Take a fresh look at your lifestyle.

తెలంగాణా బడ్జెట్‌ ‌నుండి.. వ్యవసాయ రంగం ఏమి ఆశిస్తున్నది?

“ప్రణాళిక కేటాయింపులు(ప్రగతి పద్దు) భారీగా వుంటున్నా, నిధుల విడుదల, ఖర్చు ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం, అసలు, వడ్డీలు, ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో చెల్లించాల్సి రావడం వల్ల, అంతిమంగా కీలక రంగాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. ప్రధానరంగాలకు కేటాయింపులు భారీగా చేస్తున్నట్లు కనిపించినా, సంవత్సరం చివరిలో సవరించిన అంచనాలు చూస్తే అసలు విషయం బోధపడుతుంది. కేటాయింపులకు, ప్రభుత్వం వాస్తవంగా చేసే ఖర్చులకు పొంతన ఉండడం లేదు.”
Increased priority, agriculture, wheat, rice, director rana
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రధానంగా రెండు రూపాల్లో వ్యక్తమవుతుంటుంది. ఒకటి – 5 సంవత్సరాల కొకసారి జరిగే ఎన్నికలు. రెండు – ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌. ‌భారత ఎన్నికల వ్యవస్థ ఎలా రూపొందిందో, ఎంతగా దిగజారిందో మనం చూస్తున్నాం. ఓటింగ్‌ ‌సరళి, ఓట్ల కోసం అనుసరిస్తున్న పద్ధతులు, ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధుల నైతికత, స్థాయి, ప్రజలకు ఇచ్చిన హాల అమలులో పార్టీల వైఫల్యం – మొత్తంగా ఒక ప్రజాస్వామిక ప్రక్రియ ఎంత ప్రవాహనంగా మారిందో అందరం గమనిస్తున్నదే.ఇక బడ్జెట్ల విషయానికి వస్తే, రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లకు నిర్ధిష్ట ప్రాతిపదిక ఏ ?ండడం లేదు. బడ్జెట్‌ ‌పరిమాణాన్ని అనంతంగా పెంచుకుంటూ పోతున్నారు. కానీ ప్రతి సంవత్సరం ఆ బడ్జెట్‌ అమలు తీరు నాసిరకంగా ?ంటున్నది. ప్రభుత్వం వేసుకుంటున్న రెవెన్యూ (ఆదాయం) అంచనాలు తప్పిపోతున్నాయి. ప్రణాళిక కేటాయింపులు (ప్రగతి పద్దు) భారీగా వుంటున్నా, నిధుల విడుదల, ఖర్చు ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం, అసలు, వడ్డీలు, ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో చెల్లించాల్సి రావడం వల్ల, అంతిమంగా కీలక రంగాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. ప్రధానరంగాలకు కేటాయింపులు భారీగా చేస్తున్నట్లు కనిపించినా, సంవత్సరం చివరిలో సవరించిన అంచనాలు చూస్తే అసలు విషయం బోధపడుతుంది. కేటాయింపులకు, ప్రభుత్వం వాస్తవంగా చేసే ఖర్చులకు పొంతన ?ండడం లేదు. పైగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం వరకే ఒక క్రమపద్ధతి పాటిస్తున్నది తప్ప, అంతకు మించి బడ్జెట్‌కు ఎటువంటి చట్టబద్ధత ?ండడం లేదు. కేటాయించిన నిధులు విడుదల చేయకపోయినా, ఖర్చు చేయకపోయినా, నిధులను దారి మళ్లించినా అడిగే పరిస్థితి లేదు.

పైగా రాష్ట్ర బడ్జెట్‌లను విశ్లేషించి, ‘కాగ్‌’ ‌సంస్థ నివేదికలను వెలువరిస్తే తప్ప, బడ్జెట్‌ల పరంగా నిజంగా ఏం జరుగుతోందో ప్రజలకు తెలియడం లేదు. గత 5 సంవత్సరాల తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌లను విశ్లేషిస్తే, ఇదే విషయం స్పష్టమవుతుంది. చాలా సందర్భాలలో, కేటాయింపులలో చేసిన ఖర్చు సగం కూడా లేదు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ ‌నిధులు 50 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. పైగా నిధుల కోతకు గురవుతున్న రంగాలలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక, సంక్షేమ రంగాలు వుంటున్నాయి.ఈ నేపధ్యంలో 2020-21 సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 2019-20 బడ్జెట్‌ ‌నుండే, వాస్తవిక బడ్జెట్‌ ‌పేరుతో అనేక రంగాలకు కోతలు పడ్డాయి. ఈ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు కూడా నిధులు విడుదల కావడం లేదు.ప్రతి నెలా జీతాలకే కటకట పడుతున్న స్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వుంది. సాధారణ, అత్యవసర చెల్లింపులకు కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవని వార్తలు వస్తున్నాయి. అన్ని రంగాలలో బకాయిలు పెరిగిపోతున్నాయి. చివరికి కలెక్టర్ల దగ్గర ?ండాల్సిన ‘కనీస నిధి’ కూడా విడుదల కావడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఈ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర వ్యవసాయ కుటుంబాలను సంక్షోభం నుండి బయట పడేయాలంటే 2020-21 బడ్జెట్‌ ‌కేటాయింపులలో విచక్షణతో కూడిన శాస్త్రీయ దృక్పథం ?ండాలి. అందుకోసం మేము కొన్ని నిర్ధిష్ట ప్రతిపాదనలు పెడుతున్నాం.వాస్తవ సాగుదారులుగా వున్న సన్న, చిన్నకారు, క్రింది మధ్యతరగతి, మధ్య తరగతి (10 ఎకరాల లోపు) రైతులకు మాత్రమే రైతుబంధు పథకాన్ని అమలు చేయాలి. వ్యవసాయం చేయని భూ యజమానులకు రైతు బంధు పేరుతో నిధులు దుర్వినియోగం చేయకుండా, ఆయా భూములలో సాగు చేస్తున్న కౌలు రైతులకు మాత్రమే ‘రైతు బంధు’ చెల్లించాలి.

షెడ్యూల్డ్ ‌ప్రాంతాలలో ఆదివాసీ పోడు రైతులకు, దేవాదాయ భూములు సాగు చేస్తున్న సన్న, చిన్నకారు, కౌలు రైతులకు ‘రైతు బంధు’ చెల్లించాలి. అందుకోసం తగినన్ని నిధులు బడ్జెట్‌లో కేటాయించి, సకాలంలో విడుదల చేయాలి.ప్రభుత్వం హా ఇచ్చిన మేరకు వాస్తవ సాగుదారులుగా వున్న సన్న, చిన్నకారు రైతుల రుణాలను ఒకే దఫాగా మాఫీ చేయాలి. వ్యవసాయం చేయని భూయజమానుల రుణాలను మాఫీ చేయాల్సిన అవసరం లేదు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకాడుతున్నందున, కౌంటర్‌ ‌గ్యారంటీగా ప్రభుత్వం, తన బడ్జెట్‌లో కనీసం 1000 కోట్లు కేటాయించాలి. ప్రకృతి వైపరిత్యాలు పెరుగుతున్న దశలో రైతులను ఆదుకోవడానికి పంటల బీమా తప్పనిసరి. కానీ బీమా పథకాలను బ్యాంకులు ఇచ్చే పంట రుణాలకు లింక్‌ ‌చేయడం వల్ల ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం లేకుండా పోతున్నది. కాబట్టి ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా 10 ఎకరాల లోపు రైతుల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలి. గ్రాణ ప్రాంతాలలో రైతుల సహకార సంఘాలకు, ?త్పత్తిదారుల కంపనీలకు ప్రోత్సాహం ఇస్తూ, వాటి నిర్వహణకు, వాటి ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పనకు, యంత్రాలతో కూడిన కస్టమ్‌ ‌హైరింగ్‌ ‌సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.గ్రామ పంచాయితీ స్థాయిలో గ్రాణ ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించేందుకు గాను తగినంత మంది సిబ్బందిని గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయాలి. అందుకవసరమైన నిధులను కేటాయించాలి.రైతులు పండించే పంటలకు రాష్ట్రంలో ?త్పత్తి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే కనీస మద్ధతు ధరలు వారికి గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపధ్యంలో పంటల ?త్పత్తి ఖర్చులు తగ్గేలా, సుస్థిర, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. రాష్ట్ర స్థాయిలో ?త్పత్తి ఖర్చులకు అనుగుణంగా ధరలు చెల్లించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి రైతులకు బోనస్‌గా చెల్లించాలి. భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతులకు అమలు చేస్తున్న ‘రైతు బీమా’ పథకాన్ని, కుటుంబం యూనిట్‌గా గ్రాణ ప్రజలందరికీ వర్తింప చేయాలి. అందుకవసరమైన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. దాని కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.కేంద్రం సహాయంతో రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహించడం, రాష్ట్ర స్థాయిలో వాస్తవ సాగుదారులగా వున్న కౌలు, మహిళా రైతులను గుర్తించడం, శాస్త్రీయ పద్ధతిలో పంటల ?త్పత్తి ఖర్చులను లెక్కించడం, రైతులలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన ప్రచారం, శిక్షణలు నిర్వహించడం – పెద్దగా రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా చేయగలిగిన పనులు. కానీ అవసరమైన పనులు.ఈ కార్యక్రమాలు ఎక్కువ మంది గ్రాణ ప్రజలకు భరోసా ఇస్తాయి. వారి ఆదాయాలు పెంచుతాయి. ఆత్మహత్యలను ఆపుతాయి.

కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, ఫోన్‌: 9912928422

Leave a Reply