Take a fresh look at your lifestyle.

సంతోష చంద్రశాలలు.. తెరచుకునేనా??

“చర్చ ఇప్పుడు విద్యా సంస్థలను తెరవడం పై కొనసాగుతున్నది.తెరిచాకా కరోనా సమూహ వ్యాప్తిని నియంత్రించేలా విద్యాసంస్థల ప్రాంగణాలు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం పై దృష్టి సారిస్తున్నారు.దేశంలో విద్య వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.వాటి అవస్థాపన సౌకర్యాలలో అనేక అంతరాలు ఉన్నాయి.విద్యా సంస్థలు గ్రామీణ ,నగర,ప్రభుత్వ,ప్రవేట్‌,ఏక లింగ,కో ఎడ్యుకేషన్‌ ‌పద్ధతులలో నడుస్తున్నాయి. నవోదయ,కేంద్రీయ, సైనిక బడులు ఇతర ప్రభుత్వ,స్థానిక సంస్థల ద్వారా నడిచే బడుల కంటే మౌలిక సౌకర్యాలలో మెరుగ్గా ఉంటాయి.ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత బడులు తెరచుకుంటే విద్యార్థుల మానసిక స్థితి.అభ్యసన సామర్ధ్యాలు అంచనా వేయడం ఊహించనంత సంక్లిష్టంగా ఉండనుంది.”

విద్య విముక్తికి ,సామాజిక సాధికారతకు, నాణ్యమైన వస్తువులను, ఉత్పత్తి సేవలను అందివ్వడానికి,ఆరోగ్య స్పృహను,వ్యాధి సంక్రమణ,నియంత్రణ, నివారణ అవగాహనకు ప్రధాన చోదకాశక్తిగా పనిచేస్తుంది.విద్య ప్రగతికి ఆయా దేశాల సాంఘిక ఆర్థికాభివృద్ధి కి అవినావభావ సంబంధం ఉందనే సత్యం నిరూపించబడినది. కొరోనా మాహమ్మారి పెద్దలనే కాదు పిల్లల్లో తీవ్ర కలవరం కల్లోలాన్ని కలిగిస్తున్నది.కొవిడ్‌-19 ‌పూర్వ రోజులు రావాలని బలంగా కోరుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు నేర్చుకోవడం,పరీక్షలు రాయడానికి మాత్రమే నిలయాలు కావు.సమ వయస్క సమూహాలతో ఎన్నో ఎన్నో భావనల సంచయనం, సాంఘికరణ నైపుణ్యాలను కలిగిస్తుంది.తమ క్రీడా మైదానాల్లో సీతాకోక చిలుకలు లాగా విహరించి బౌద్ధిక,భౌతిక వికాసానికి తోడ్పడే వేదికగా విద్యా సంస్థలను ప్రముఖ రష్యన్‌ ‌విద్యావేత్త సుహాలోనిస్కి సంతోష చంద్రశాలలుగా పిలిచాడు. .ఈ అనుభూతులను దూరం చేస్తున్న కర్కశ కరోనా త్వరగా ముగియాలని విద్యార్థులు తల్లిదండ్రులు ,విద్యావేత్తలు ఆశిస్తున్నారు. విద్యా సంస్థలను ఎప్పుడు తెరుస్తారో అనే అంశం పై చర్చ లు,అభిప్రాయసేకరణ జరుగుతున్నది. ఇటీవల కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశంలో సగానికి పైగా రాష్ట్రాలు విద్యా సంస్థలను తెరవడం పై స్పష్టతను ఇవ్వలేకపోయాయి.ఆన్లైన్‌ ‌బోధన మంచి చెడులు పై కరోనా కాలం నుండి చర్చ జరుగుతున్నది.అంతిమంగా ఇది సజీవ ప్రత్యక్ష బోధనకు ఎన్నటికీ ప్రత్యమ్నాయంగా ఉండబోదు అని విద్యావేత్తల, మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తల అధ్యయనాలు తేల్చి చెప్పాయి.ఒక అదనపు అభ్యసన సాధనంగా మాత్రమే ఉపకరిస్తుంది. చర్చ ఇప్పుడు విద్యా సంస్థలను తెరవడం పై కొనసాగుతున్నది.తెరిచాకా కరోనా సమూహ వ్యాప్తిని నియంత్రించేలా విద్యాసంస్థల ప్రాంగణాలు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం పై దృష్టి సారిస్తున్నారు.దేశంలో విద్య వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.వాటి అవస్థాపన సౌకర్యాలలో అనేక అంతరాలు ఉన్నాయి.విద్యా సంస్థలు గ్రామీణ ,నగర,ప్రభుత్వ,ప్రవేట్‌,ఏక లింగ,కో ఎడ్యుకేషన్‌ ‌పద్ధతులలో నడుస్తున్నాయి. నవోదయ,కేంద్రీయ, సైనిక బడులు ఇతర ప్రభుత్వ,స్థానిక సంస్థల ద్వారా నడిచే బడుల కంటే మౌలిక సౌకర్యాలలో మెరుగ్గా ఉంటాయి.ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత బడులు తెరచుకుంటే విద్యార్థుల మానసిక స్థితి.అభ్యసన సామర్ధ్యాలు అంచనా వేయడం ఊహించనంత సంక్లిష్టంగా ఉండనుంది.

ప్రఖ్యాత డేవిడ్‌ ఇం‌గ్వార్‌ అనే స్వీడిష్‌ ‌న్యూరో బయాలజిస్ట్ ‌తన మెమెరి ఆఫ్‌ ‌ఫ్యూచర్‌ ‌పరిశోధనా పత్రంలో బోధకులు విద్యా సంస్థలను తెరచినప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఏదుర్కోవడానికి వివిధ రకాల ప్రత్యమ్నాయ విధానాలతో విద్యార్థులకు భోదించడానికి ,కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలి అని పేర్కొన్నాడు.తరగతి గదులలో,ఆట స్థలంలో టాయ్లెట్స్ ‌లో ,ప్రయాణాల్లో పిల్లలు క్రమశిక్షణ,ఆరోగ్య పద్ధతుల అలవాట్లపై నిరంతర పర్యవేక్షణ అవసరం.అలాగే మహమ్మారి కలిగిస్తున్న విలయం వలన ఈ సారి పిల్లల హాజరు శాతం తగ్గి ,డ్రాప్‌ అవుట్స్ ‌పెరిగే అవకాశముంది.వారి ఆరోగ్యం కంటే ఎక్కువగా జీవితాల్లో కల్లోల పరిచే అవకాశముంది.ఈ విపత్తులో కోట్లాది నిరుపేద వలస కార్మికులు చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసే సాంకేతిక పని వారికి ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్నారు.ఆదాయాలు పడిపోయాయి.విద్య పై ఖర్చు పెట్టడానికి వెనుకంజ వేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కుడా రెవెన్యూ రాబడులు తగ్గిపోయి ప్రభుత్వ విద్యా రంగానికి అధిక నిధులు వెచ్చించే జాడలు కానరావడం లేదు.పేద విద్యార్థులకు చదువు అందకుండా కరోనా ఆటంకంగా ఉన్నది.మహమ్మారి తెచ్చిన దుర్భర దారిద్య్రం కారణంగా పాఠశాల ,మాధ్యమిక కళాశాల ఈడు పిల్లలు కుటుంబ పోషణకు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యే అవకాశాలు ఉన్నవి. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశముంది.వాక్సిన్‌ ‌కనుగొనె వరకు విద్యారంగ పరిస్థితి మెరుగుపడే ఛాయలు కనిపించడం లేదు.

బడులు తెరిచిన తర్వాత కొనసాగే భోధనాభ్యసన ప్రక్రియ పై ఎపిసోడిక్‌ ‌జ్ఞాపకశక్తి ప్రభావం ఉండబోతుంది.ఇది ఒక ప్రత్యేక అంశం పట్ల ఏర్పడే జ్ఞాపకాలు.ప్రస్తుతం పిల్లలు కొవిడ్‌ ‌సంక్రమణ,మరణాలు,ఛిద్రమవుతున్న జనజీవనం,వారి నిత్య జీవితంలో వాటి తాలూకు చేదు అనుభవాలతో భీతిల్లిపోతున్న ప్రతికూల భావనలతో ఉన్నారు.ఇది సత్యాలతో, దత్తాంశాలతో నేర్చుకునే సెమాంటిక్‌ ‌జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది.ఇలా అనేక అంశాలు అనూహ్యంగా ఏర్పడి అనేక సవాళ్ళను భోధకుల ముందు ఉండబోతున్నవి.ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఉపాధ్యాయలోకం సర్వ శక్తులను కూడదీసుకుని సంసిద్ధంగా ఉండాలి.కొవిడ్‌-19 ‌మానవ జీవితాలను స్తంభింప చేసి జడత్వానికి గురిచేసింది. ఇప్పటికే అనేకమైన విద్యాపర అసమానతలతో భారతీయ సమాజం చీలి ఉంది.ఈ కొవిడ్‌ ‌దీనిని మరింతగా విస్తరింపచేసే అవకాశం కనిపిస్తున్నది.ఉత్పాదకతతో ,సృజనాత్మకత తో దేశ భవిష్యత్‌ ‌నిర్మాణంలో పాల్గొనే బాల యువ సంపదను తీర్చిదిద్దే రూపకర్తలుగా ఉపాధ్యాయులు మరింత దృఢ సంకల్పంతో పనిచేయాల్సిన చారిత్రక సందర్భంలో ఉన్నాం.పాలకులు రాజ్యాంగం ప్రకారం సంక్షేమ రాజ్య ముఖ్య లక్షణమైన ఉచిత విద్య,వైద్యాలను అందివ్వాలి.విద్య వైద్య పరమైన సవాలక్ష సమస్యలతో కునారిల్లుతున్న నేపథ్యంలో రక్షణ,అంతరిక్ష, అణు ఇతర సివిల్‌ ‌ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు తగ్గించి ప్రజా విద్య,వైద్య వ్యవస్థలను బలోపేతం చేసే పనులకు యుద్ధ ప్రాతిపాదికన పూనుకోవాలి.

అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (ఇంటర్ విద్య)

Leave a Reply