తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయినా సరే ప్రజలలో చైతన్యం ఇంకా రాని పరిస్థితి. ఏ ఒక్కరికీ భయం లేకుండా ఇష్టం వచ్చిన తీరులో ఎవరి పనిలో వారు కరోనా మరిచి ప్రభుత్వ కార్యాలయాలలో, బ్యాంకులలో, దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం చైతన్య పరిచిన మాకు ఏమైతుంది అనే ధీమాతో ప్రజలు ఉన్నారు. మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వద్ద గురువారం ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఏ ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించకుండా బ్యాంకు గేటు వద్ద నుండి లోపలకి చొచ్చుకొని పోతున్నారు.
అయితే బ్యాంక్ సిబ్బంది ఎలాంటి సూచనలు చేయకుండా, కోవిడ్-19 సూచనలు పాటించకుండా వారిని అట్లా వదిలివేయడం విశేషం. ఇప్పటికే మండలంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అయినా సరే మండలంలో ప్రతి చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ప్రజలు మాకు ఏమౌతుందని మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా బయటకు వస్తున్నారు. మాస్ కు లేకుంటే జరిమానా విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ మాస్కులు ధరించడం నిబంధనలు పాటించడం పోవడం ఈ ప్రజలు మారేది ఎప్పటికో.