Take a fresh look at your lifestyle.

రీల్‌ ‌హీరో రియల్‌ ‌హీరో ఎప్పుడవుతారు?

“ఏ ‌జాతీయ పార్టీ అయినా.. తన తల మీద తుపాకులు పెట్టినా జనసేన పార్టీని కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసారంటే ఆ పార్టీ ఎలాంటి ఇబ్బందుల్లో ఉందో అర్ధమౌతుంది.. జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయాలంటూ ఒక పార్టీ నుంచి ఒత్తిడి వస్తోందని, అయితే తలపై తుపాకులు పెట్టినా జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదని స్పష్టం చేసిన విషయం గుర్తునుకోవాలి. జాతి సమగ్రతని కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని, భావజాలాన్ని అర్థంచేసుకున్నవాళ్లతో పార్టీ నడుపుతానన్నారంటే కేడర్‌ ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక తలపట్టుకు కూర్చున్నారు,”

టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో.. టీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రజల కోసం, మరో పార్టీ తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకుని ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యాలతో ఆవిర్భవిస్తే.. జనసేన పార్టీ జాతి కోసం ఆవిర్భవించిందని, అధికారం కోసం కాదు ప్రజల కోసం పట్టుపడతానని, తన బలం తనకు తెలుసునని, అదేమాదిరి తన బలహీనత తనకు తెలుసన్న జనసేనాధిపతి పవన్‌ ‌కల్యాణ్‌ ‌పరిస్థితి అయోమయంగా తయరైంది. ఏ జాతీయ పార్టీ అయినా.. తన తల మీద తుపాకులు పెట్టినా జనసేన పార్టీని కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసారంటే ఆ పార్టీ ఎలాంటి ఇబ్బందుల్లో ఉందో అర్ధమౌతుంది.. జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయాలంటూ ఒక పార్టీ నుంచి ఒత్తిడి వస్తోందని, అయితే తలపై తుపాకులు పెట్టినా జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదని స్పష్టం చేసిన విషయం గుర్తునుకోవాలి. జాతి సమగ్రతని కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని, భావజాలాన్ని అర్థంచేసుకున్నవాళ్లతో పార్టీ నడుపుతానన్నారంటే కేడర్‌ ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక తలపట్టుకు కూర్చున్నారు

2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. . జనసేన రాజకీయ పార్టీగా 2014 మార్చి 14న ఆవిర్భవించినప్పుడు కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు ఆయన చెప్పారు. జనసేనపార్టీ పేరిట మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ 2014 ‌సాధారణ ఎన్నికల్లో రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్‌ ‌ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్‌ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని అభిమానులకు పిలుపునిచ్చి భారతీయ జనతా పార్టీకి, నేరుగా మోదీకి మద్దతు నిలిచాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో టీడీపీ -బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు.

ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా కొన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడినా ఆ తరువాత జనసేనను పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టి జనాల్లో నమ్మకం కోల్ఫొయాడు. ఏపి లో తాజాగా మునిసిపల్‌ ఎన్నికల్లో బిజెపితో కలసి నడిచినా ఓట్ల సాధనలో ఘోరంగా విఫలమై రాజకీయాలలో బిజెపి దూరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే మాది తెలంగాణలో మండలి ఎన్నికలలో బిజెపి అభ్యర్ధిని కాదని, టి ఆర్‌ ఎస్‌ ‌ప్రతిపాదించిన కాంగ్రెస్‌ ‌మాజీ దివంగత ప్రధాని కుమార్తె వాణీదేవికి మద్దతు పలకడం ఆయన పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు గమనిస్తే బిజెపి మిత్ర పక్షంగా కొనసాగడంలో భవిష్యత్‌ అనుమానాస్పదంగానే కనిపిస్తున్నది.

తెలంగాణ బిజెపి నాయకత్వం తమకు వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ, ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరిస్తున్నందున బిజెపితో సహరించడం సాధ్యంకాదన్న రీతిలో మాట్లాడడం, ఆ దెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతున్నట్లు కనిపిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ ‌తిరుపతి పార్లమెంట్‌ ‌స్థానానికి ఏప్రిల్‌ ‌లో జరుగనున్న ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన అభ్యర్ధిని పోటీకి పెట్టాలన్న అలోచనకు ఆ రాష్ఘ్ట్ర బిజెపి గండికొట్టడం బిజెపి కేవలం తమను పావుగా వాడుకోవడానికి పన్నాగమేనన్న అభిప్రాయానికి జనసేన వచ్చింది. ప్రారంభంలో పవన్‌ ‌కల్యాణ్‌ ‌తనను తాను చెగువేరా గా చెప్పుకుని, వామపక్ష భావాలుంటాయని సూచించే విధంగా పతాకంలో ఎర్ర నక్షత్రం గుర్తు పెట్టి, అకస్మాత్తుగా రంగుమార్చి చంద్రబాబు, మోదీ ద్వయానికి చేరువై భావజాలం మార్చుకోవడంతో మనిషిలో స్థిరత్వం లేదని జనాలకు సంకేతం వెళ్ళింది. 2014 ఎన్నికల్లో తన పార్టీని పోటీకి దింపకుండా చంద్రబాబు, మోదీల విజయాలకు సహరించాడన్న అపకీర్తి భుజానికెత్తుకున్నాడు.

అయితే 2019 ఎన్నికలప్పుడు పవన్‌ ‌మళ్ళీ దారిమార్చి ఆంధ్రప్రదేశ్‌ ‌కు ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతోందని, నిధుల విడుదల విషయంలో మోదీ ఉత్తర దక్షిణ దేశాల మధ్య తేడా చూపుతున్నారంటూ కొత్త అరోపణ చేసారు. 2019 ఎన్నికలలో జనసేనను పోటీకి నిలిపి, తాను స్వయంగా భీమవరం, గాజువాకలో రెండు చోట్ల పోటీ చేసి రెండు స్థానాలలోనూ పరాజయం పాలవ్వగా, పార్టీ ఏపిలో కేవలం ఒక్క స్థానంలో గెలుపొంది, తెలంగాణాలో పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ ఓటమి పాలయ్యింది. రాజకీయ సాగరంలో తిమింగలం అవుదామనుకున్నా చివరకు చెరువు నుంచీ బయటపడి గిలగిలా కొట్టుకునే చేపలా మిగిలాడు. బిజెపి కి ‘‘బి’’ టీం గా కూడా నిలబడలేక చీర్‌ ‌లీడర్‌ ‌లా మిగిలిపోయాడు.

రాజకీయాలలో ప్రవేశించిన నాటి నుంచీ ఒంటరి పరుగు కంటే ఎవరితోనో ఒకరితో కలసి నడవడమే ఎంతో మేలన్న ఆలోచనతో ఒక సారి ఒకరితో మరోసారి వేరొకరితో మిత్రత్వం నెరపుతూ స్థిరత్వం లేకుండా మళ్ళీ రూటు మార్చి బిజెపితో సన్నిహితంగా ఉంటున్న పవన్‌ ‌గత బిజెపి నేటి బిజెపికి ఉన్న తేడా గుర్తించడం లేదు. సంకీర్ణ ప్రభుత్వ అలోచనతో మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇచ్చేది గత బిజెపి నాయకత్వం, ఇప్పుడు అందుకు భిన్నంగా మోదీ నేతృత్వంలోని పార్టీ విపక్షాన్నే కాక మిత్ర పక్షాలకు కూడా… శివసేన, అకాలిదళ్‌, ‌నితిష్‌ ‌కుమార్‌, ‌శశికళ కు నేర్పిన పాఠాలనుకూడా పవన్‌ ‌గుర్తించిన దాఖలాలు లేవు.

ఆంధ్రలో కాపు వర్గీయుల ఓట్లను పవన్‌ ఆకర్షిస్తారన్న తలంపుతో బిజెపి పవన్‌ ‌ను అక్కున చేర్చుకున్నది కాని ప్రేమతో కాదని, అవసరం ఉన్నంతవరకూ వాడుకుని ఆ తరువాత కరివేపాకులా తననుకూడా తీసివేస్తారని అలోచన పవన్‌ ‌కు ఉన్నట్లు లేదు. రాజకీయ క్రీడలొ ప్రేక్షకులను ఉత్తేజపరచే చీర్‌ ‌లీడర్‌ ‌మాదిరి తాను ఉపయోగ పడుతూ బిజెపి ఆధిపత్యానికి తావు కల్పిస్తూ, మరో వైపు మిత్రపక్షంగా తనకు, తన పార్టీకి సముచిత గౌరవం ఇవ్వాలంటూ కోరుకోవడం ఆయన అనుభవ రాహిత్యమేనని అంటున్నారు. గతంలో బిజెపి అధినేత పక్కనుండి ఒక గుర్తింపు పొంది తెలుగు దేశానికి తానెంతగా ఉపయోగ పడిందీ, ఆ తరువాత తానేవిధంగా నస్టపోయిని తెలుసుకోలేని మాయలో పడ్డారా, లేకుంటే తనకు ఇంతకంటే ఏమి కావాలనుకుంటున్నారా తెలుసుకోలేని మాయలో పడ్డారనుకోవాలా..

ఏడేళ్ళుగా పవన్‌ ‌రాజకీయ రంగుల ప్రపంచంలో ప్యాక్‌ అప్‌ ‌పాత్రలో లీనమై సినిమా కెమేరాల బదులు టీవీ కెమేరాల ఎదుట అద్భుతంగా రాజకీయ నటుడిగా రాణించాడనుకోవాలా ? సరైన స్క్రిప్ట్ ‌లేకుండా ఏక కాలంలో ఇటు సినిమా, అటు రాజకీయ రంగాలలో నటించడంతో నాయకుడుగా రాణించలేక, నటుడుగా నిలబడలేక అయోమయంలో పడినట్లయింది. జనసేనలో తన పాత్ర ఏమిటో నిర్ణయించుకోలేని స్థితిలో బిజెపి నీడలో దక్కిన సహాయ నటుడిగా మిగిలినట్లు తయారైంది. ఇదిలా ఉంటే, ఏపి మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటమి పరాభవం నేపథ్యంలో వై ఎస్‌ ఆర్‌ ‌సి పిసంధించేందుకు పై విమర్శనాస్త్రాలు సిద్ధపడుతూ రాజకీయంగా ఏర్పడ్డ శూన్యత పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

స్థిరమైన రాజకీయ సిద్ధాంతం, ప్రణాళిక, విధానం, నిర్మాణ ప్రక్రియ లేకుందా ఒక పార్టీ ఎలా ఎంతకాలం మనుగడ సాగిస్తుంది. ఏ రాజకీయ పార్టీ పట్ల, ఆర్ధిక, సామాజిక అంశాలపై తన వైఖరి ఏమిటో ఇప్పటికీ నిర్ధారించుకోలేని వాతావరణంలో నాయకుని నమ్మి ఎందరు రంగంలో నిలదొక్కుకుంటారని, బయటనుంచీ వచ్చే ఒత్తిడులను తట్టుకుంటారని సర్వత్రా వినిపిస్తున్న విషయమే. ఇప్పటికైనా బిజెపి బంధణీరోగా ఆలనుంచీ బయటపడి,దుతుందని సహాయనటుడిగా కాక కథానాయకునిగా నిలబడితే ఆంధ్రప్రదేశ్‌ ‌రాజకీయ వేదికపై పవన్‌ ‌కు తప్పక కీలక పాత్ర దక్కుతుందని అప్పుడు నిజంగా జనసేనానిగా ఎదుగుతారని విశ్లేషకులు అంటున్నారు.
– శామ్‌ ‌సుందర్‌

Leave a Reply