Take a fresh look at your lifestyle.

పంటల బీమా ఐచ్ఛికం దేనికి సంకేతం?

“బీమాను ఐచ్ఛికం చేస్తూ కేంద్రం  నిర్ణ యం తీసుకో వడంవల్ల జమ్ముకాశ్మీర్‌ ‌రైతులు ఉపసంహరిం చుకున్నారు. బీమా కంపెనీలు తమ పుస్తకాల్లో 20శాతం ప్రీమియంను మాత్రమే ఉంచారు. తమ పంటలను బీమా చేసే రైతుల సంఖ్య బాగా తగ్గిపోయిం దేమో నని బీమా కంపెనీలు అంచనా వేశాయి. పం టల బీమా ప్రీమియంను కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వా లు సమానంగా పంచుకోవల్సి ఉంటుంది.”

What is the sign of the crop insurance option

పంటల బీమాను రైతులకు ఐచ్ఛికం చేయడం వల్ల ఈ పథకానికి కేంద్రం ముగింపు పలకాలనుకుంటోందా ? పంటల బీమా రుణాలు తీసుకున్న రైతులకు తప్పనిసరి చేసి, బీమా కంపెనీలతో ఆకర్షణీయమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేట్టు చేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందా ? లేకపోతే ఈ వ్యాపకం ఇప్పటికీ లాయికీగా ఉంటుందా ? ప్రధానమంత్రి ఫసల్‌ ‌బీమా యోజనలో కేంద్రం మార్పులు చేసింది. ఈనెల 19వ తేదీన జరిగిన కేబినెట్‌ ‌సమావేశంలో ఈ మార్పులు చేసిన పథకాన్ని ఆమోదించారు. ప్రధానమంత్రి ఫసల్‌ ‌బీమా యోజన, పునర్మితమైన వాతావరణ ప్రాతిపదిక పంటల బీమా పథకంగా విభజించారు. మొదటిది పంట తప్పనిసరిగా లభించేదానిని బట్టి బీమాను వర్తింపజేయడం,రెండోది వాతావరణ పరిస్థితులను బట్టి చేతికందే పంటకు బీమా వర్తింపజేయడం.ఈ రెండు పథకాలను 2016లో కేంద్రం ప్రారంభించింది.ఈ పథకం మార్గదర్శకాల్లో 2018లో ప్రధానమైన మార్పులు చేశారు. ఈ మార్పులు చేసిన పథకాన్ని రైతులు విమర్శించారు. రుణగ్రహీతలకు తగిన విధంగా పరిహారం లభించడంలేదని విమర్శించారు. దీంతో కేంద్రం పథకాన్ని రైతుల ఐచ్ఛికతకు వదిలి వేసింది. కనుక బ్యాంకుల నుంచి అందే రుణాలు,ఇతర సాయాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో కొనసాగాలా లేదా అనేది రైతులు నిర్ణయించుకుంటారు. ఈ పథకంలో అనేక సానుకూల మార్పులు కూడా చేశారు. ఇవి రైతులను ఎంతవరకూ ఆకర్షిస్తాయో దానిని బట్టి పథకం భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

రుణాలు తీసుకున్న రైతులకు పంటలబీమా తప్పనిసరి చేయకూడదని రైతులు చాలాకాల ంగా  డిమాండ్‌ ‌చేస్తున్నారు.  తమ వేలాలను ప్రీమియం రేట్లకు పాడు కునేందుకు వీలవుతుందని వారు భావిస్తున్నారు.  ఎంతమంది రైతు లు ఈ పథకాన్ని ఇష్టపడుతున్నారో కంపెనీలు నిర్ధారణ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటాయి. ఈ వ్యాపారంలో కొనసాగదలిస్తే రైతులను ఆకర్షించేలా వారికి నచ్చజెప్పి వారిని ఈ పథకంలో భాగస్వాము లుగా చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అసలు ప్రభావం త్వరలోనే తెలుస్తుంది.గడిచిన నాలుగేండ్లలో అంటే 2016లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత  రుణాలు తీసుకోని రైతుల సంఖ్య వివిధ రాష్ట్రాల్లో పెరిగి ంది.రుణాలు తీసుకోని రైతుల సంఖ్య 2018-19లో పెరిగింది 2.11 కోట్ల మంది రుణాలు తీసుకోని రైతులు బీమా చేశారు.రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య ఇదే కాలంలో 3.50 కోట్లకు పెరిగి ంది.రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం ఎక్కువగా వర్తించబడింది.రుణాలు తీసుకోని 2.11కోట్ల మంది రైతుల్లో 1.29కోట్ల మంది మహారాష్ట్రకు చెందిన వారే.

పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్‌ ‌తదితర రాష్ట్రాలకు చెందిన వారు  మిగతావారు.చాలా రాష్ట్రాల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఇది వర్తింపజేశారు.ఏయే పంటలకు బీమా అవసరమో రాష్ట్రాల నోటిఫై చేశాయి.ముఖ్యంగా చెరకు వంటి పంటలను ఈ జాబితాలో పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌, ‌హర్యానా, జమ్ము,కాశ్మీర్‌లలో  బీమా కంపెనీలను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలిచారు. బీమాను ఐచ్ఛికం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల జమ్ముకాశ్మీర్‌ ‌రైతులు ఉపసంహరించుకున్నారు. బీమా కంపెనీలు తమ పుస్తకాల్లో 20శాతం ప్రీమియంను మాత్ర మే  ఉంచారు. తమ పంటలను బీమా చేసే రైతుల సంఖ్య బాగా తగ్గిపోయిందేమోనని బీమా కంపెనీలు అంచ నా వేశాయి.పంటల బీమా ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకోవల్సి ఉంటుంది. పంట ల బీమాకు వెళ్ళాలా వద్దా అనేది రైతులను సంప్రది ంచి రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. వ్యవసాయం, పండ్లతోటల పెంపకంలో ఏటా వేసే పంటలకు రైతులకు ఎకరానికి 6,800 రూపాయలను ఇరిగేట్‌ ‌చేయని ప్రాంతాల్లో చెల్లి స్తారు. ఇరిగేట్‌ ‌చేసే ప్రాంతాల్లో ఎకరానికి 13,500 రూపాయలు చెల్లిస్తారు.గుజరాత్‌లో 39వేల వరకూ ఆముదం తదితర పంటలకు చెల్లిస్తారు.  కనుక పంటల బీమా రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ఉంటుంది. అయితే భారాన్ని తగ్గించుకునేందుకు దీనిని వదిలించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
‘ద వైర్‌’ ‌సౌజన్యంతో

 

Leave a Reply