Take a fresh look at your lifestyle.

జీ 7 విస్తరణ ఆదర్శమా? అవకాశవాదమా?

ఇటీవల జరిగిన జీ 7 దేశాల సమావేశం జీ 7  కూటమిని, డి10 (పది ప్రజాస్వామ్య దేశాల) కూటమిగా మార్చాలని  భారత్‌, ఆ‌స్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా దేశాలను ఆహ్వానించడం శుభపరిణామం.జీ 7 దేశాల కూటమి ఏర్పాటునాటికి, నేటికీ ప్రపంచ భౌగోళిక కేంద్రీకరణ ప్రాధాన్యత పరిస్థితులు మారుతున్న సందర్భంగా కానీ, రాజకీయంగా, ఆర్థికంగా జీ 7 దేశాల ప్రాధాన్యత తగ్గుతున్న సందర్భంగా కానీ, ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంత ప్రాధాన్యత పెరుగుతున్న సందర్భంగా కానీ జీ 7 దేశాల కూటమి, డి10 దేశాల కూటమిగా మారాలనుకోవడం జీ 7 కి  అవసరం అయి ఉండవచ్చు, కానీ మనకు ఒక మంచి అవకాశమే.

ఇటీవల జరిగిన జీ 7 దేశాల సమావేశం జీ 7  కూటమిని, డి10 (పది ప్రజాస్వామ్య దేశాల) కూటమిగా మార్చాలని  భారత్‌, ఆ‌స్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా దేశాలను ఆహ్వానించడం శుభపరిణామం.

జీ 7 దేశాల కూటమి ఏర్పాటునాటికి, నేటికీ ప్రపంచ భౌగోళిక కేంద్రీకరణ ప్రాధాన్యత పరిస్థితులు మారుతున్న సందర్భంగా కానీ, రాజకీయంగా, ఆర్థికంగా జీ 7 దేశాల ప్రాధాన్యత తగ్గుతున్న సందర్భంగా కానీ, ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంత ప్రాధాన్యత పెరుగుతున్న సందర్భంగా కానీ జీ 7 దేశాల కూటమి, డి10 దేశాల కూటమిగా మారాలనుకోవడం జీ 7 కి  అవసరం అయి ఉండవచ్చు, కానీ మనకు ఒక మంచి అవకాశమే.

ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంపై ఆధిపత్యం కోసమే అమెరికా క్వాడ్‌ ‌ను ఏర్పాటు చేసినప్పటికీ  భారతదేశం క్వాడ్‌ ‌లో భాగస్వామై చైనా, పాక్‌ ‌కు  గట్టి హెచ్చరికలు పంపగలిగింది.

భారత్‌ ‌దేశం ఒకపక్క చైనా సామ్రాజ్యవాద కాంక్షను, మరొక ప్రక్క పాక్‌ ఉ‌గ్రవాద చర్యలను ఎదుర్కొంటు ద్విముఖ పోరు చేస్తున్న సందర్భంలో రైస్‌ ఆఫ్‌ ‌చైనా కు వ్యతిరేకమే ఎజెండా జీ 7 ముందుకు పోతూ డి 10 గా మారాలనుకోవడం, అందులో భారతదేశం భాగాస్వామి కావాలనుకోవడం ఒక్కింత ఆసియా ఖండంలో పరోక్షంగా శాంతికి అవకాశం ఉండొచ్చు.

బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ అనే లక్ష కోట్ల డాలర్ల ప్రాజెక్టు లో భాగంగా ఆక్రమిత కాశ్మీర్‌ ‌గుండా వెళ్లే ఆర్థిక కారిడార్‌ ‌మరియు సరిహద్దు దేశాల్లో ఇతర ప్రాజెక్టుల ద్వారా  మన చుట్టూ  అష్టదిగ్బంధం చేయాలనుకున్న చైనా విధానాన్ని జీ 7 కూటమి అడ్డుకునేందుకు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌  అమెరికా దేశాలకు బిల్డ్ ‌బ్యాంక్‌ ‌బెటర్‌ ‌ఫర్‌ ‌ది వరల్డ్ ‌పేరుతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహకారం అందిస్తామనడం మనకు పరోక్షంగా మేలే.ప్రపంచ శక్తిగా ఎదగాలనే కాంక్షతో చైనా విపరీత పోకడలకు పోతూ, కొరోనాకు కారకురాలని ప్రపంచం కోడై కూస్తున్న  సందర్భంలో  జీ 7 దేశాలు కొరోనా మూలాలను శోధించాల్సిందేనని నిర్ణయించడం వారికే కాదు ప్రపంచ దేశాలకు ఆవశ్యకం. కారోనా టీకాకు పేటెంట్‌ ‌మినహాయింపులు కోరుతూ భారత్‌, ‌దక్షిణాఫ్రికా దేశాల ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించడం జీ 7 దేశాల్లో మన దేశ ప్రాధాన్యాన్ని సూచిస్తుంది.

జీ 7 తీర్మాణాల్లో కొరోనా అంతు చూడటం, ఆర్థిక పునరుజ్జీవనం, విశ్వసనీయ వాణిజ్యం, హరిత భూగోళం, పర్యావరణానికి ప్రపంచ భాగస్వామ్యం స్వాగతించదగ్గవే అయినప్పటికి దానికేమెరకు కట్టుబడుతావో చూడాలి. అయితే ఒక పక్క బ్రిక్స్ ‌కూటమిలో సభ్య దేశంగా ఉంటూ, షాంఘై  కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ ‌సమావేశాల్లో పాల్గొంటూ,మరోపక్క క్వాడ్‌ ‌లో సభ్య దేశంగా ఉంటూ, డి10 లో భాగస్వామి కావాలన్నప్పుడు విభిన్న ఆకాంక్షలతో కూడిన  కూటమీల మధ్య సయోధ్య కత్తిమీద సాములాంటిదే.

అమెరికా ఎన్నో దేశాల్లో తన స్వప్రయోజనాల కోసం నియంతృత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యన్ని ఏర్పాటు చేస్తామని దాడులు చేసి చివరికి చేతులెత్తేసిన అనుభవలున్నాయి. నియంతృత్వ, రాజరిక, సైనిక మద్దతున్న దేశాలకు, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశాలకు అమెరికా మద్దతిస్తూ డి10 గా మారి  ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటే నమ్మశక్యంగా లేదు. అధికార కాంక్షతో ప్రపంచ నాయకత్వానికి తహతహ లాడుతున్న చైనాకు చెక్‌ ‌పెట్టేందుకే జీ 7, డి10 గా మారలనుకుంటుందా? ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతం పై పట్టుకోసమే జీ 7, డి 10గా రూపం మార్చుకోనుందా?
జీ 7 , డి 10 గా మారిన అమెరికా  ప్రయోజనాలే ముఖ్యమౌతాయా?  మొదలైన ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చైనా పేర్కొన్నట్లు చిన్న కూటములు ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో చెల్లిపోయిందనేది ఎంత వాస్తవమే, పేద దేశాల ఆర్థిక అవసరాలే అవకాశాలుగా చైనా సామ్రాజ్యాన్ని విస్తరిస్తుందనేది అంతే వాస్తవం.
ఏది ఏమైనా జీ 7 కూటమైన, డి 10 కూట మైన, బ్రిక్స్ అయినా, క్వాడ్‌ అయిన మన దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యం. స్వీయ ప్రయోజనాల కోసం ప్రాశ్చాత దేశాలు ఎన్ని రూపాలు మార్చిన జాతి ప్రయోజనాలే పరమావదై, మన స్థల, జల ప్రాంతాలపై సార్వభౌమాధికారాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూనే భాగస్వాములు కావాలి.
– జుర్రు నారాయణ యాదవ్‌, ‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్‌నగర్‌, 9494019270.

Leave a Reply