటివద్దనే ప్రార్తనలు జరుపుకుని ఆదర్శంగా నిలిచారు. దీంతో ఎక్కడా సందడి కానరాలేదు. ఇదిలావుంటే దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రంజాన్‌ ‌శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ ‌ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దేశపౌరులు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రధాని కోరుకున్నారు. రంజాన్‌ ‌ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరుణ, సేవాతత్పరత, సుహృద్బావానికి రంజాన్‌ ‌పండుగ ప్రతీక రంజాన్‌ అని అన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.నిరాడంబరంగా రంజాన్‌ ‌పండగ ప్రశాంతంగా ప్రఖ్యాత చార్మినార్‌ ‌ప్రాంతం.

హైదరాబాద్‌ : ‌దేశవ్యాప్తంగా రంజాన్‌ ‌పండుగ అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముస్లిం సోదరులు ఇళ్లకే పరిమితం కావడం ఇదే ప్రథమం. కరోనా వలన లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షల అమలులో ఉండటంతో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుని పండగ జరుపుకోవాల్సి వచ్చింది. నెల రోజుల ఉపవాస దీక్షను ఆదివారం సాయంత్రం విరమించారు. సోమవారం ఈద్‌ ఉల్‌ ‌ఫితర్‌ ‌జరుపుకున్నారు. కానీ కరోనా వల్ల ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ మక్కా మసీదు పండగ పూట నిర్మానుషంగా మారింది. సాధారణంగా రంజాన్‌ అం‌టే షీర్‌ ‌ఖుర్మా చాలా ప్రత్యేకమైంది. ఈద్‌ ‌ముభారక్‌ అం‌టూ ఇచ్చుకుంటూ ఉంటారు. హైదరాబాద్‌ ‌లోని మక్కా మసీదు వద్ద ముస్లీంసోదరులు ప్రార్ధనలు చేస్తూంటే చాలా బాగుంటుంది. కానీ, లాక్‌ ‌డౌన్‌ ‌వలన సామూహిక ప్రార్ధనలు , ఖీర్‌,‌హలీమ్‌ ‌లు బంద్‌ అయ్యాయి. ఈద్‌ ‌రోజున ముస్లింలతో నిండిపోయే చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాలు సోమవారం నిర్మానుషంగా కనిపించాయి. నగరంలో ఎటువంటి ప్రార్థనలకు అనుమతి లేకపోవడం వల్ల.. ఈద్‌ ‌పండుగ రోజున కూడా ముస్లింలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్పందించారు. చార్మినార్‌ ‌వద్ద ఉన్న మక్కా మసీదులో ఎటువంటి సామూహిక ప్రార్థనలు జరగలేదు. ఆ ప్రాంతం అంతా కళ తప్పినట్లుగా మారింది. లాక్‌డౌన్‌4 ‌నేపథ్యంలో ఓల్డ్ ‌సిటీలో ఉన్న అన్ని మసీదులను మూసివేశారు. నగరంలో ఉన్న మేటి మసీదులు.. ఈద్గా ర్‌ ఆలమ్‌, ఈద్గా బిలాయి, ఈద్గా మాదన్నపేటలతో పాటు ఇతర పెద్ద మసీదుల్లోనూ ఈద్‌ ‌ప్రార్థనలను నిర్వహించలేదు. ఎటువంటి సామూహిక ప్రార్థనలు నిర్వహించరాదు అంటూ ప్రతి మసీదు ముందు బ్యానర్లను పెట్టారు. జామియా నిజామి చేసిన అభ్యర్థనల పోస్టర్‌ను కూడా మసీదుల ముందు ఉంచారు. మొఘల్‌పురాలో ఉన్న ప్రఖ్యాత జామా మసీద్‌ ‌హఫీజ్‌ ‌దనాఖాను కూడా మూసివేశారు.

నగరంలోని ముస్లింలు అందరూ ఇండ్లల్లోనూ ఈద్‌ ఉల్‌ ‌ఫితర్‌ ‌ప్రార్థనలు చేశారు. ఫ్యామిలీ సభ్యులతోనే పండగను సెలబ్రేట్‌ ‌చేసుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ముస్లింలు ఇండ్ల వద్దనే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిటీలోని అనేక బస్తీలు కూడా కళతప్పాయి. మసీదులు అన్నీ మూసివేయడంతో ప్రార్థన సమయాన్ని కూడా ఎక్కడా వెల్లడించలేదు. ఆదివారం రాత్రి చార్మినార్‌ ‌వద్ద రంజాన్‌ ‌బజార్‌ను మూసివేశారు. రాత్రి 7 గంటలకే షాపులను మూసివేసి.. ఆ ప్రాంతంలో కర్ఫ్యూను విధించారు. చార్మినార్‌, ‌లాడ్‌ ‌బజార్‌, ‌పత్తేర్‌ఘాట్‌.. ‌వీధులన్నీ జనంలేకుండా వెలవెలబోయాయి.

 

Leave a Reply