Take a fresh look at your lifestyle.

దిల్లీ వీధుల్లో రైతుల ఆందోళనకు మూలమేమిటి?

పంజాబ్‌, ‌హర్యానా రైతులు దేశ రాజధాని చేరుకోటానికి ప్రయత్నం ఉధృతమైంది. మొదట అడ్డుకున్న మోడీ ప్రభుత్వం మెత్తబడి వారిని అనుమతించింది.. రైతుల ప్రయాణం టియర్‌ ‌గ్యాస్‌..‌ముళ్ల తీగలు..బారికేడ్స్ ఎత్తి పడేయటాలు దశ దాటాయి. ప్రజల్లో భావోద్వేగాలురేపే సంఘటనలు ప్రసార మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. అయితే మాధ్యమాలు అసంపూర్తిగా అందించిన సమాచారంలో ముఖ్యమైన విషయం దాగి వుంది. ప్రజలకు ఆ విషయం స్పష్టంగా అర్ధం అయితే వ్యవసాయం ఒక పరిశ్రమ అని దశానికి స్పష్టం అవుతుంది. కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతు సంఘాలు పంజాబ్‌ ‌లో అక్టోబర్‌ 1‌న ఎన్నుకున్న మార్గం చూద్దం. పంజాబ్‌ ‌లో రైతు సంఘాలు కార్పోరేట్‌ ‌సంస్థలను ‘గెరావ్‌’ ‌చేసి ‘బహిష్కరణ’ పిలుపునిచ్చాయి. ప్రధానికి సన్నిహితులైన ముఖేష్‌ అం‌బానీ, గౌతమ్‌ అదానీల కంపెనీలను రైతు సంఘాలు లక్స్యం చేసాయి. పంజాబ్‌ ‌రైతుల ప్రతిఘటన బడా పరిశ్రమల అధిపతులకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆర్థిక, సామాజిక ఉద్యమం అయింది. రైతుల పిలుపునకు స్పందించి ప్రజలు జియో సిమ్‌ ‌కార్డులను వాడటం ఆపేశారు. రిలయన్స్ ‌షాపింగ్‌ ‌మాల్స్, ‌మొగా, సంగ్రూర్‌ ‌వద్ద అదానీ ప్రాజెక్టులు, గురు గోవింద్‌ ‌సింగ్‌-‌హెచ్పిసిఎల్‌ ‌రిఫైనరీలకు, వాల్మార్ట్, ‌బెస్ట్ ‌ప్రైస్‌ ‌స్టోర్స్, ‌టోల్‌ ‌ప్లాజాలు ఎస్సార్‌ ‌పెట్రోల్‌ ‌పంపులకు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుని పంజాబ్‌ ‌చలించింది.

పంజాబ్‌ ‌లోని 85 రిలయన్స్ ‌పెట్రోల్‌ ‌పంపులలో అమ్మకాలు 50% పడిపోయాయి. భటిండా రిలయన్స్ ‌పెట్రోల్‌ ‌పంప్‌ ‌భాగస్వాములలో ఒకరైన పంకజ్‌ ‌బన్సాల్‌, ‘‘‌భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌పిలుపునకు స్పందించి రైతులు పెట్రోల్‌ ‌పంప్‌ ఎదుట అక్టోబర్‌1 ‌నుండి నిరసన తెలుపుతున్నారని, అమ్మకాలు సున్నాకి చేరి, ఉద్యోగులు పనిలేకుండా కూర్చున్నారన్నారు. రైతులు పెట్రోల్‌ ‌పంపు బహిష్కరించినా, తాము వారికి మద్దతును ప్రకటించామని, రిలయన్స్ ‌డీలర్లు, ఉద్యోగులు మద్దతును తెలుపుతూ తమను లక్ష్యంగా చేసుకోవద్దని, పెట్రోల్‌ ‌పంప్‌ ఆగిపోతే జీతాలు రాక బతుకులు గడవవని వేడుకుంటున్నారు. మోగా ప్రాంతంలో గోధుమ నిల్వ చేసే గౌతమ్‌ అదానీ ప్రాజెక్ట్పా సహా ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా కూడా నిరసనకు గురైంది. మోగా ప్లాంట్‌ ‌గోడలపై, రైతులు ‘గో బ్యాక్‌ అదానీ’ అనే నినాదాలు రాశారు.

ఆహార ధాన్యాల నిల్వ కోసం పంజాబ్లో నిర్మిస్తున్న31 గోదాములు అదానీకి అనుకూలించేవి కాబట్టి పంజాబ్‌ ‌రైతులు ‘గో బ్యాక్‌ అదానీ’ అని నినదిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంతే, పంజాబ్‌ ‌శ్రామిక ప్రజలు వలసలు పెరిగి బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఉత్తర ప్రదేశ్‌, ‌బీహార్‌ ‌నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు పొలాల్లో పనికి పంజాబ్‌ ‌చేరుకుంటారు. అందువల్ల పంజాబ్‌ ‌స్థానిక వ్యవసాయ కార్మికులు శ్రమను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. మరి తామె క్కడికి వెళ్ళాలన్నది సగటు శ్రామికుడి ప్రశ్న. ‘ఈ మూడు వ్యవసాయ చట్టాలు మాత్రమే కాకుండా భవిష్యత్‌ ‌లో మోడీ ప్రభుత్వం ‘విద్యుత్‌ ‌సవరణ బిల్లు 2020’ తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ద్దనితో తమ ఉనికి ప్రమాదంలో వుందని, పరిస్థితి చావో రేవో తేల్చుకునే పరిస్థితి అని వ్యవసాయ సంఘాలు హుంకరిస్తున్నాయి.

పంజాబ్‌ ‌రైతులకు పెద్ద మడులున్నాయి. నెలకు ఆదాయం పద్నాలుగు వేలు వరకు ఉంటుంది. తమ పెద్ద మడులలో గోధుమ, వరి పండించి, ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దత్తు లాభాన్ని రైతులు పొందుతున్నారు. రైతు ఆస్తిని ఇకపై బడా కంపెనీల గల్లా పెట్టెలలో వేయాలి అని మోదీ ప్రభుత్వ ఆలోచన. పంజాబ్‌ ‌రైతులు ఇది పసిగట్టి తమ మిగులులో కొంత ఖర్చుబెట్టి, ఆరునెల రేషన్‌ ‌తీసుకుని ఢిల్లీకి పోరాటం కోసం సిద్ధమాయ్యారు. ఈ పరిస్థితిని పంజాబ్‌ ‌రైతులు, చావో రేవో తేల్చుకునే పోరాటం తమదని చెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏమి వాదిస్తున్నదంటే ‘‘ఒక్క పంజాబ్‌ ‌రైతులు మాత్రమే ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు మిగతా వారు రైతులు కదా’’ అని. ఇతర రాష్ట్రల రైతులు ఎందుకు పోరాటంలో లేరు అని ప్రభుత్వం అడుగుతున్నది. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ‌మహారాష్ట్ర రైతుల మడులు చిన్నవి కాబట్టి ఆరు నెల రేషన్‌ ‌చేతిలో పెట్టుకుని ఢిల్లీకి రాగలిగిన ఆర్ధిక స్థితి లేదు.

Leave a Reply