Take a fresh look at your lifestyle.

ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే

  • స్పృహ తప్పి పడిపోయిన వారితో సర్వత్రా రోదనలు
  • హుటాహుటిన ఆస్పత్రులకు తరలించిన వైద్య సిబ్బంది

విశాఖపట్నం,మే 7: విశాఖ నగరంలోని ఆర్‌. ‌వెంటకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ ‌కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తరవాత దృశ్యాలు హీదయవిదారకంగా ఉన్నారు. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్‌ ‌గ్యాస్‌ ‌లీక్‌ అయ్యింది. సప ప్రాంతాల రోడ్లలో హృదయవిదారకర దృశ్యాలే కనిపించాయి. ఎక్కడ చూసినా స్ప•హతప్పి పడిపోయినవారే ఉన్నారు. అనేకులను పోలీసులు, వైద్య సిబ్బంది ఆస్పత్రులకు తరలించారు. అంబులెన్స్ ‌సైరన్లు ఓ వైపు, అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు చేసిన హెచ్చరికలు మరోవైపు.. మొత్తంగా ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పలువురిని అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరించగా.. మరికొందరిని ఆర్టీసీ బస్సులో వేరే ప్రాంతాలకు తరలించారు. గ్యాస్‌ ఒకటికి రెండుసార్లు లీక్‌ ‌కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

ఇదిలావుంటే స్ప•హతప్పి పడిపోయిన చిన్నారులను చేతులపై మోసుకెళ్తూ రోదిస్తున్న తల్లిదండ్రులు.. రోడ్లపై పరుగెడుతూనే కుప్పకూలిన ప్రజలు… విషవాయువుల కారణంగా పడిపోయినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, ఇళ్లలో నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసిన స్థానికులు… గురువారం తెల్లవారు జామున విశాఖ గ్యాస్‌ ‌లీక్‌ ‌దుర్ఘటనలో యావద్దేశం గుండెలను పిండేసిన దృశ్యాలివి.. కొవిడ్‌-19 ‌విలయతాండవం చేస్తున్న తరుణంలోనే దెబ్బద దెబ్బ పడినట్టు చోటుచేసుకున్న ఈ విషాదం దాదాపు నాలుగు దశాబ్దాల నాటి భోపాల్‌ ‌గ్యాస్‌ ‌దుర్ఘటనను కళ్లముందు నిలిపింది. 1984 డిసెంబర్‌ 2‌న రాత్రి యూనియన్‌ ‌కార్బైడ్‌ ఇం‌డియా లిమిటెడ్‌ (‌యుసిఐఎల్‌) ‌పురుగుమందుల కంపెనీలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా నిలిచింది. మిథైల్‌ ఐసోసైనేట్‌ (ఎంఐసీ) ట్యాంక్‌లో నీరు చేసి ఒక్కసారిగా విషవాయువులు వెలువడడంతో భోపాల్‌ ‌పరిసర ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్య ప్రదేశ్‌ ‌ప్రభుత్వం అప్పట్లో అధికారికంగా 3,787 మంది మృతులకు, 574,366 మంది క్షతగాత్రులకు పరిహారం అందజేసింది. తాజాగా విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ‌కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో విషవాయువులు లీక్‌ ‌ఘటన కూడా బుధవారం అర్థరాత్రి దాటాక చోటుచేసుకుంది. రాత్రి వేళ మూడుగంటల ప్రాంతంలో స్థానికులంతా నిద్రపోతున్న వేళ స్టిరిన్‌ ‌గ్యాస్‌ ‌లీక్‌ అవ్వడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏంజరిగిందో అర్థమయ్యేలోపే అనేకమంది స్ప•హతప్పి పడిపోయారు. చాలామంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు ఓ స్థానికుడు పేర్కొన్నారు. దాదాపు 200 వందలమంది తీవ్ర అస్వస్థతకు గురికాగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply