Take a fresh look at your lifestyle.

తెలంగాణకు ఇచ్చేది గోరంత..చెప్పేది కొండంత

  • నిర్మలా సీతారామన్‌ ‌వ్యాఖ్యలు దారుణం
  • ఘాటుగా స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ‌చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం ఆఆయన వి•డియాతో మాట్లాడుతూ..కేంద్రమంత్రి నిర్మలమ్మ మాటల్లో నిజాయితీ లేదన్నారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది గోరంత చెప్పేది కొండంత అంటూ విమర్శించారు. దేశంలో నెలకొన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శాసనసభలో పూర్తి ఆధారాలతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. వాస్తవాలను కుండ బద్ధలు కొట్టినట్లు చెప్తే కేంద్ర మంత్రులను నిద్ర పట్టడం లేదన్నారు. మెడికల్‌ ‌కళాశాల గురించి కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని అన్నారు. కరీంనగర్‌, ‌ఖమ్మంలో మెడికల్‌ ‌కళాశాలలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. వేరే రాష్ట్రాలకు ఒక నీతి తెలంగాణకు ఒక నీతా అంటూ ప్రశ్నించారు. మెడికల్‌ ‌కళాశాలలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్నామన్నారు.

తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌నిర్ణయాలను తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు. జీఎస్టీ నిధుల విషయంలో ఆంధప్రదేశ్‌కు నిధులను ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఆంధ్రకి, తెలంగాణకు ఒక్కో నీతి ఉంటాదా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్‌ 293‌కు లోబడి అప్పులు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తీసుకుని అభివృద్ధి కాదు మిత్తిలు కడుతుందని ఎద్దేవా చేశారు. డెట్‌ ‌టూ జీడీపీలో తాము అప్పులు తగ్గిస్తే వారు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ మాత్రం అప్పులు పెరగడానికి కారణం కేంద్రమే అని ఆరోపించారు.

అప్పులు కట్టడం కాదు తెలంగాణ అభివృద్ధితో సంపద పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్‌లో విభజన హావి•లను గూర్చి చెప్పనే లేదన్నారు. కేంద్రం 48.7 శాతం మిత్తిలు కట్టేందుకు ఖర్చు పెడితే, తెలంగాణ సంపద పెంచేందుకు కృషి చేస్తుందని తెలంగాణ మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం 12 లక్షల కోట్ల రూపాయల బడా బడా కంపెనీల అప్పులను మాపి చేసింది మరి రైతులకు ఎందుకు చేయరని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా పొరపాటు లేదని…నూటికి నూరుశాతం నిజమని స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు అది జరగలేదు కానీ పెట్టుబడి పెరిగిందన్నారు.

కేంద్రం రైతు పక్షపాతి అంటారు కానీ…తాము కల్లాలు నిర్మిస్తే నిధులను తిరిగి ఇవ్వాలని ఎందుకు అన్నారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఆయుష్‌ ‌మాన్‌ ‌భారత్‌ ‌కింద రూ.25 లక్షల మందికి మాత్రమే లబ్ది జరుగుతుందని… కానీ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల 90 వేల మందికి లబ్ది జరుగుతుందని తెలిపారు. తాము అడిగేది ప్రభుత్వ మెడికల్‌ ‌కళాశాల, వి•రు ఇవ్వమని మొండి చేయి చూపిస్తే తెలంగాణ నిధులతో వరంగల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తామని అన్నారు. ఇక వి•కు ఎందుకు వోటు వేయాలో కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌ప్రజలు తేల్చుకుంటారన్నారు. కేంద్ర బ్జడెట్‌లో పేదలకు కోతలు తప్ప మరేవి• లేదని మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు

Leave a Reply