“ప్రస్తుతం ప్రపంచ మానవాళి అడిగే ప్రశ్న ఒక్కటే. మాకు టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?. ఎందుకంటే ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వ్యాధుల నివారణకు కనిపెట్టబడిన టీకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఏళ్ళ తరబడి సమయం తీసుకున్నాయి.హెచ్ పివి వ్యాక్సిన్ అభివృద్ధి చెందడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. చికెన్పాక్స్ వ్యాక్సిన్ ఇరవై ఎనిమిది సంవత్సరాల సమయం తీసుకుంది. సైటోమెగలోవైరస్, హెచ్‌ఐవితో సహా అనేక ప్రాణాంతక వైరస్ ల నిర్మూలన కోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నప్పటికిని ప్రభావవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడలేదు. కోవిడ్ -19 కోసం వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉన్న ఒక సంభావ్య మార్గం ‘‘సవాలు అధ్యయనం’’ మాత్రమే. దీనిలో పరిశోధకులు శరీర సంబంద ఆరోగ్యకరమైన మార్పులకు అవసరమయ్యే వ్యాక్సిన్ ఇస్తారు. ఫలితం సానుకూలంగా ఉంటే కరోనా వ్యాధిగ్రస్తుల మీద ప్రయోగిస్తారు.”
మానవ జీవ పరిణామ క్రమంలో అంటు వ్యాధులు అప్పుడప్పుడు ప్రపంచాన్ని పలకరిస్తూనే ఉంటాయి. మనిషి చేసే ప్రకృతి వ్యతిరేక చర్యలకు వికృత ఫలితాలను ప్రకటిస్తూ మనిషి మేధస్సుకు సవాలు విసురుతూనే ఉంటాయి. ఆధునిక మానవ చరిత్రలో ఎన్నో వ్యాధులు ప్రబలినప్పటికిని, కరోనాలా ప్రపంచాన్ని వణికించిన అంటువ్యాధి మరొకటి కనిపించదు. కోవిడ్-19 ప్రబలిన నాటి నుంచి దినదినం వాయువేగంతో వ్యాపి చెందుతూ ప్రపంచాన్ని చేష్టలుడిగేలా చేసింది. పరిష్కారం లేని సమస్యగా పరిణమించి మానవ సమాజానికి పెను సవాలుగా మారింది. కరోనా టీకా ఎప్పుడు వస్తుందని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించి అన్ని రంగాలను స్థంభింపజేసినప్పటికిని, ఇది శాశ్వత పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఇజ్రాయేల్ వంటి దేశాలు కరోనా టీకాను కనిపెట్టడంలో పురోగతిని సాధించాయని వార్తలు వస్తున్నప్పటికి, అవి ఇంకా ప్రయోగ దశలోనే ఉండి నిరీక్షణ సమయాన్ని పెంచేసాయి.
ప్రస్తుతం ప్రపంచ మానవాళి అడిగే ప్రశ్న ఒక్కటే. మాకు టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?. ఎందుకంటే ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వ్యాధుల నివారణకు కనిపెట్టబడిన టీకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఏళ్ళ తరబడి సమయం తీసుకున్నాయి.హెచ్ పివి వ్యాక్సిన్ అభివృద్ధి చెందడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. చికెన్పాక్స్ వ్యాక్సిన్ ఇరవై ఎనిమిది సంవత్సరాల సమయం తీసుకుంది. సైటోమెగలోవైరస్, హెచ్‌ఐవితో సహా అనేక ప్రాణాంతక వైరస్ ల నిర్మూలన కోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నప్పటికిని ప్రభావవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడలేదు. కోవిడ్ -19 కోసం వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉన్న ఒక సంభావ్య మార్గం ‘‘సవాలు అధ్యయనం’’ మాత్రమే. దీనిలో పరిశోధకులు శరీర సంబంద ఆరోగ్యకరమైన మార్పులకు అవసరమయ్యే వ్యాక్సిన్ ఇస్తారు. ఫలితం సానుకూలంగా ఉంటే కరోనా వ్యాధిగ్రస్తుల మీద ప్రయోగిస్తారు. సాంప్రదాయిక పరీక్షలలో పరిశోధకులు సాధారణంగా పరీక్షా టీకా లేదా ప్లేసిబో (సర్వరోగ నివారిణి)ను ఇస్తారు. టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి వారి సాధారణ జీవన పరిస్థితులలో కాలక్రమేణా మార్పులను గమనిస్తారు. కానీ సవాలు అధ్యయనంలో సహజంగా సంభవించే సంక్రమణ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇది తక్కువ సమయాన్ని తీసుకుంటున్నప్పటికిని, ఫలితాలు కొన్నిసార్లు విభిన్నంగా ఉండవచ్చు. ఏదేమైనా, ఈసమయంలో కోవిడ్ -19 ఛాలెంజ్ అధ్యయనాల కోసం అన్ని వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఇందులో కొందరు బయోఎథిస్టులు ఉండడం విశేషం.
సవాలు అధ్యయనాల కోసం ప్రయోజనకరమైన వాదన సూటిగా ఉంటుంది. వ్యాధి తీవ్రత ఉన్న రోగుల సంఖ్యను లెక్కించి, ప్రాణాలను రక్షించే సంభావ్య సంఖ్యతో పోలుస్తారు. ఛాలెంజ్ స్టడీస్ కు మద్దతుదారులు ఒక అధ్యయనం ప్రకారం (చైనా నుండి వచ్చిన డేటా ఆధారంగా) కోవిడ్ -19 నుండి ఇరవై మరియు ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఆరోగ్యకరమైన వయోజనుడికి 0.03 శాతం చొప్పున మరణించే ప్రమాదాన్ని అంచనా వేశారు. అయితే కోవిడ్ -19 నుంచి సంక్రమించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వారు వాదిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వాటిని సంక్రమించడం వల్ల ఎక్కువ ప్రమాదం ఉండదని, కనీసం ఒక సవాలు అధ్యయనంలో వారి వైద్య పరిస్థితిని నిశితంగా పరిశీలించవచ్చని అంటున్నారు. ఛాలెంజ్ అధ్యయనాలకు సజంగానే ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనలో చాలా మంది ఆరోగ్యవంతులు పరిశోధనల నిమిత్తం తనకు వ్యాధికారకం సంక్రమించాలనే ఆలోచనతో వెనక్కి తగ్గుతారు. 1940 ల చివరలో గ్వాటెమాల సిఫిలిస్ అధ్యయనం వంటి పరిశోధనలు దుర్వినియోగానికి గురయ్యాయని విమర్శించబడ్డాయి. యుఎస్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ కార్మికులు గ్వాటెమాల ఖైదీలు, సైనికులు, వేశ్యలు, ఇతర మానసిక రోగులకు సిఫిలిస్, గనేరియాను ఉద్దేశపూర్వకంగా అంటించారు. ఆ వ్యాధుల నివారణకు మందు కనిపెట్టే దశలో చేసిన ఈ ప్రయోగాత్మక చర్య అత్యంత అనైతికమని మానవ హక్కుల సంఘాలు, సామాన్య ప్రజలు సైతం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాయి.
కోవిడ్ -19 ఛాలెంజ్ అధ్యయనాలు కొనసాగాలని చాలా మంది అభిలషిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలెంజ్ అధ్యయనాలను స్పష్టంగా ఆమోదించలేదు, కానీ అవి ఎలా నైతికంగా నిర్వహించబడాలనే విధానపరమైన మార్గదర్శకాలను వెలువరించింది. కనిష్ఠ స్థాయి నష్టాన్ని మాత్రమే కలిగి ఉంటూ వైరల్ మోతాదును ఖచ్చితమైన టైట్రేషన్ తో ఒక్కొక్కటిగా బహిర్గతం చేయాలి. వన్ డే సూనర్ అనే స్వచ్చంద సంస్థ కోవిడ్ -19 ఛాలెంజ్ స్టడీస్ కోసం 26,000 మంది వాలంటీర్లను సేకరించినట్లు వెల్లడి చేసింది. డ్రగ్ ట్రయల్స్ మీద మొదటి ఫేజ్ పరీక్షలు చేస్తారు. ఇవి సాధారణంగా ప్రయోగాత్మక మందులు సురక్షితంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నిర్వహిస్తారు. ఛాలెంజ్ స్టడీస్లో మాదిరిగా మొదటి ఫేజ్ ట్రయల్స్లో పరిశోధకులు ఉద్దేశపూర్వకంగా తమ పరిశోధనలను ప్రమాదకర స్థాయిలో చేస్తారు. ఇందుకోసం పరిశోధనా స్పాన్సర్లు సాధారణంగా రోజుకు 200 మరియు రూ.250 మధ్య డబ్బును వెచ్చిస్తారు. చాలా మంది ఆదర్శ యువకులు కోవిడ్ -19 వ్యాక్సిన్ అధ్యయనాల ప్రయోజనాన్ని స్వీకరించడమే కాక, వారి ఆరోగ్యాన్ని ప్రజా సంక్షేమం కోసం పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ అధ్యయనాలను ఎలా సురక్షితంగా, సరళంగా చేయాలనేదే ప్రస్తుతం సవాలుతో కూడుకున్న అంశం.
కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రయొగాత్మక దశలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు 7.41 మిలియన్లను దాటి, 4,18,000 మరణాలు సంభవించాయి. టీకా అభివృద్ధిలో రెండు ప్రముఖ పేర్లు వినబడుతున్నాయి. యుఎస్ సంస్థ మోడెర్నా ఇంక్ మరియు చైనా యొక్క సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ లు ప్రయోగాత్మక పరిశోధనలో స్పష్టమైన పురోగతి సాధించారు. తాజా పరిణామాలలో, మోడరనా ఇంక్ తన ఎ=చీ•-1273 వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించారు. ఈ పరిశోధన సంబందిత ఫలితాలు వచ్చే నెల వరకు సానుకూలంగా రావచ్చని ఆశిస్తున్నారు. ఈ ఫలితాలననుసరించి కోవిడ్-19 మరింత తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని పెంచదని కొంత భరోసా వచ్చింది. టీకా ఫర్మ్ ఎ=చీ•-1273 కోసం ఇప్పటికే రెండవ దశ ట్రయల్స్ ప్రారంభించిన యుఎస్ సంస్థ మోడెర్నా ఇంక్, మూడవ దశ స్టడీ ప్రోటోకాల్ను ఖరారు చేసింది. ఇందులో సుమారు 30,000 మంది పాల్గొంటారు. యాదృచ్ఛిక, ప్లేసిబో-నియంత్రిత ట్రయల్ జూలైలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకా, ఎలుకలపై అధ్యయనాలలో కొంత భరోసా ఇచ్చింది, ఇది మరింత తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని పెంచకపోవచ్చు. కాని ఒక మోతాదు నోవల్ కరోనావైరస్ నుండి రక్షణను అందిస్తుంది. అమెరికన్ దిగ్గజ ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తన పునఃసంయోగం చేసిన వ్యాక్సిన్ కోసం మానవ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది.
చైనా సంస్థ సినోవాక్ బయోటెక్ తన కరోనావాక్ వ్యాక్సిన్ యొక్క మూడుదశల పరీక్షలొ చివరి దశను నిర్వహించడానికి బ్రెజిల్లోని ఒక ఔషధ తయారీదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదిక తెలిపింది. బ్రెజిల్ అధికారులు ఆమోదించిన తర్వాత, సినోవాక్ మరియు ఇన్స్టిట్యూటో బుటాంటన్ జూలైలో 9,000 మంది పాల్గొన్న విచారణను ప్రారంభిస్తారు. బ్రెజిల్ ఔషధ తయారీదారు చైనా వ్యాక్సిన్‌కు లైసెన్స్ ఇచ్చి దక్షిణ అమెరికా దేశంలో అందుబాటులో ఉంచనున్నట్లు సినోవాక్ ప్రకటించింది.ఇదేసమయంలో సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్ సురక్షితమైనదని మరియు మానవ పరీక్షల నుండి రోగనిరోధక ప్రతిస్పందనను పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రాథమిక పరిశోధనలలో విజయవంతంగా ప్రయోగించబడింది. కరోనావాక్ వ్యాక్సిన్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించకపోవడమే గాకా, 90 శాతం మంది ప్రజలలో టీకాలు వేసిన రెండు వారాల తర్వాత తటస్థీకరించే ప్రతిరోధకాలను ప్రేరేపించబడ్డాయని సినోవాక్ ప్రకటించింది. ఇవి ప్రజల ఉపయోగం కోసం ఆమోదించబడటానికి ముందే మానవ పరీక్ష యొక్క కీలకమైన చివరి దశకు చేరుకున్నాయి.
బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ్గణ1222 వ్యాక్సిన్ ప్రస్తుతం 10,000 మంది వాలంటీర్లతో రెండవ దశ ట్రయల్స్లో ఉంది. టీకా యొక్క చివరి దశ పరీక్షలు బ్రెజిల్లో నిర్వహించబడతాయి. ఆరోగ్యకరమైన వాలంటీర్లలో ప్రయోగాత్మక కోవిడ్ -19 వ్యాక్సిన్ పరీక్ష ఏప్రిల్లో బ్రిటన్లో 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల 1,000 మందిపై నిర్వహించారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి, వర్తించే సాంకేతికత వారి పరిశోధనాత్మక ఎబోలా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఉపయోగించిన మాదిరిగానే ఉంటుంది. అలాగే జికా వైరస్, ఆర్‌ఎస్వి, హెచ్‌ఐవి వ్యాక్సిన్ ప్రయోగ పద్దతులనే పోలి ఉంటుంది. మన దేశానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి కూడ కరోనాకు మందు కనిపెట్టే విషయంలో పురోగతి సాధించినట్లు ప్రకటించింది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని తమ మందుతో వంద శాతం సానుకూల ఫలితాలు సాధించామని కంపెని వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. పరిశోధనలు విజయవంతమై టీకా అందు బాటులోకి వచ్చేవరకు మనిషి సంరక్షణభారమంతా ఆయన మీదే ఉన్నదనేది నిర్ద్వందమైన అంశం. ఈ సంధీకాలంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు భౌతిక దూరాన్ని పాటించడమే మనిషి చేసే రోగ నిరోదక కార్యాక్రమం.
