Take a fresh look at your lifestyle.

పసుపు బోర్డు హామీ ఏమయ్యింది

  • లోక్‌సభలో ప్రశ్నించిన కాంగ్రెస ఎంపి ఉత్తమ్‌
  • ‌దాటవేత సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి

తెలంగాణలో పసుపు బోర్డు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల నుంచి రైతులు పసుపు బోర్డు కోసం ఆందోళనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 80 శాతం పసుపు ఇండియాలో ఉత్పత్తి అవుతోందని, దాంట్లో 50 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతోందన్నారు. బోర్డు ఏర్పాటు చేయడంలో సమస్య ఏంటని ఆయన ప్రభుత్వాన్నిప్రశ్నించారు. బోర్డు ఏర్పాటు చేసి.. బెటర్‌ ‌వెరైటీలు పండించవచ్చున్నారు. తన ప్రశ్నకు ప్రభుత్వం క్లియర్‌ ఆన్సర్‌ ఇవ్వడంలేదన్నారు. పసుపు బోర్డు పెడుతున్నారా లేదా అని అడిగాం.. కానీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదన్నారు. రాజ్‌నాథ్‌, ‌ప్రకాశ్‌ ‌జవదేకర్‌, ‌రామ్‌ ‌మాదవ్‌ .. ఆ ‌నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. బోర్డు పెడుతామని హావి• ఇచ్చారని గుర్తు చేశారు.

ఉత్తమ్‌ ‌లేవనెత్తిన ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరుశోత్తం రూపాలా సమాధానం ఇచ్చారు. 50 మసాలాల కోసం బోర్డు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం నిజామాబాద్‌లో .. కేవలం పసుపు కోసం ప్రత్యేక సెంటర్‌ ‌పెట్టినట్లు చెప్పారు. కానీ ప్రత్యేక బోర్డు పెట్టలేదని మంత్రి తెలిపారు. ఈ సందర్భంలో ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ.. కేవలం స్పైస్‌ ‌బోర్డు ఎక్స్‌టెషన్‌ ‌మాత్రమే నిజామాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు మంత్రి చెబుతున్నారని అన్నారు. టర్మరిక్‌ ‌బోర్డు ఏర్పాటు చేస్తే .. ఆ రైతు సమస్యలన్నీ పరిష్కరించవచ్చు అని తెలిపారు. పసుపు రైతుల మద్దతు కోసం.. స్థానిక ప్రభుత్వంతో కలిసి పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పరుశోత్తం మరోసారి తెలిపారు.

ఆ పార్క్‌తో కొత్త వెరైటీలతో ఉత్పత్తి పెంచనున్నట్లు తెలిపారు. పసుపు రైతుల కోసమే ఆ ఎక్స్‌టెషన్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒక మసాలా కోసం కాదు, 50 మసాలాల కోసం ఆ సెంటర్‌ ‌పనిచేస్తుందన్నారు. స్థానిక యూనివర్సిటీ సాయంతో.. కొత్త వెరైటీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కానీ పసుపు బోర్డుపై మాత్రం మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. జాతీయ టర్మరిక్‌ ‌బోర్డును ఏర్పాటు చేయాలని కర్నాటక ఎంపీ బచ్చే గౌడ డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply