Take a fresh look at your lifestyle.

లోపం ఎక్కడ? ఇది ఈనాటిది కాదు..

అనాదిగా ఉన్నదే..
నేడు సాంకేతికత పుణ్యమాని
శరవేగంగా పాకిపోతుందంతే
స్త్రీని భోగవస్తువుగా చూస్తూ
చూపిస్తూ ఊహిస్తూ..
యత్రనార్యంతు పూజ్యతే
అంటే ఏ చెవికెక్కుతుంది?
గాలిలో దీపం ఎంతకాలం
నిలబడుతుంది?
యెన్ని చట్టాలు చేసినా
ఎన్ని గొంతులు చించుకున్నా ఈ
మానభంగపర్వపు రావణకాష్ఠం
ఆరదు..ఆరదు..  మరెలా?
ఎక్కడైతే సమాజానికి చిల్లు పడిందో
అది పూడ్చాలి.. అక్కడ ఆపాలి
ఏ మాధ్యమాల ద్వారా..
పనీ పసా రెండూ లేని..
కొజ్జా లంజా కొడుకులు..
స్త్రీకి కూలిచ్చి బట్టలిప్పి..
మనలో విషబీజాలు నాటి..
కోట్లు కొల్లగొడుతున్నారో..
మళ్ళీ వాళ్లే వేదికలెక్కి
స్త్రీకి న్యాయం జరగాలని నీతులు చెబుతున్నారో..
ఆ ఆటలు ఆగాలి.. ఆ బుద్దులు తెలియాలందరికి.. వాళ్ళను కడిగేయాలి
ఆ ధూర్తుల్ని చెండాడాలి !
స్త్రీని అంగాంగ ప్రదర్శనతో
తైతక్కలాడించి.. పరాయిస్త్రీలంతా
ఆ పనికే ఉన్నారనే విషభావజలాన్ని
మన మెదళ్లలోకి తరతరాలుగా
జొప్పిస్తూ వస్తున్న ఆ మాధ్యమాల మాయాజాలాల్ని కూకటి వేళ్ళతో పీకేయాలి
మీరు సమాజమనే తరగతి గదిలో
ఏ పాఠం చెబితే అదే కదా
పిల్లాడి మెదడులో నాటుకుపోయేది !
ఉగ్గుపాలతో మీరు విషం కలిపి
పిల్లాడు విషమై పోయాడంటే ఎట్లా?
మీరు గంజాయి మొక్కలు నాటి..
గంధపు చెట్లు మొలవ లేదంటే ఎలా?
మన మూఢత్వానికి బుద్ధిహీనతకి
తుచ్ఛమైన కామప్రకోపాలకి నిర్లక్ష్యాలకి
ఇంకెదరు చిట్టితల్లుల కన్నీటి రక్తంతో
ఈ నా మాతృభూమి తడవనుందో..!!

   – భీమవరపు పురుషోత్తం,9949800253 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply