వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భైంసాలో మతఘర్షణలు దేనికి నిదర్శనం..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

January 14, 2020

religious conflicts in violence BJP state president Laxman

మతోన్మాద ఎంఐఎంకు టీఆర్‌ఎస్‌ ‌పూర్తిగా దాసోహమైందిటీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మతోన్మాద ఎంఐఎంకు పూర్తిగా దాసోహమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ‌విమర్శించారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించిన కాంగ్రెస్‌, ‌మతోన్మాద ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్న టీఆర్‌ఎస్‌ ‌కలసి దేశ ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని నక్లెస్‌రోడ్‌లో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పతంగుల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి పగన్‌ ‌సింగ్‌ ‌కులస్తే పాల్గొన్నారు.

religious conflicts in violence? BJP state president Laxman

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ‌శాసన మండలిలో బీజేపీ నేత ఎన్‌.‌రాంచందర్‌రావు, పార్టీ నేతలు అమర్‌సింగ్‌ ‌తిలావత్‌, ‌మోత్కుపల్లి నర్సింహులు పాల్గొని పతంగులు ఎగుర వేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ తెలుగు సంస్క•తి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ ‌షా నిర్ణయాలకు సంఘీభావంగా సంక్రాంతి పండుగను దేశభక్తితో మిళితం చేసి సంబరాలు నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన సమయంలో కొంతమంది మతోన్మాదులు శాంతియుతంగా ఉన్న భైంసాలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితం కావడం దారుణమన్నారు. భైంసాలో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ద•నికి సంకేతమనీ, టీఆర్‌ఎస్‌ ‌పూర్తిగా ఎంఐఎంకు దాసోహమైందనడానికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. మతోన్మాద శక్తుల పట్ల టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ‌ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఈ వైఖరిని విడనాడని పక్షంలో ఆ పార్టీకి పుట్టగతులుండవని ఈ సందర్భంగా లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు.

Tags: religious conflicts, violence, bhainsa, BJP state president, Laxman, mim and trs