Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట జిల్లాను వణికిస్తున్న కొరోనా వైరస్‌?

  • నమూనాలిచ్చిన ప్రజాప్రతినిధులు?
  • భయం గుప్పిట్లో గ్రామాలు, సిద్ధిపేట పట్టణం

దుబ్బాక మునిసిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో కొరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యులు, పోలీసులు, మునిసిపల్‌ అధికారులు కొరోనా వైరస్‌ ‌సిద్ధిపేట జిల్లా ప్రజలను వణికిస్తోంది. గత నెల వరకు సిద్ధిపేట జిల్లా కొరోనా వైరస్‌ ‌ఫ్రీ జిల్లాగా నమోదైంది. గత వారం పది రోజులుగా జిల్లాలోని దుబ్బాక మునిసిపల్‌ ‌పరిధిలోని లచ్చపేట,  వర్గల్‌ ‌మండలంలోని గౌరారం, సిద్ధిపేట పట్టణం, తొగుట మండలంలోని గుడికందుల, వెంకట్రావుపేట, మిరుదొడ్డి మండలంలోని జంగపల్లి, సిద్ధిపేట నియోజకవర్గంలోని రాఘవాపూర్‌, ‌మిట్టపల్లి గ్రామాలలో  కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన పలువురికి కొరోనా వైరస్‌  ‌పాజిటివ్‌గా రావడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిద్ధిపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కొరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా… సదరు వ్యక్తితో కలిసి తిరిగిన పట్టణానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన సిబ్బంది సైతం సిద్ధిపేటలో శుక్రవారం పరీక్షలు చేయించుకున్నట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి తెలిపాయి. సిద్ధిపేట పట్టణంలో నిన్న(గురువారం) ఒకే రోజు రెండు పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడంతో…ముందస్తుగా ఆసుపత్రికి వెళ్లి ప్రజాప్రతినిధులు పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం.

నమూనాలను సేకరించిన వైద్యాధి కారులు ప్రజాప్రతినిధుల నమూనాలను హైదరా బాద్‌కు పంపినట్లు సమాచారం. మరి కొందరు ప్రజా ప్రతినిధులు వైద్య పరీక్షల నిమిత్తం  హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. రోజు రోజుకూ కొరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతుండటంతో  జిల్లా అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆయా గ్రామాలలో శానిటైజేషన్‌ ‌చేయడం, సదరు వ్యక్తులను కలిసిన వారి వివరాలను సేకరించి వారిని, కుటుంబీకులను హోంక్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, వర్గల్‌ ‌మండలంలోని గౌరారంకు చెందిన వ్యక్తికి కొరోనా పాజిటివ్‌ అని తేలడంతో అధికార యంత్రాంగం, అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. కొరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తి అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన నేత కావడంతో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారందరూ భయబ్రాంతులకు గురవుతున్నారు. పాజిటివ్‌ ‌వచ్చిన నేత ఎవరెవరిని కలిశాడనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.  గౌరారంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, డాక్టర్‌ ‌కాశీనాథ్‌, ‌డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో శ్రీదేవి ఆధ్వర్యంలో 15 బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేస్తున్నారు.  నంగునూరు మండలానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని హోంక్వారంటైన్‌లో ఉండాలని పోలీసులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. కొండపాక మండలంలోని వివిధ గ్రామాలకు ఇతర ప్రాంతాల వచ్చిన ఏడుగురికి వైద్య పరీక్షలు నిర్వహించి హోంక్వారంటైన్‌ ఉం‌డాలని వైద్యాధికారులు సూచించారు. ఇదిలా ఉంటే, దుబ్బాక మునిసిపల్‌ ‌పరిధిలోని లచ్చపేటలోనూ కొరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసు నమోదు నిర్దారణ కావడంతో మునిసిపల్‌ అధికారులు, పోలీసు, వైద్యాధికారులు, వార్డు కౌన్సిలర్లు కలిసి ఇంటింటా తిరుగుతూ కొరోనా వ్యాధిపై జాగ్రత్తలు, నివారణ గురించి అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా…సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామారెడ్డి సెల్ప్ ‌క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవలి కాలంలో కొండపోచమ్మ సాగర్‌ ‌ముంపు గ్రామాలకు చెందిన ప్రజలు గౌరారంలో కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇండ్ల నిర్మాణానికి పంచాయతీ ద్వారా హెచ్‌ఎం‌డిఏ  అనుమతి పొందే విషయమై ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు  కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసినట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల వెంట వచ్చిన ఓ వ్యక్తికి కొరోనా పాజిటివ్‌ ‌రావడంతో హైదరాబాద్‌లో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్ల సమాచారం. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ‌వెంకట్రామారెడ్డి సెల్ఫ్ ‌క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా సిద్ధిపేట జిల్లాలో కొరోనా కలకలం రేపుతోంది.

Leave a Reply