Take a fresh look at your lifestyle.

‘‘మద్దతు ధర పెంపుతో రైతు రాజు అయ్యేనా??’’

“పశుపక్ష్యాదులు, జంతు జాలాలకే కాదు మానవ మనుగడకు కూడా ఆహారం ముఖ్యం. కాని మానవుని ఆహారం అవసరం వేరు. మనిషి ఆహారం సృష్టికి స్వేదం చిందించి, రక్తం ధారపోసి ఆరుగాలం శ్రమించి భూమి పొత్తిళ్ల నుండి పండించాలి. ఇందుకు మూలకారకుడైన రైతుకు , వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి కాపాడుకోవాల్సిన అవసరాన్ని విస్మరించి పాలకులు రైతులకు ఉరి తాళ్లతో మరణశాసనం లిఖించడం సమంజసమా అనే విషయం ఆలోచించాలి … ప్రకృతి వైపరీత్యాలకు విలవిలలాడుతూ, పాలకుల నిర్లక్ష్యానికి బలవుతూ, కల్తీ పురుగుమందులు, నకిలీ విత్తనాలతో మోసపోతూ, అధిక వడ్డీ రేట్లతో పెట్టుబడి పెట్టలేక నడ్డి విరుగుతూ, పండిన పంటను అమ్ముకోలేక, గిట్టుబాటు ధర రాక, కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి పడిగాపులు కాస్తూ…. ఎన్నేళ్ళీ కష్టాలు.”

పశుపక్ష్యాదులు, జంతు జాలాలకే కాదు మానవ మనుగడకు కూడా ఆహారం ముఖ్యం. కాని మానవుని ఆహారం అవసరం వేరు. మనిషి ఆహారం సృష్టికి స్వేదం చిందించి, రక్తం ధారపోసి ఆరుగాలం శ్రమించి భూమి పొత్తిళ్ల నుండి పండించాలి. ఇందుకు మూలకారకుడైన రైతుకు , వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి కాపాడుకోవాల్సిన అవసరాన్ని విస్మరించి పాలకులు రైతులకు ఉరి తాళ్లతో మరణశాసనం లిఖించడం సమంజసమా అనే విషయం ఆలోచించాలి … ప్రకృతి వైపరీత్యాలకు విలవిలలాడుతూ, పాలకుల నిర్లక్ష్యానికి బలవుతూ, కల్తీ పురుగుమందులు, నకిలీ విత్తనాలతో మోసపోతూ, అధిక వడ్డీ రేట్లతో పెట్టుబడి పెట్టలేక నడ్డి విరుగుతూ, పండిన పంటను అమ్ముకోలేక, గిట్టుబాటు ధర రాక, కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి పడిగాపులు కాస్తూ…. ఎన్నేళ్ళీ కష్టాలు. అప్పుల బాధలు తాళలేక రైతులు ఆత్మహత్యలకుపాల్పడడం సమాజ ప్రగతికి నిరోధం, బాధాకరం కూడా. రైతుల సంక్షేమమే లక్ష్యమని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానాలు చేసిన పాలకులు రైతుల జీవితాలకే ఎసరు పెట్టే విధానాలను, కొరోనా విశ్వరూప సమయంలో చట్టాలు చేయడం విచారకరం. నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసి, రైతులకు ప్రయోజనం కలిగించే కనీస మద్దతు ధర హామీ చట్టం లాంటివి తీసుకు రావాలని ఉద్యమిృచి నిరసనలు తెలియజేస్తుంటే, నిర్లక్ష్య వైఖరి అవలంబించడం అభ్యంతరకరం. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో 11 సార్లు చర్చలు జరిపి, సాగు చట్టాలను సంవత్సరం న్నర వాయిదా వేస్తామని, కనీస మద్దతు ధరకు రాతపూర్వక హామీ ఇచ్చేది లేదని, పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలు అమలు చేస్తామని చెపిపడం అభ్యంతరకరం. ఖరీఫ్‌ ‌పంటలకు నామమాత్రంగా కనీస మద్దతు ధర పెంచుతూ కంటి తుడుపు చర్యలు చేపట్టడం ఆశ్చర్యకరం….

2021 -22 సంవత్సర పంట కాలానికి 14 ఖరీఫ్‌ ‌పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వరి క్వింటాళ్లకు కనీస మద్దతు ధరను 72 రూపాయలుగా పెంచారు. దీంతో వరి సాధారణ రకం ధర 1868 రూపాయల నుంచి 1940 కి పెరిగింది. ఏ గ్రేడ్‌ ‌రకం ధర 1888 నుంచి 1960 కి చేరింది. వాణిజ్య పత్తి కనీస మద్దతు ధర మీడియం స్టేపుల్‌ ‌క్వింటాలుకు రూ 211 పెంచడంతో ధర రు.5,726కి చేరింది, లాంగ్‌ ‌స్టేపుల్‌ ‌పత్తి కింటా ధర 200 రూపాయలు పెంచడంతో ధర 6025కు చేరింది. జొన్నలు హైబ్రిడ్‌ ‌రకానికి , మల్‌ ‌దండి రకానికి 118రూపాయలు, సజ్జలకు 100 రూపాయలు, రాగుల కు 82 రూపాయలు, మొక్కజొన్న కు 20రూపాయలు ,క0దులకు, మినుముల కు 300 రూపాయలు, పెసలకు 79 రూపాయలు , వేరుశెనగ కు రెండు వందల డబ్భై ఐదు రూపాయలు, పొద్దు తిరుగుడు కు 130 రూపాయలు, సోయాబీన్‌ ‌కు 70 రూపాయలు, అత్యధికంగా నువ్వుల కు నాలుగు వందల యాభై రెండు రూపాయల చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు, కానీ కనీస మద్దతు ధరను శాస్త్రీయంగా లెక్కించినట్లు కనబడటం లేదు.

కనీస మద్దతు ధర ఏమిటి?

ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ ‌లో తమ సంస్థల జోక్యంతో ఆహార ధాన్యాలను ఇతర పంటలను కొనుగోలు చేసే ధరను కనీస మద్దతు ధర అంటారు. ఇది గిట్టుబాటు ధర కాదు. ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే విధంగా చెల్లించే ధర. వినియోగ దారునికి ఆహార భద్రత,, రైతుకు ఆదాయ భద్రత కల్పించేదే కనీస మద్దతు ధర… కనీస మద్దతు ధరలను నిర్ణయించడానికి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త చైర్మెన్‌ ‌గా కేంద్ర నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల సాగు వివరాలు తెలుసుకొని,సాగు దారుల నుంచి క్షేత్రస్థాయి అంశాలను సేకరించి పంటల వారీగా కనీస మద్దతు ధరను సిఫారసు చేస్తుంది. దానననే ఆధారంగా కేంద్ర కేబినెట్‌ ‌కమిటీ ఆన్‌ ఎకనామిక్‌ ఆఫైర్‌ ‌నిర్ణయం తీసుకుంటుంది. ఈకమిటీ ఉత్పత్తి వ్యయం, డిమాండ్‌ ‌సప్లై, మార్కెట్‌ ‌పై ధరల ప్రభావం, అంతర్జాతీయ ధరల పరిస్థితి వంటి 11 అంశాలను తీసుకొని తుది నిర్ణయం చేస్తారు. మొదటగా పంటల సాగు వ్యయాన్ని పరిగణన లోకి తీసుకుంటారు. అన్ని రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించి కమిటీ ఓ నిర్ణయానికి వస్తుంది, పెట్టిన పెట్టుబడికి వడ్డీ కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తారు. దీనికి 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని 2007లో వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్‌ ‌సిఫార్సు చేసినా దానిని ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.

అమలవుతున్న సందర్భమూ లేదు. అవుతుంది. రైతుల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమ మని స్వామినాథన్‌ ‌సిఫార్సు లను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి హామీని నిలబెట్టుకో కుండా రైతులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న వైనం కనిపిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరి ,పత్తి పంటలకు మద్దతు ధరలు ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేవు. గత ఆరు సంవత్సరాల నుండి ధాన్యం మద్దతు ధర కేవలం 510 నుండి 530 రూపాయల వరకు పెరిగింది. పెరుగుదలలో పెద్ద మార్పేమీ లేదు. రాష్ట్రప్రభుత్వం వరి సాగు వ్యయాన్ని 438202 రూపాయలుగా గుర్తించగా, కేంద్ర ప్రభుత్వం కేవలం1293 రూపాయలుగా గుర్తించింది, మొక్కజొన్న సాగు వ్యయాన్ని 22744 గా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించగా, కేంద్ర ప్రభుత్వం 1246 రూపాయలుగా రాష్ట్రప్రభుత్వం గుర్తించగా, కేంద్రం 3886 గా, పత్తి సాగు ఖర్చు 35,788 రూపాయలుగా గుర్తించగా 35817 రూపాయలుగాగ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అతి తక్కువగా సాగువ్యయాన్ని గుర్తించి కనీస మద్దతు ధరను నిర్ణయించడం బాధాకరం. మూడు సాగు చట్టాలను తక్షణమే రద్దుచేసి, నాణ్యమైన విత్తనాలన అందించి, కౌలు రైతులను , మహిళా రైతులను గుర్తించి, రైతుబంధు పంట రుణాలను అందించి, భూ సంస్కరణలను అమలు పరిచి, జయంతి ఘోష్‌, ‌స్వామినాథన్‌ ‌సూచనలను అమలు చేస్తూ.. అన్నదాతకు వెన్నుదన్నుగా ఉండాలి .

thanda sadhanandham
తండా సదానందం, జిల్లా
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్‌. ‌మహబఃబాద్‌ ‌జిల్లా. 9989584665

 

Leave a Reply