Take a fresh look at your lifestyle.

సంపద పయనం ఎటవైపూ?

నా దేశం దోచుకుని దాచుకునేందుకు
దారులనెన్నో చూయిస్తుంది

చెమట విలువ
రూపాయిలా
దినదినం దిగజారుతోంది

దేశం ఆకలితో అల్లాడుతుంటే
ఉన్నోడికీ తలవంచడం నాయకత్వ లక్షణం
ఎందుకంటే
రాజకీయం
కార్పోరేట్‌ ‌కాలర్స్
‌పాదాలచెంత బానిసత్వానికలవాటుపడి
పేదోడి బతుకును తాకట్టెట్టేస్తుంది

మాటలముసుగులో కొందరు
మతం ముసుగులో కొందరు
అధికారాన్నెగురేసుకుపోతుంటే
మేధావులు సైతం
మౌనవ్రతం ముసుగులో తోచనితనంతో చూస్తుంంటే
దోచుకునేటోనికింక తిరుగెక్కడిది
సంపద కిరీటం ఒకరిచేతిలో బందిగాక ఏమౌతుంది?

– సి. శేఖర్‌(‌సియస్సార్‌),‌పాలమూరు, 9010480557.

Leave a Reply