Take a fresh look at your lifestyle.

సమగ్ర శిక్ష ఉద్యోగుల పీఆర్సీ పిట్మెంట్‌ ‌కు మోక్షమెప్పుడు?.

‌ప్రాథమిక స్థాయి విద్యా సమాచారాన్ని జిల్లాకు చేరవేయలన్న ,జిల్లా స్థాయి విద్యా సమాచారాన్ని ప్రాథమిక స్థాయికి  చేరవేయలన్న సమగ్ర శిక్ష అభియాన్‌ ‌లో పని చేస్తున్న సీఆర్పీలు, ఎమ్‌ ఐ ‌యెస్‌ ‌కోఆర్డినేటర్లు,డేటా ఎంట్రీ ఆపరేటర్లుదే కీలకపాత్ర.తెలంగాణ పల్లెల్లో బాలికల చదువుకు బంగారు బాటలు వేస్తున్నది సమగ్ర శిక్ష అభియాన్‌లో భాగమైన కేజీబీవీ ఉపాధ్యాయునీయులు, తెలంగాణ గ్రామాల్లో దివ్యాంగులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నది సమగ్ర శిక్ష అభియాన్‌ ‌లో భాగమైన  ఒప్పంద ప్రత్యేక ఉపాధ్యాయులు (ఐ.ఈ.ఆర్‌.‌పి లు).ఇంతటి సేవలందిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగ,ఉపాధ్యాయులకు స్వరాష్ట్రంలో ప్రకటించిన మొదటి పీఆర్సీ పిట్మెంట్‌ అం‌దని ద్రాక్షగానే మిగిలింది.

వారంతా గత పది,పదిహేను సంవత్సరాలుగా సమగ్ర శిక్ష అభియాన్‌ ‌లో పని చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి విద్యా సమాచారాన్ని జిల్లాకు చేరవేయలన్న ,జిల్లా స్థాయి విద్యా సమాచారాన్ని ప్రాథమిక స్థాయికి  చేరవేయలన్న సమగ్ర శిక్ష అభియాన్‌ ‌లో పని చేస్తున్న సీఆర్పీలు, ఎమ్‌ ఐ ‌యెస్‌ ‌కోఆర్డినేటర్లు,డేటా ఎంట్రీ ఆపరేటర్లుదే కీలకపాత్ర.

తెలంగాణ పల్లెల్లో బాలికల చదువుకు బంగారు బాటలు వేస్తున్నది సమగ్ర శిక్ష అభియాన్‌లో భాగమైన కేజీబీవీ ఉపాధ్యాయునీయులు, తెలంగాణ గ్రామాల్లో దివ్యాంగులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నది సమగ్ర శిక్ష అభియాన్‌ ‌లో భాగమైన  ఒప్పంద ప్రత్యేక ఉపాధ్యాయులు (ఐ.ఈ.ఆర్‌.‌పి లు).ఇంతటి సేవలందిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగ,ఉపాధ్యాయులకు స్వరాష్ట్రంలో ప్రకటించిన మొదటి పీఆర్సీ పిట్మెంట్‌ అం‌దని ద్రాక్షగానే మిగిలింది.

దేవుడు వరమిచ్చినా  పూజారి కరుణించడంలేదు:
స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా 30% పీఆర్సీ పిట్మెంట్‌ ‌కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్‌ ఉద్యోగ,ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందని ప్రకటించినప్పటికీ వాస్తవ రూపం దాల్చనేలేదు. రెగ్యులర్‌ ఉద్యోగ,ఉపాధ్యాయులకు అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగ,ఉపాధ్యాయులకు పీఆర్సీ ఫిట్మెంట్‌ ‌వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన్నప్పటికీ సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న సుమారు 18 వేల ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఇప్పటికీ పీఆర్సీ ఫిట్మెంట్‌ ‌కు సంబంధించి ఉత్తర్వులు వెలుబడనేలేవు.

సమగ్ర శిక్ష విభాగంలో కేంద్రం వాటా 60 శాతం,రాష్ట్రం వాటా 40 శాతం ఉన్నందున పీఆర్సీ పిట్మెంట్‌ 40 ‌శాతానికే వర్తిస్తుందని ఉన్నత అధికారులు కండిషన్‌ ‌పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య పథకంలోనే పనిచేస్తున్న అంగన్వాడీ,ఆశా వర్కర్ల పీఆర్సీ ఫిట్మెంట్‌ ‌కు లేని షరతు సమగ్ర శిక్ష ఉద్యోగులకే ఎందుకు?. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్‌ ‌కై అన్ని రాష్ట్రాలకు సమాన వాటాలోనే నిధులు విడుదల చేస్తున్న మన రాష్ట్రంలోనే వారి జీతాలు తక్కువేం దుకున్నాయి?.ఇతర రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులు  మన రాష్ట్రం కంటే ఎక్కువ వేతనాలు పొందడంలేదా?.

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సుమారు 66 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగ,ఉపాధ్యాయులు 58 వేల మంది ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగ,ఉపాధ్యాయులు వివిధ డిపార్ట్మెంట్‌ ‌లలో పని చేస్తున్నారు. కానీ పీఆర్సీ ఫిట్మెంట్‌ ‌కొందరికి వర్తిస్తూ,మరికొందరికి వర్తించకపోవడం,కొందరికి మినిమం బేసిక్‌ ‌పే  వర్తింపజేస్తూ,మరికొందరికి కనీసం ఫిట్మెంట్‌ ఉత్తర్వులు కూడా ఇవ్వకపోవడంలో అంత ర్యమేమిటి?.

రెగ్యులరైజేషన్‌ ‌దేవుడెరుగు జీతాలైన పెంచారా?
సమగ్ర శిక్ష విభాగంలో సుమారు 18 వేల ఉద్యోగ,ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.సీఆర్టీలు 20 వేల వేతనానికె,సీఆర్పీలు,ఎమ్‌ ఐ ‌యెస్‌  ‌కోఆర్డినేటర్లు, ప్రత్యేక ఒప్పంద ఉద్యోగులు 15 వేల వేతనానికె,డేటా ఎంట్రీ ఆపరేటర్లు 14 వేల వేతనానికె,పి ఈ టీ లు 12 వేల,ఎ ఎన్‌ ఎమ్‌ ‌లు 11 వేల వేతనానికె గత ఐదు,ఆరు సంవత్స రాలుగా పని చేస్తున్నారు.రెగ్యులర్‌ ఉద్యోగ,ఉపాధ్యాయులు చేసే పని కాంట్రాక్టు ఉద్యోగ,ఉపాధ్యాయులు చేసే పని ఒక్కటే అయినప్పటికీ కనీస వేతనాలు ఇవ్వకపోవడం వెట్టిచాకిరి కాదా? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం.గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్నా రెగ్యులరైజేషన్‌  ‌దేవుడెరుగు కనీసం పెంచిన పీఆర్సీ పిట్మెంట్‌ అయినా వర్తింపజేస్తే బాగుండని సమగ్ర శిక్ష ఉద్యోగులు వాపోతున్నారు.

ప్రభుత్వం స్పందించాలి:
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతునందున పెరిగిన ధరలకు అనుగు ణంగా  ప్రభుత్వం వెంటనే పీఆర్సీ పిట్మెంట్‌ ‌వర్తింపజేస్తూ వేతనాలు పెంచాలి.తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా కుసుమాలు పూయిస్తున్న కే జీ బీ వీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు,తెలంగాణ పల్లెల్లో దివ్యాంగులకు విద్యానందిస్తున్న ఒప్పంద ప్రత్యేక ఉపాధ్యాయులకు, తెలంగాణ విద్యావ్యవస్థలో ప్రాథమిక స్థాయిలో కీలకంగా పని చేస్తున్న సీఆర్పీలకు,ఎం ఐ యెస్‌ ‌కోఆర్డినేటర్లకు,డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వెంటనే పీఆర్సీ ఫిట్మెంట్‌ 30% ‌వర్తింపచేసి బంగారు తెలంగాణలో భాగస్వాములను చేయాలి.

–  జుర్రు నారాయణ యాదవ్‌,
‌తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌,
‌జిల్లా అధ్యక్షులు, మహబూబ్నగర్‌,
9494019270.

Leave a Reply