తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే నీళ్ళు, నిధులు, నియామకాలు జరుగుతాయని అందరు భావించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు, రైతులకు. నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నదని జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్బవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేస్తూ గోదావరి బ్రిడ్జిపై జలదీక్ష చేయడానికి ప్రత్నించగా పోలీసులు గృహ నిర్బందం చేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం 10 గంటల సమయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి దీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజ కవర్గానికి గోదావరి జలాలను తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తూ వివక్షత చూపుతున్నదని అన్నారు. తాము శాంతియు తంగా నిరసన తెలుపాలని నిర్ణయం తీసుకున్నప్పటికి తమను హౌజ్ అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, పిఏసిఎస్ చైర్మెన్ బొక్క సత్తిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చాంద్ పాషా, ఎంపిటిసి తిరుపతి రెడ్డి, అశోక్ గౌడ్, మట్టెవాడ తిరుపతి తదితరులు పాల్గోన్నారు.