Take a fresh look at your lifestyle.

ఆధార్‌ ‌తనిఖీకి పౌరసత్వానికి లింకేమిటి?

What is Aadhaar enquire's link to citizenship?

క్రమ వలసదారులకు ఆధార్‌సంస్థ (యూఐడిఏఐ) నోటీసులు జారీచేయడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆధార్‌ ‌సంస్థ  అనుసరిస్తున్న ప్రక్రియ ప్రశ్న)కే కాదు. పౌరసత్వ చర్చకు  దారి తీస్తున్నాయి. హైదరాబాద్‌ ‌లో 120 మందికి ఆధార్‌ ‌సంస్థ నోటీసులు జారీ చేసింది. తాము అక్రమ వలసదారులం కామని రుజువు చేసే పత్రాలను సమర్పించమని ఆదేశించింది.ఈ నోటీసులకూ,పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియకూ ఎటువంటి సంబంధం లేదని ఆధార్‌ ‌సంస్థ స్పష్టం చేసినప్పటికీ,ఇద్దరు వ్యక్తుల విషయంలో వారి పౌరసత్వ రుజువుల పత్రాలను చూపమని అడగడంతో     అనుమానాలు రేకెత్తుతున్నాయి.  పాత బస్తీ ప్రాంతంలోని  తలాబ్‌ ‌కట్టా నివాసి మహ్మద్‌ ‌సత్తార్‌కు ఆధార్‌ ‌సంస్థ నుంచి నోటీసు వచ్చింది. సత్తార్‌ ‌నకిలీ ఆధారాలతో ఆధార్‌  ‌కార్డు పొందాడన్న ఆరోపణ లను పురస్కరించుకుని ఆయనకు నోటీసు పంపింది. ఆయన భారత జాతీయుడు కాడని ఆరోపణ వచ్చింది.అదే ప్రాంతానికి చెందిన 127 మంది స్థానికులు కూడా నకిలీ పత్రాలు సమర్పించి ఆధార్‌ ‌కార్డులు పొందినట్టు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తులు అక్రమంగా మన దేశంలో ప్రవేశించిన వలసదారులని తేలింది.

ఆధార్‌ ‌చట్టం ప్రకారం ఆధార్‌ ‌నంబర్లు రద్దు చేయడానికి వీలుంది. హైదరాబాద్‌లోని ఆధార్‌ ‌సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఈ ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చమని ఆదేశించింది, అందువల్ల హైదరాబాద్‌ ఆర్‌ ‌వో ఆధార్‌ ‌నంబర్లు పొందడానికి తగిన పత్రాలతో వచ్చి కలుసుకోవల్సిందిగా నోటీసులు పంపినట్టు ఆధార్‌ ‌సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. వారి నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత వారి వివరాలు నిఖార్సైనవైతే కొత్త నంబర్లు ఇస్తామని పేర్కొంది. అంతేకాక, ఆదార్‌ ‌కార్డుల తనిఖీ పరిశీలన అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందనీ,పౌరులెవరో,అక్రమ వలసదారులెవరో నిర్ధారించడం తమ పని కాదని ఆధార్‌సంస్థ స్పష్టం చేసింది.  అక్రమ వలసదారులు ఆధార్‌ ‌కార్డులు పొందడానికి అర్హులు కారని 2018 నవంబర్‌ ‌లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.రోహింగ్యా వలసదారులు పొందిన ఆధార్‌ ‌కార్డులను రద్దు చేసే ప్రక్రియను చేపట్టినట్టు ఆధార్‌ ‌సంస్థ సీఈఓ ఎబి పాండే తెలియజేశారు.కార్డులను రద్దు చేయడమే కాకుండా,తప్పుడు పత్రాలతో ఆధార్‌ ‌పొందిన వారు భవిష్యత్‌ ‌లో తిరిగి దర్యాప్తు చేయకుండా తగినచర్యలు తీసుకుంటామని చెప్పారు.  అందువల్ల ఆధార్‌ ‌సంస్థ హైదారాబాద్‌ ‌వాసులకు పంపిన నోటీసులు రెండు ప్రధానమైన ప్రశ్నలను సృష్టిస్తున్నాయి.2018  జూన్‌లోనే వైర్‌ ‌మీడియా ఈ విషయాన్ని బయట పెట్టింది. ఆధార్‌ ‌సంస్థ అంతర్గత అంచనాలు ఆ సమయంలో సూచనప్రాయంగా చెప్పినదేమంటే ఆధార్‌కు వ్యక్తుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోనే పనిలేదని స్పష్టం చేసింది.నంబర్లను బట్టి ఆధార్‌ ‌కార్డుల లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవసరం లేదని కూడా పేర్కొంది.అందువల్ల ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్న వారు వలసదారులని ఆధార్‌ ‌సంస్థ ఎలా గుర్తించిందన్న ప్రశ్న ఉదయిస్తోంది.

అంతేకాక, అక్రమ వలసదారులు తాము అధికారికంగానే భారత్‌లో ప్రవేశించినట్టు రుజువు పర్చే పత్రాలను సమర్పించాలని వారిని ఆదేశించడం జరిగింది.ఆరు మాసాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నవారి వీసా తదితర పత్రాలు పరిశీలించకుండానే ఆధార్‌ ‌కార్డులు ఇచ్చారా  ఈ 127 మంది అక్రమంగా దేశంలో ప్రవేశించినట్టయితే, వారిని వీసా తనిఖీ అధికారులు ఎలా అనుమతించారో నన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.వలస చట్టాన్ని ఉల్లంఘించినట్టయితే, వారిపై చర్య తీసుకోవల్సిందే, వలసదారుల తనిఖీ అధికారులు చెక్‌ ‌చేసి వారు అక్రమ వలసదారులని నిర్ధారించిన తర్వాతే వారి  కార్డు నంబర్లు రద్దు చేయాలి. అంతేకాక,ఆధార్‌ ‌కార్డుదారులను తాము స్థానికులమేనని రుజువు పర్చాలని అడిగే అధికారం ఆధార్‌ ‌కార్డు అధికారులకు ఎక్కడుందని ఈ నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు తరఫున వాదిస్తున్న న్యాయవాది ముజఫరుల్లా ప్రశ్నించారు, ఆధార్‌ ‌కార్డు కోసం దొంగపత్రాలు సమర్పించిన వారి కార్డు నంబర్లు రద్దు చేసే అధికారం మాత్రమే ఆధార్‌ ‌సంస్థకు ఉందనీ, పౌరసత్వాన్ని రుజువు చేయమని అడిగే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు.

‘‌ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply