Take a fresh look at your lifestyle.

పల్లె ప్రగతిలో అభివృద్ధి ఎక్కడ ? ఎక్కడి చెత్త అక్కడే, పందులు స్వైర విహారం

కురవి జులై 28(ప్రజాతంత్ర విలేకరి) : పల్లెలు బాగుండాలి పచ్చదనంతో కళకళలాడే విధంగా హరితహరం తోపాటు పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి అనే ముందుచూపుతో పల్లె ప్రగతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తున్న కూడా గ్రామపంచాయతీ అధికారులు పాలకమండలి గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కురవి మండల కేంద్రంలోని చెత్త కుండీల దగ్గర ఉన్న చెత్తను తరలించకపోవడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు దోమలతో ఈగలతో పందులతో చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

మెయిన్‌ ‌రోడ్డుకు దగ్గర పోస్టాఫీసు వీధి, భవ్యశ్రీ రియల్‌ ఎస్టేట్‌ ఆఫీస్‌ ‌ముందు ఉన్న చెత్తకుండీ నిండి వీధి నిండా చెత్త చెదారంతో ఉండడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని చుట్టుపక్కల ఇండ్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వీధిలో ప్రైవేటు కిరాయి సత్రాలు అధికంగా ఉన్నాయి, నిత్యం వీరభద్ర స్వామి దగ్గరకు వచ్చే భక్తులు ఆ వీధిలో ఉన్న ప్రైవేట్‌ ‌గదులు కిరాయికి తీసుకొని ఉంటారు. ఈగలు దోమలు పందులు ఎక్కువగా ఉన్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు మండల కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ ప్రజలతోపాటు భక్తులు కోరుతున్నారు.

సిపిఐ పార్టీ గ్రామ కార్యదర్శి తురక రమేష్‌
‌కురవి మేజర్‌ ‌గ్రామ పంచాయతీ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువై ఉన్న గ్రామం అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని సిపిఐ గ్రామ పార్టీ అధ్యక్షులు తురక రమేష్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు లక్షల్లో నిధులు ఉన్నా కూడా గ్రామ అభివృద్ధి పరచడంలో గ్రామ పాలకమండలి విఫలం అయిందని ఆయన అన్నారు. ఖమ్మం నల్గొండ జిల్లాల ప్రజలు నిత్యం వీరభద్రస్వామి దర్శనం కోసం వస్తుంటారని గ్రామ పరిశుభ్రతపై భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకమండలి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు.

Leave a Reply