ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలను శాసించేవారని,ఇప్పుడు కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందని ఏపీ జగన్ 27 శాతం మధ్యంతర భృతి పెంచారని ,కనీసం తోటి ముఖ్యమంత్రి ని చూసైనా నేర్చుకో వలని కేసీఆర్ కి సూచించారు. ఉద్యోగ సంఘాల పేరుతో శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యాడని ఎవరితో మంత్రివి అయ్యవో వల్ల మేలు చూసుకోవాల్సిన బాధ్యత శ్రీనివాస్ గౌడ్ కి లేదా అని ప్రశ్నించారు…?ఉద్యోగుల హక్కుల కాలరాస్తున్న ప్రభుత్వం లో కొనసాగే హక్కు శ్రీనివాస్ గౌడ్ కి ఎక్కదని నిలదీశారు.ఉద్యోగ సంఘాలు హక్కుల కోసం పోరాటం చేయకపోతే ఎలా అని మండిపడ్డారు.
ఉద్యోగుల వేతన సవరణ ఐదేళ్లకోసారి చేస్తారని ఇది ఉద్యోగుల హక్కుని , 10త్ ఫైనాన్స్ జూన్ తో ముగుస్తుందని ,11త్ ఫైనాన్స్ జులై లో మోదలౌతుందని, 2008 లోనే బిస్వాల్ కమిషన్ గా కమిషన్ వేశారని ,2018 లో నూతన పీఆర్సీ అమల్లోకి వస్తుందని భావించాం ఆర్టీసీ సమ్మె సందర్బంగా ఉద్యోగ సంఘాలను ప్రగతి భవన్ పిలిచారు సత్వరమే పీఆర్సీ వస్తుందని చెప్పారు కానీ నవంబర్ నుండి వేచి చూసి..2020 డిసెంబర్ 31 వరకు కమిషన్ గడువు పొడగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.