Take a fresh look at your lifestyle.

పేదరిక నిర్మూలనలో రాజకీయపాత్ర ఏంటి ?

74ఏళ్ళ స్వాతంత్య్ర భారతదేశంలో మన పాలకులు సాధించిన ప్రగతి ఎంతవరకు పేదరిక నిర్మూలనకు దోహదబడిందో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.ఎన్ని ప్రభుత్వాలు మారిన, ఏండ్లకు ఏళ్ళు గడిచిన,ఎన్నిరకాల పథకాలను ప్రవేశపెట్టిన పేదరికాన్నీ నిర్మూలించలేకపోవడాన్నికి గల కారణాలేంటి?

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ ‌వారు దాదాపు 200సంవత్సరాలకుపైగా పాలించి ఇక్కడున్న సహజవనరులను, విలువైన సంపదలను అక్కడికి తరలించారని చరిత్ర చెబుతున్నది.అలాగే భారతీయులకు ఎలాంటి ఉపయోగంలేని చట్టాలనుచేసి అమలుపరచడం, ఇక్కడి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసేటటువంటి పాలనగావించి నందుకే 1857సిపాయిల తిరుగుబాటు, 1885-1947 స్వాతంత్య్ర సంగ్రామాన్ని చేసి ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలితంగా స్వాతంత్య్రాన్ని పొందడం జరిగింది.

 

స్వాతంత్య్రం వచ్చాక విద్య,వైద్య, వ్యవసాయం, పారిశ్రామిక,శాస్త్ర,సాంకేతికరంగాలలో పలుమార్పులు వచ్చిన కూడా అభివృద్ధిని సాధించలేక పోతున్నామంటే అసలు కారణం ఏమిటో ఆలోచించాల్సిన అవసరం లేదా?దేశంలో నాడు 55 శాతమున్న వ్యవసాయదారులు నేడు ఎంత శాతానికి పరిమితమయ్యారు.భూమిలేని రైతులు అలానే ఉంటే, చిన్న,సన్నకారు రైతులు సైతం అప్పులపాలై కొందరు,ఎలాంటి నీటి వసతి లేకపోవడంతో వారి భూములను అమ్ముకోవడం,నగరాలకు వలసలు వెళ్లడం జరుగుతున్నది.

పట్టణాలకు, నగరాలనుండి వెళ్లే రహదారుల ప్రక్కనవున్నా భూములను ధనవంతులు,రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులు అధిక ధర చెల్లించి తీసుకోని చుట్టూర కంచె వేయడం, అందులో వివిధ పండ్ల తోటలు పెంచడం,ఇక్కడ ఇంకా దురదృష్ట్యకరమైన విషయమేమిటంటే ఆ పొలంలోనే అమ్మిన వ్యక్తి జీతానికి కుదరడం,ఎక్కడైనా అన్ని నగరాల నుండి వెళ్లే రహదారుల ప్రక్కబోటి వుండే భూములు ఏనాడూ  వ్యవసాయం చేయని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి.ఓనాడు విలువలేని చిరుధాన్యాల పంటలు,వ్యవసాయరైతులు పండించడం ఆపాక,పెద్దపెద్ద భవంతులలో,చల్లని గదులు ఏర్పాటుచేసి,మనిషికి కావాల్సిన అన్నింటిని ఒకే చోట దొరికే విధంగా మార్టులను నడుపుతూ అందులో చిరుధాన్యాలను అమ్మడం,ఎక్కువ ధర చెల్లించి తీసుకుంటూ, అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది.ఇక్కడ గమనించాల్సిన విషయేమిటంటే ఇలాంటి షాపింగ్‌ ‌మాల్‌ ‌లను నడిపే యాజమాన్యమే,వ్యవసాయదారుల నుండి భూమిని కొనుగోలుచేసి వారితోనే కూలీకి పనులు చేయించుకుంటూ తమకు కావాల్సిన పంటలను పండించుకుంటూ కార్పొరేటు వ్యవసాయం చేస్తున్నారు.ఆనాడు బ్రిటీషువారు దోచుకున్నారు, నేడు వారి స్థానంలో రాజకీయ నాయకులు, కార్పొరేటు వ్యవస్థ ఉండటం గమన్హారం.నేటి కార్పొరేట్‌ ‌వ్యవస్థలు ప్రభుత్వాలను సైతం శాసించే స్థాయికి ఎదుగుతున్నాయంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.

 

స్వాతంత్య్రం లభించాక అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేశారు.పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి,ఒక్కొక్కసారి ఒక్క రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉండటం జరిగింది.కానీ అభివృద్ధి మాత్రం అనుకున్నంత మేరలో జరగలేదని చెప్పవచ్చు,నేడు వాటి స్థానంలో నీతి ఆయోగ్‌ అభివృద్ధికి బాటలువేయడానికి ప్రయత్నం చేస్తుంది.కానీ అభివృద్ధి ఎంత సాధించిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. విద్యాహక్కు చట్టాన్నితెచ్చి అక్షరాస్యతలో అభివృద్ధి సాధిస్తున్నారు.కానీ నిరుద్యోగులను కూడా అంతే మేరలో పెంచుతున్నారు. వలసలను అరికట్టడానికి గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి,గ్రామాల్లో ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న,శాశ్వత వలసలను ఆపలేకపోతున్నారు.అవినీతిని అరికట్టడానికి సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిన,ఇప్పటికి గ్రామస్థాయిలో దాని గురించి తెలియక పోవడం బాధాకరం,అవినీతి అడ్డుకోలేకపోతున్నారు..

 

ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అనుభవం కలిగిన నాయకుల్ని ఎన్నుకున్న కూడా, వారి శాశ్విత పాలనకై తాత్కాలిక వాగ్దానాలు తప్పా,శాశ్వత పరిష్కారం ఎక్కడా కనిపించడం లేదు. గత ఇరవై సంవత్సరాల నుండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనుగడలో ఉన్నది.కానీ ఎన్నడూ అభివృద్ధి చెందిన దేశంగా నామకరణం చేసుకుంటుందో తెలియని పరిస్థితి. నేటి రాజకీయాలు మాములు మనుషులకు అర్ధంకావడం లేదు.నేటి రాజకీయ నాయకులు ప్రాంతం,దేశాభివృద్ధి కంటే కూడా తాము ఎలా అధికారంలోకి రావాలి ?ఎలాంటి వాగ్దానాలు చేయాలి ? ఎలా వోటర్లను ఆకర్షించాలి ?ఎలా పాలక పగ్గాలు చేపట్టాలి ? ఎన్నికయ్యిన నాటినుండే మరో ఐదేళ్లకు వచ్చేఎన్నికలకు ఎలా వనరులను సమకూర్చు కోవాలని ఆలోచిస్తున్నారే తప్పా అభివృద్ధికై పాటుపడే నాయకులు కరువైనారనడంలో ఎలాంటి అవాస్తవంలేదు.

 

ప్రత్యేకంగా దేశంలో నేడు నిరుద్యోగం  విజయ తాండవం చేస్తుంటే,వ్యవసాయదారులను పట్టించుకునే నాధుడే కరువైయ్యారు,కార్పోరేట్‌ ‌వ్యవస్థ కోరలు తెరుచుకోని మనుగడ సాగిస్తూ,పాలకులనే శాసించేస్థాయికి ఎదుగుతుంది. అంతా వ్యాపారమై ధనార్జునకై పాటుపడుతున్నారు కానీ,ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడానికి ప్రయత్నం చేసేవారు కరువై తున్నారు.అలాగే చేస్తున్నట్లు ప్రకటనలకు మాత్రమే పరిమిత మవుతున్నారు.దేశంలో ఉపాధి వనరులు కల్పించినప్పుడే అభివృద్ధికి బాటలు ఏర్పడుతాయి. నిరుద్యోగిత నిర్మూలనకు పాటుపడాలి. వ్యవసాయాన్ని అభివృద్ధిచేస్తూ వలసలను శాశ్వితంగా నిలిపివేయడానికి ప్రయత్నించాలి. కార్పొరేటు వ్యవస్థపై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాజకీయాన్ని రాజకీయం కోసం కాకుండా ప్రజల క్షేమాన్ని , సంక్షేమాన్ని గావించే విధంగా ఉండాలి.ఇప్పటికైనా పాలకులు దేశ అభివృద్ధి కి  పాటుపడుతూ దేశాన్ని త్వరగా అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి ప్రయత్నం చేయాలనీ ఆశిద్దాం

   – డా.పోలం సైదులు, డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ,9441930361.

Leave a Reply