Take a fresh look at your lifestyle.

పారిశుద్ద కార్మికులను మనుషులుగా చూసేదెప్పుడు?

“అం‌టరానితనం నిర్మూలనకు గాంధీజీ ప్రయత్నించినట్లు మనందరికీ తెలుసు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన తనను తాను అంటరానికులాలలో ఒకటైన పారిశుద్ద కార్మిక వర్గానికి చెందిన ‘భాంగి’గా అభివర్ణించుకుని, తన ఆశ్రమాల మరుగుదొడ్లను స్వయంగా శుభ్రపరిచాడు. సమాజం కోసం ఒక ‘భాంగి’ చేసే పనిని, ఒక తల్లి తన బిడ్డ కోసం చేసే పనిగా పోల్చాడు. అంతేకాకుండా అంటరానివారిని హరిజనులు (దేవుని పిల్లలు) అని ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు దశాబ్దాల అనంతరం 2021 లో కూడ ఒక వ్యక్తి అశుద్ధాలను మరో వ్యక్తి ఎత్తిపొసే మానవీయ పారిశుద్ద విధానం ఇంకా ఉనికిలో ఉంటుందని ఆ సమయంలో ఆయన ఊహించి ఉండడు. గాంధీ, అంబేద్కర్లు కులం, అంటరానితనం అంశాల పట్ల భిన్నమైన ధృక్పథాలను ప్రచారం చేశారు.”

అంటరానితనం నిర్మూలనకు మహాత్మాగాంధీ, అంబేద్కర్లు విలక్షణమైన విధానాలను అవలంభించారు. గాంధీ దృష్టిలో అంటారానితనం నిర్మూలన ఆత్మశుద్ది కార్యం కాగా, అంబేద్కర్‌ ‌దీనిని కుట్రాపూరిత కుల వ్యవస్థకు పరాకాష్టగా చూశాడు. 21 వ శతాబ్దపు భారతదేశంలో కూడా సెప్టిక్‌ ‌ట్యాంకుల్లో పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ చనిపోతుండటం కుల వ్యవస్థ బలంగా ఉందనడానికి నిదర్శనం. అంటరానితనం నిర్మూలనకు గాంధీజీ ప్రయత్నించినట్లు మనందరికీ తెలుసు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన తనను తాను అంటరానికులాలలో ఒకటైన పారిశుద్ద కార్మిక వర్గానికి చెందిన ‘భాంగి’గా అభివర్ణించుకుని, తన ఆశ్రమాల మరుగుదొడ్లను స్వయంగా శుభ్రపరిచాడు. సమాజం కోసం ఒక ‘భాంగి’ చేసే పనిని, ఒక తల్లి తన బిడ్డ కోసం చేసే పనిగా పోల్చాడు. అంతేకాకుండా అంటరానివారిని హరిజనులు (దేవుని పిల్లలు) అని ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు దశాబ్దాల అనంతరం 2021 లో కూడ ఒక వ్యక్తి అశుద్ధాలను మరో వ్యక్తి ఎత్తిపొసే మానవీయ పారిశుద్ద విధానం ఇంకా ఉనికిలో ఉంటుందని ఆ సమయంలో ఆయన ఊహించి ఉండడు.

గాంధీ, అంబేద్కర్లు కులం, అంటరానితనం అంశాల పట్ల భిన్నమైన ధృక్పథాలను ప్రచారం చేశారు. అంటరాని కులాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రావాలనీ, ప్రభుత్వాలలో వారికి సరైన ప్రాతినిధ్యం ఉండాలనీ 1919 నుండే అంబేడ్కర్‌ ‌వాదిస్తూ వచ్చాడు. 1927లో సైమన్‌ ‌కమిషన్‌ ‌ముందు కూడా ఆయన తన వాదనలను వినిపించాడు. 1930-32 మధ్య లండన్‌లో జరిగిన రెండు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాల్లోనూ ఆయన అదే అంశంపై గట్టిగా వాదించారు. రెండో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశానికి కాంగ్రెస్‌ ‌తరపున హాజరైన మహాత్మాగాంధీ అంటరాని కులాల రాజకీయ హక్కుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించగా.., నిమ్నవర్గాలకు రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలనీ అంబేడ్కర్‌ ‌కోరాడు. లేకుంటే రాజకీయ స్వేచ్ఛకు బదులు వారు తరతరాల బానిసత్వానికి బలికావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, అంటరాని వారు హిందువులేనని, వారికి ప్రత్యేక ఓటింగ్‌ ‌హక్కులు, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే ఏర్పాట్లు అవసరం లేదని గాంధీ గట్టిగా అడ్డుతగిలాడు.

రెండు వాదనలనూ విన్న బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అంబేడ్కర్‌ ‌సూచించినట్టు అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్‌ ‌హక్కుకు, తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశానికి అంగీకరించింది. 1932 లో జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం అనంతరం అంబేద్కర్‌ అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కోరినప్పుడు దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలలో అలజడి రేగింది. ముందు స్వాతంత్రం రాని, ఆ తర్వాత నిమ్న కులస్తుల సమస్యలు పరిష్కరిద్దామని గాంధిజీ సైతం ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించాడు. ఇక్కడ అంటరాని ప్రజల అసలైన ప్రతినిధి ఎవరు ? కమ్యూనల్‌ అవార్డు ననుసరించి ముస్లింలు, సిక్కులు, అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేసినప్పుడు, వాటిని వ్యతిరేకిస్తూ తాను ఆమరణదీక్ష చేస్తానని గాంధీజీ ప్రకటించాడు. ఇదే అంశంపై నాటి బ్రిటన్‌ ‌ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ ‌గాంధీకి రాసిన ఒక ఉత్తరంలో ‘‘ మీ ఉద్దేశం హిందువులకూ, అంటరాని కులాలకూ కలిపి ఓటింగ్‌ ఉం‌డాలని కాదు. హిందువుల మధ్య ఐకమత్యం సంరక్షించుకోవాలని కూడా కాదు.

అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా చేయుటకే మీరు ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని అనుకోక తప్పడం లేదు’’ అని అన్నాడు. అయితే, ‘‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్‌ ఇవ్వడం కూడా వారిని రక్షించదు’’ అంటూ గాంధీ తన పాత ధోరణిలోనే ఆయనకు సమాధానం ఇచ్చాడు. ప్రత్యేక నియోజకవర్గాలు హిందూ మతానికి భంగం కలిగిస్తాయని, ఇది హిందూ సమాజ విభజనకు కారణమౌతుందని ఆయన భయపడ్డారు. అయితే, హిందూ సమాజం అప్పటికే విభజించబడిందని ఆయన గ్రహించలేదు. భారతదేశ బ్రాహ్మణులు హిందువులలో ఈ కుల ఆధారిత విభజనతో చాలాకాలం తమ మనుగడ సాగించారు. వారు తమ మలమూత్రాలను ఎత్తిపోయడంతో పాటు, చనిపోయిన జంతువులను తొలగించే పనిలో భంగీలు, హలాల్‌ ‌ఖోర్‌ ‌వంటి అంటరాని కులాలను నియమించారు. అంబేద్కర్‌ ‌భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోలేదని గాంధీ ఆరోపించాడు. కానీ, సమాజంలో అంతటి అసమానతలు వేళ్ళూనుకుని ఉన్నప్పటికినీ, కులవ్యవస్థ నిర్మూలన పట్ల మహాత్ముడు తన ధృక్పథాన్ని వ్యక్తపరచలేదు. అదేసమయంలో, అంటరానితనం నిర్మూలనే లక్ష్యంగా హిందూ మతాన్ని తానెప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటానని అంబేద్కర్‌ ‌స్పష్టం చేశాడు.

‘అణగారిన వర్గాలు’ తమను తాము ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరాన్ని గాంధిజీ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. వృత్తి ఆధారిత కులవ్యవస్థ కఠినత్వాన్ని ఆయన ప్రశ్నించలేకపోయాడు. బ్రాహ్మణీకరించిన విధానాలు కాంగ్రెస్‌ ‌లో ఆధిపత్యం చెలాయించాయి. ప్రాతినిధ్యపు ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవడం వారి నిర్ణయాలలో అత్యంత స్పష్టంగా కనబడింది. అదేవిధంగా అట్టడుగు వర్గాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణను అందించడంలో వారి అసమర్థత బయటపడింది. గాంధీ చేపట్టిన ఆమరణ దీక్ష అంబేద్కర్‌, అణగారిన వర్గాలపై అనూహ్యమైన ఒత్తిడిని కలిగించింది. అంబేద్కర్‌ ‌ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పటికిని చివరికి లొంగిపోయి, యెర్వాడ జైలులో ఉపవాస దీక్షలో ఉన్నన గాంధీని సందర్శించాడు.

అంటరానితనాన్ని అంతం చేయాలని గాంధీ కోరుకున్నారనేది ప్రశ్నార్థకం. గాంధీ ప్రయోగించిన హరిజన్‌ ‌పరిభాష ఒక మూసపోత ఫలితం. కుల వ్యవస్థ ఫలితంగా దళితుల మీద జరిగిన దురాగతాల చరిత్ర గురించి ఆయన నేర్చుకోవలసి ఎంతో ఉందని స్పష్టంగా అవగతమవుతుంది. కులం ఆధారంగా వృత్తి గురించి తెలియకపోవడంతో పాటు ‘అంటరానితనాన్ని గాంధీ అంగీకరించడం వంటి విషయాలు ఇప్పటికీ పారిశుధ్య కార్మికులను గందరగోళంగా ఉంచాయి. హిందూ సమాజాన్ని నాలుగు వర్ణాల విభజనలో చూసే వర్ణశ్రమ ధర్మం నుండి గాంధీ వైదొలగలేకపోయాడు. ప్రతి వర్ణంలోని ప్రజలు భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలను అనుసరిస్తున్నారు. ఇదే కుల వ్యవస్థకు అసలు మూలం. ఇది కాలంతో పాటు కఠింగా బలపడి అణచివేత ఆధారిత క్రమానుగత వ్యవస్థగా మారింది. దేశంలో మొత్తం కుల వ్యవస్థను నిర్మూలించడానికి గాంధీ సిద్ధపడిన దాఖలాలు కనిపించవు. పూనా ఒప్పందం తర్వాత అంటరాని ప్రజలను దేవాలయాలలోకి రాకుండా అడ్డుకోరాదని గాంధీజీ పిలుపునిచ్చాడు. కాని వారిని అడ్డుకునే వర్గాల అధికారాన్ని ఆయన ప్రశ్నించలేకపోయాడు.

వాస్తవానికి భారతదేశ దళితులు మొదటి నుండి ‘హరిజన్‌’ అనే పదాన్ని అసహ్యించుకుంటూనే ఉన్నారు. ఆ పదం తమ స్థాయిని మరింతగా దిగజారుస్తూ, ఎద్దేవా చేస్తున్నట్టుగానే ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ గాంధీ తాను ‘దత్తత ద్వారా అంటరానివాడిని’’ అని చెప్పుకోకపోయివుండి, అంబేద్కర్‌ ‌పోరాటానికి అప్పుడే మద్దతు ఇచ్చి ఉంటే బహుశా మానవీయ పారిశుద్ద పద్దతి ఈ రోజు ఉనికిలో ఉండేదే కాదని పారిశుద్ద కార్మికులు భావిస్తున్నారు. అంటరానితనం కుల వ్యవస్థ వల్ల ఏర్పడిందని గాంధీజీ అర్థం చేసుకోలేకపోయాడు. అంటరానితనం నిర్మూలించబడాలంటే ప్రతి అగ్ర వర్ణస్తుడు తన హక్కును త్యజించాలని ఆయన గ్రహించలేదు. అంతేకాదు, తన తర్వాత మహాత్ములు కావడానికి ఆయన మరెవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. ఎటువంటి రక్షిత పరికరాలు లేకుండా మురుగు కాలువలు, సెప్టిక్‌ ‌ట్యాంకులను మానవీయంగా శుభ్రం చేయడానికి కార్మికులను నియమించడాన్ని నిషేధించే ఒక చట్టం ఇప్పటికే ఉందని మరియు పారిశుద్ధ్య కార్మికులకు సరైన, క్రమమైన వేతనాలు నేరుగా చెల్లించేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

మాన్యువల్‌ ‌స్కావెంజర్స్ ‌మరియు పునరావాస చట్టం, 2013 (ఎంఎస్‌ ‌యాక్ట్, 2013)‌సెక్షన్‌ 7, ‌భద్రతా పరికరాలు లేకుండా ట్యాంకుల లోపలికి వెళ్లడం ద్వారా కార్మికులు మురుగునీటి,సెప్టిక్‌ ‌ట్యాంకులను మానవీయంగా శుభ్రపరిచే పద్ధతిని నివాస్తుంది. స్వచ్చ భారత్‌ ‌కార్యక్రమ ప్రచారానికి గాంధీ చిహ్నాన్ని వాడుకున్న కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ళలో పారిశుద్ద కార్మికుల మురుగునీటి మరణాలు ఐదు రెట్లు పెరగడాన్ని పట్టించుకోకపోవడం శోచనీయం. అదేసమయంలో మనుషులే పనిచేసే పారిశుద్ద వ్యవస్థ ఇంకా ఉనికిలో ఉండడం గాంధీ వాదానికి వ్యతిరేకమని ప్రభుత్వం గుర్తించలేదు. ఇక్కడ నిజానికి గాంధి చిహ్నాన్ని చూసి గందరగోళంలో పడేది మళ్ళీ సదరు పారిశుద్ద కార్మికులే.

jayaprakash ankam
– జయప్రకాశ్‌ అం‌కం,
అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌,
‌చరిత్ర శాఖ, ఎన్జిడిసి, మహాత్మాగాంధీ యూనివర్సిటి

Leave a Reply