బాగుందా బాగుందా
భారత దేశ రాజకీయ
భావజాల భవితవ్యం.
మునుపెన్నడూ ఎరుగని
మితిమీరిపోతున్న కుల
మత రాజకీయ విద్వేషాలు.
అధికారం కోసం అలుపెరుగని
ఆరాటము కలవలేని వారితో
కలగలసి కపటపు నీచ రాజకీయం
రాజకీయ రణరంగంలో
రాణించని నాయకులు
ఓట్ల కోసం నోట్లతో
నాటకాలు బూటకము.
బాగుందా బాగుందా
భారత దేశ రాజకీయ
భావజాల భవితవ్యం.
నా కులమే గొప్పదని.
నా మతమే ఒప్పు అని
ప్రజల్లో చిచ్చుపెట్టి రెచ్చగొట్టే
కపట బుద్ధుల కఠినత్వం
సమకాలీన రాజకీయంలో
సమాజంలో రాజీకీయం
అధికారమే ధ్యేయంగా
అవినీతితో అనునిత్యం
బాగుందా బాగుందా
భారత దేశ రాజకీయ
భావజాల భవితవ్యం.
ప్రజల భాధలు పట్టనోళ్ళు
ప్రజల కొరకు పనిచేయనోల్లు
ఎవరిని ఉద్ధరిద్దామని వారు
చేసేదీ రాజకీయ ప్రస్థానం.
ప్రజలకు ఏం చేస్తారో
చెప్పలేని నాయకులు
అబద్దాల హామీలతో
అధికారంలోకి వస్తే అంతా
అవినీతిమయం కాదమరి
బాగుందా బాగుందా
భారత దేశ రాజకీయ
భావజాల భవితవ్యం.
ఎలక్షన్లలో నాయకులమంటు
ఓట్లడగా మీ ముందుకు వస్తే
ఆచితూచి ఆలోచించండి
గమనించండి ప్రజలరా..
భరత దేశ భవితవ్యం
ఓటేసే వారి చేతుల్లోనే ఉందనీ
ఆలోచనలకు పదును పెట్టి
ప్రజల కొరకు పాటుపడే
సరియైన నాయకునికి ఓటిచ్చి
ఓటర్లంటే ఏమిటో నాయకులకు
తెలిసి వచ్చేలా చెయ్యండి
– దాడిశెట్టి శ్యామ్ కుమార్
వరంగల్ జిల్లా , 9492097974