Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌బలహీన పడటానికి కారణం?

“మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితికి పాత,కొత్త తరాల మధ్య వైరమే కారణం.అయితే,నాయకత్వం కోసం పోటీ పెరగడం వల్లనే అలా జరిగిందని హైకమాండ్‌ ఆత్మసంతృప్తి చెందవచ్చు. కానీ, అది వాస్తవం కాదు. ఆత్మపరిశీలన చేసుకోకపోవడమే అసలు కారణం. జాతీయ స్థాయిలో సరైన నాయకత్వం లేదు. సోనియాగాంధీ అనారోగ్యం వల్ల దృష్టి సారించలేకపోతున్నారు. దలారులు ఆమెను పెడతోవ పట్టిస్తున్నారు. హైకమాండ్‌లో తెలివైన,మేథోపరమైన ప్రతిభ గలవారు కూడా లేరు. బలమైన నాయకులు అంతకన్నా లేరు.జనాకర్షణ కలిగిన వారు ముందే లేరు. కాంగ్రెస్‌ ‌ప్రస్తుత పరిస్థితికి ఎవరినో నిందించి ప్రయోజనం లేదు.ఇది పూర్తిగా స్వయంకృతం.”

నూటముప్పయి సంవత్సరాల కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయి ఢిల్లీలోని 10 జన్‌ ‌పథ్‌లో కునారిల్లుతోంది. ఆ పార్టీ అంత బలహీన పడటానికి కారణం ఏమిటి..ఎవరు కారకులు, పార్టీని బతికించుకునే యత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే, అదీ లేదు. పార్టీ నాయకులు, శ్రేణుల్లో నిరాశా నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పరిణామాలే ఇందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామలు ఒక్కరోజులో సంభవించినవి కావు. ఒక్క రాత్రిలో చోటు చేసుకున్నవీ కావు. కాంగ్రెస్‌ ‌లెజిస్లేచర్‌ ‌పార్టీలో అసంతృప్తి కొంత కాలంగా సాగుతో ంది. పాత తరం నాయకుల ధోరణి పట్ల యువతరం నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇక్కడ ప్రధానమైన ప్రశ్న జ్యోతిరాదిత్య సింధియా ఏ విధంగా మోసగించబడ్డారన్నదే. సింధియా రాజకీయ అవకాశవాది అని కాంగ్రెస్‌ ‌నాయకులు అంటున్నారు. సింధియా అవకాశవాదం గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం శుద్ధ దండగ, కాలహరణం తప్ప ఏమీ లేదు. అదే సందర్భంలో కాంగ్రెస్‌ ‌నాయకత్వం ఈ పరిస్థితి పట్ల ఎలా వ్యవహరించిందని చర్చించుకోవడం కూడా కాలం వృధాయే. కాంగ్రెస్‌ ‌పార్టీలో లోపం ఏదో ఉంది. అది నిజం కాకపోతే పార్టీలో యువతరం నాయకులను కోల్పోదు. పాతకాల నాయకులను పక్కన పెట్టి యువ తరం నాయకులతో పార్టీని పునరుజ్జీవింప జేయాల్సిన సమయం ఇది. మధ్య ప్రదేశ్‌లో పరిస్థితి గడిచిన కొంత కాలంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. దీనిని చక్కదిద్దడంలో పార్టీ అధిష్టానం విఫల మైంది.

యువతరం వాదననూ, వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు. వారి ఫిర్యాదులపై దృష్టి పెట్టలేదు. పాత నాయకత్వంపై• ఫిర్యాదులు చేసేందుకు యవతరం నాయకులు చాలా కాలంగా ఎదురు చూశారు. కానీ,వారికి ఆ అవకాశం రాలేదు. అలాగే, గాంధీ కుటుంబంలో సభ్యులు పార్టీ వ్యవహా రాల పట్ల ఏ విధంగా ఉదాసీనంగా ఉంటున్నారో కూడ స్పష్టం అవుతోంది. కాంగ్రెస్‌లో వంశ పారంపర్య రాజకీ యాలు ఎంతో కాలంగా ఉన్నాయి. సోనియా స్థానే రాహుల్‌ని పార్టీ అధ్యక్షుణ్ణి చేశారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. అయినా, మళ్లీ రాహులే పార్టీ పగ్గాలు పట్టాలంటూ కోరస్‌ అం‌దుకుం టున్న వారు చాలా మంది ఉన్నారు.

అది మంచిదైతే, జ్యోతి రాదిత్య సింధియా కూడా వారసత్వ ప్రాతిపదికపై ముఖ్యమంత్రి పదవిని ఆశించడంలో తప్పులేదు. రాహుల్‌ ‌నాయకత్వంలో ఎన్నికలకు పార్టీ వెళ్ళింది. పార్టీకి లాభం జరగలేదు సరికదా మరింత చేటు ఎదురైంది. తెలంగాణలో పాతతరం నాయకుడు ఒకరు ఇచ్చిన సలహా కారణంగా వైఎస్‌ ‌జగన్‌ ‌వంటి మెరికలాంటి నాయకుణ్ణి కాంగ్రెస్‌ ‌కోల్పోయింది. ఆయన చెప్పింది వినకపోవడం వల్లనే పార్టీపై తిరుగుబాటు చేశారు. పోనీ అలా చేసినా తెలంగాణ నాయకుల సలహా ప్రకారం నడుచుకున్నా పార్టీకి ఏమాత్రం మంచి జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన వల్ల తెలంగాణలో పార్టీకి మంచి జరుగుతుందని పాత తరం నాయకులు సోనియాకు నూరి పోశారు. కానీ, అది నిజం కాలేదు. రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్‌ ‌సహజంగానే ఆంధ్రప్రదే శ్‌లో ప్రజలకు దూరం అయింది. ఇటువంటి నిర్ణయా లతో ఆంధ్ర, తెలంగాణాల్లోనే కాకుండా యావత్‌ ‌దక్షిణాది అంతటా కాంగ్రెస్‌ ‌ఖాళీ అయింది.

మధ్య ప్రదేశ్‌లో పాత తరం నాయకుల ఒత్తిడికిలోనై కాంగ్రెస్‌ ఉన్న గూడు పోగొట్టుకుంది. రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటో హైకమాండ్‌కి తెలియడం లేదు. రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం హైకమాండ్‌ ‌చేయడం లేదు. మధ్య ప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితికి పాత, కొత్త తరాల మధ్య వైరమే కారణం. అయితే, నాయకత్వం కోసం పోటీ పెరగడం వల్లనే అలా జరిగిందని హైకమాండ్‌ ఆత్మసంతృప్తి చెందవచ్చు. కానీ, అది వాస్తవం కాదు. ఆత్మపరిశీలన చేసుకోకపోవడమే అసలు కారణం. జాతీయ స్థాయిలో సరైన నాయకత్వం లేదు. సోనియా గాంధీ అనారోగ్యం వల్ల దృష్టి సారించలే కపోతు న్నారు.దలారులు ఆమెను పెడతోవ పట్టిస్తున్నారు. హైక మాండ్‌లో తెలివైన, మేథోపరమైన ప్రతిభ గలవారు కూడా లేరు. బలమైన నాయకులు అంతకన్నా లేరు. జనాకర్షణ కలిగిన వారు ముందే లేరు. కాంగ్రెస్‌ ‌ప్రస్తుత పరిస్థితికి ఎవరినో నిందించి ప్రయోజనం లేదు. ఇది పూర్తిగా స్వయ ంకృతం.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply