Take a fresh look at your lifestyle.

బాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఏమని చెబుతారో?

  • తిట్టినందుకు మా కార్యాలయాలపై దాడి చేశారని చెబుతారా
  • చంద్రబాబు దీక్షలు.. ఢిల్లీ టూర్‌పై మంత్రుల సెటైర్లు

అమరావతి,అక్టోబర్‌ 23 : ‌టిడిపి అధినేత చంద్రబాబు దీక్షపై మండిపడ్డ మంత్రులు తాజాగా రాష్ట్రపతిని కలసి ఏం చేస్తారని విమర్శించారు. చంద్రబాబుకు యాగీ చేయడం తప్ప మరోటి రాదని ఘాటుగా విమర్శించారు. జగన్‌ ‌ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా బాబు రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. చంద్రబాబు 36 గంటల దొంగ దీక్ష చేశారని అంటూ … అసలు దీక్ష ఎందుకు చేశానా అని టీడీపీ అధ్యక్షుడికే డౌట్‌ ‌వచ్చింది. ఢిల్లీ వెళ్లే టీడీపీ నేతలు రాష్ట్రపతిని ఏమని సంబోధిస్తారని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మాట్లాడారు. పార్టీ ఉందని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబు దీక్ష డ్రామాలు చేస్తున్నారని అర్థమయ్యిందన్నారు.

ఆయన దీక్షలపై డిక్షనరీ రాయాలి. చంద్రబాబు దీక్షపై టీడీపీ నేతలకే క్లారిటీ లేదు. చంద్రబాబు అమిత్‌ ‌షా ద రాళ్లు వేయించారు.. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారన్ని కన్నబాబు ప్రశ్నించారు. సీఎం జగన్‌ని సంభోదించిన పదంతోనే రు రాష్ట్రపతిని సంభోదించగలరా.. లోకేష్‌ ‌కూడా చంద్రబాబును ఆ పదంతో పిలుస్తారా. అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చెబుతారు. మేం బూతులు తిడితే వైఎస్‌ఆర్‌సీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నది రు కాదా అని కన్నబాబు ప్రశ్నించారు. సీఎంని బూతులు తిట్టించే నీచ సంస్క•తి కలిగిన నాయకులు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుగా ఉందని మరోమంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు.

అధికారం కోల్పోయిన నేపథ్యంలో చంద్రబాబుకు ఏమి చేయాలో అర్థంకాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలను నమ్మించడానికి టీడీపీ దీక్షకు పూనుకోవడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబూ… ఇలాంటివి చేసి రాష్ట్ర ప్రజల ఆగ్రహనికి గురికావద్దని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. చంద్రబాబు ముద్దుల కొడుకు లోకేశ్‌కు సరిగా మాట్లాడం రాదు. మాట్లాడితే బూతులు తప్ప ఇంకేమి రావు. దమ్ముంటే పలాస మునిసిపాలిటీలో వార్డు మెంబర్‌గా లోకేశ్‌ ‌పోటీ చేసి గెలవాలి. దానికి కూడా పనికిరాడని అంటూ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన డియాతో మాట్లాడుతూ.. ’చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడా లేక వాళ్ల ఆఫీసు పగల గొట్టారని చెప్పేందుకు వెళ్తున్నాడో అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దేవాలయం అంటున్న చంద్రబాబు.. దేవుడైన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు.

చంద్రబాబు చరిత్ర వింటేనే అసహ్యం వేస్తుందన్నారు. రాష్ట్రంలో పని, పాట లేని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు తిరిగి వస్తాడు. తిరుపతిలో అమిత్‌ ‌షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అమిత్‌ ‌షాను కలుస్తాడో చెప్పాలి. సానుభూతి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడు. తన హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించని చంద్రబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరగగానే సీబీఐ ఎంక్వయిరీ జరపాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి బాలినేని అన్నారు.

Leave a Reply